ముందస్తు మోడీ సాయంతోనా..? మోడీపై భయంతోనా ..?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ పై భయంతోనే కేసీఆర్ ముందస్తుకు వెళ్లారని… బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విమర్శలు గుప్పించారు. ముందస్తుకు వెళ్లి ప్రజలపై భారం వేశారని విమర్శలు గుప్పించారు. షెడ్యూల్‌ ప్రకారం 2019లో ఎన్నికలు జరిగితే…మోదీ ప్రభావం తనపై పడుతుందని కేసీఆర్‌ భయపడ్డారన్నారు. అందుకే 9 నెలలు ముందుగానే ఎన్నికలకు వెళ్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఎన్నికల హామీలు ఏమీ అమలు చేయలేదని విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తానన్న హామీ ఏమైపోయిందని అమిత్‌షా ప్రశ్నించారు. దళితుడిని సీఎం చేసే ఉద్దేశం కేసీఆర్‌కు లేదని కొడుకునో, కూతురునో సీఎం చేయాలని కేసీఆర్‌ చూస్తున్నారని విర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని తేల్చారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మాట తప్పారు, లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని నిలబెట్టుకోలేదు, ఇప్పటికీ తెలంగాణలో 2లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నయన్నారు. నాలుగున్నరేళ్లలో ఒక్క లెక్చరర్‌ పోస్టును భర్తీ చేయలేదన్నారు. పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టిస్తామని… ఇప్పటివరకు 5 వేల ఇళ్లను కూడా నిర్మించలేదని విర్శించారు. తెలంగాణ అమరుల కుటుంబాలను కేసీఆర్‌ మోసం చేశారని మండిపడ్డారు.

తెలంగాణకు కేంద్రం రూ.99వేల కోట్లు కేటాయించినా… సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోయారని అమిత్‌షా విమర్శించారు. రైతుల ఆత్మహత్యల పాపం టీఆర్‌ఎస్‌దేనని తేల్చారు. తెలంగాణ ప్రజలకు నమ్మకద్రోహం చేసిన టీఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలని అమిత్ షా పిలుపునిచ్చారు. బీజేపీకి అవకాశమిస్తే…తెలంగాణలో అభివృద్ధి చేసి చూపుతామన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్‌ 17ను అధికారికంగా జరుపుతమన్నారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్‌ కల్పిస్తే బీసీలకు నష్టమన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని తేల్చారు. చంద్రబాబుపైనా అమిత్ షా విమర్శలు చేశారు. తెలంగాణలో మహాకూటమి గెలిస్తే… ఎంఐంఎంకు వ్యతిరేకంగా పోరాడగలదా? అని ప్రశ్నించారు. ఎంఐఎంను ఎదుర్కొనే దమ్ము బీజేపీకే ఉందన్నారు.

కరీంనగర్ సభలో అమిత్ షా… టీఆర్ఎస్ పై కాస్త కటువుగా మాట్లాడేందుకు ప్రయత్నించారు. తాము కూడా ప్రత్యామ్నాయమే అని చెప్పుకోవాలని ఆరాటపడ్డారు. ఈ విషయంలో… అమిత్ షా చేసిన ప్రసంగంపై సహజంగానే ఎన్నో అనుమానాలు తలెత్తుతాయి. బీజేపీ మద్దతు లేకుండా.. కేసీఆర్ ముందస్తుకు వెళ్లడం సాధ్యమయ్యే విషయం కాదు. అయినా అదంతా తమకు తెలియదన్నట్లుగా… కేసీఆర్ పై విమర్శలు చేశారు. పైగా.. నాలుగు రాష్ట్రాలతో పాటు ఎన్నికలు జరిపేందుకు ఈసీపై ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కేంద్రం 99వేల కోట్లు ఇచ్చిందని.. ఇక సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం, మిగన్ భగీరధలకు.. నిదులివ్వాలని మొరపెట్టుకున్నా… నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపణలు చేసింది. మొత్తానికి అమిత్ షా… అధికార వ్యతిరేక ఓటు చీల్చేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో విచారణకు ఆదేశించిన నిమ్మగడ్డ..!

స్టేట్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో చేసిన వాస్తు మార్పులపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సీరియస్ అయ్యారు. ఎవరు చెబితే ఆ మార్పులు చేశారో తనకు తెలియాలంటూ..విచారణకు ఆదేశించారు. నిమ్మగడ్డ తన ఆఫీసులో జరిగిన...

అమరావతిని కొనసాగిస్తే పదవుల్ని ఇచ్చేస్తాం..! జగన్‌గు చంద్రబాబు ఆఫర్..!

అమరావతిని ఏకైక రాజధాని కొనసాగిస్తూ... ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే... తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పదవులను వదిలేస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు.. ముఖ్యమంత్రి జగన్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు...

జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్..!

జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసిన తర్వాతి రోజే...అంటే జూన్ 13న హైదరాబాద్‌లో వారిని అరెస్టు చేసిన పోలీసులు అనంతపురంకు తరలించారు....
video

క‌ల‌ర్ ఫొటో టీజ‌ర్‌: బ్లాక్ అండ్ వైట్ కాంబో

https://www.youtube.com/watch?v=T-R3h9va2j4&feature=emb_title ప్రేమ గుడ్డిది. చెవిటిది. మూగ‌ది కూడా. దానికి ప్రేమించ‌డం త‌ప్ప బేధాలు తెలీవు. న‌ల్ల‌ని అబ్బాయి.. తెల్ల‌ని అమ్మాయి ప్రేమించుకోవ‌డం కూడా వింతేం కాదు. కానీ.. మ‌ధ్య‌లోకి ఓ పులి వ‌చ్చింది....

HOT NEWS

[X] Close
[X] Close