కేసీఆర్ తీరుపై అమిత్ షా స‌మ‌క్షంలో చ‌ర్చ‌..!

ఆర్టీసీ కార్మికుల స‌మ్మె ప్రారంభించి నెల దాటేసింది. ఈ నెల‌లో స‌మ్మెను విర‌మింప‌జేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం చేసిన ప్ర‌య‌త్నాలు ఎలాంటివో తెలిసిందే. త‌న నిర్ణ‌య‌మే ఫైన‌ల్ అన్న‌ట్టుగా మొండి ప‌ట్టుద‌ల‌తో సీఎం కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స‌మ్మె నేపథ్యంలో ప్ర‌భుత్వం తీరుపై కేంద్ర హోం హాఖ మంత్రి అమిత్ షాకి రాష్ట్ర భాజ‌పా నేత‌లు వివ‌రించారు. కార్మికుల విష‌యంలో ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌పై అమిత్ షాతో అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్‌, గ‌రిక‌పాటి, వివేక్, మోత్కుప‌ల్లి న‌ర్సింహులు చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా అమిత్ షా చెప్పింది ఏంటంటే… ఆర్టీసీ కార్మికుల‌కు అండ‌గా ఉండాల‌నీ, వారికి అన్ని ర‌కాలుగా మ‌ద్ద‌తు ఇవ్వాల‌న్నారు! ఉద్య‌మ స‌మ‌యంలో ఆర్టీసీ ఉద్యోగులను ప్ర‌భుత్వోద్యోగులుగా ప‌రిగ‌ణిస్తామ‌ని కేసీఆర్ హామీ ఇచ్చిన అంశాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ప్ర‌స్తుతం ప్రైవేటీక‌ర‌ణ పేరుతో కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తోపాటు, కార్మికుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై కూడా అమిత్ షాకి వివ‌రాలు ఇచ్చారు.

రాష్ట్ర భాజ‌పా నేత‌ల‌కు అమిత్ షా ఇచ్చిన మార్గ‌ద‌ర్శ‌కాలు చూస్తుంటే… ఇక‌పై ఆర్టీసీ సమ్మెకు అన్ని ర‌కాలుగా భాజ‌పా మ‌ద్ద‌తుగా నిలుస్తుంద‌నే అనిపిస్తోంది. ఇంత‌వ‌ర‌కూ ప్రెస్ మీట్లు, విమ‌ర్శ‌ల‌కు మాత్ర‌మే భాజ‌పా నేత‌లు ప‌రిమిత‌మౌతూ వ‌చ్చారు. కార్మికుల త‌ర‌ఫున నిర‌స‌న‌ల విష‌యంలో కాంగ్రెస్ పార్టీ వారి సొంత కార్యాచ‌ర‌ణ‌తో ముందుకెళ్లింది. ఇక‌పై భాజపా కార్యాచ‌ర‌ణ ఎలా ఉంటుందో చూడాలి. రాష్ట్ర నేత‌లే నేరుగా రంగంలోకి దిగుతారా, ఇత‌ర పార్టీల‌నూ క‌లిసొచ్చే సంఘాల‌నూ క‌లుపుకుని ఐక‌మ‌త్యంగా కార్యాచ‌ర‌ణ రూపొందిస్తారా అనేది వేచి చూడాలి. ఈనెల 9న భాజ‌పా వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ న‌డ్డా హైద‌రాబాద్ వ‌స్తున్నారు. ఢిల్లీలో అమిత్ షాని క‌లిసిన మోత్కుప‌ల్లి న‌ర్సింహులు, అధికారికంగా న‌డ్డా స‌మ‌క్షంలో 9న‌ పార్టీలో చేర‌బోతున్నారు. అదే రోజున ఆర్టీసీ కార్మికుల‌తో ఏదైనా నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించే అవ‌కాశం ఉంద‌ని భాజ‌పా వ‌ర్గాలు అంటున్నాయి.

రాజ‌కీయంగా చూసుకుంటే సీఎం కేసీఆర్ మీద ఒత్తిడి పెంచేందుకు భాజ‌పాకి ఒక స‌మ‌స్య దొరికింది! వ్య‌వ‌హారం అమిత్ షా దాకా వెళ్లింది కాబ‌ట్టి, కార్యాచ‌ర‌ణ ఉండొచ్చు. వ‌చ్చే నెల‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ వ‌చ్చే అవ‌కాశం ఉంది, ఈ ఎన్నిక‌ల్లో మంచి ఫ‌లితాలు సాధించాలంటే.. ఇదో బ‌ల‌మైన ప్ర‌చారాస్త్రంగా భాజ‌పా మార్చుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఎలాగూ, కాశ్మీరు అంశం, హిందుత్వల‌ను ప్ర‌చారం చేసుకుంటారు. ఇప్పుడీ స్థానిక అంశాన్ని కూడా అనుకూలంగా మార్చుకునేట్టే ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పార్టీ వేరు.. ప్రభుత్వం వేరంటున్న ఆర్ఆర్ఆర్..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో విందు భేటీ నిర్వహించారు. ఆయన రాజకీయం కొద్ది రోజులుగా బీజేపీ చుట్టూనే తిరుగుతోంది. మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా.. పొగుడుతూ...

“ఉస్మానియా” పాపం ప్రతిపక్షాలదేనా..?

ఉస్మానియా ఆస్పత్రి ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు కేంద్రంగా మారింది. బుధవారం పడిన వర్షానికి ఉస్మానియా మొత్తం నీళ్లు నిండిపోవడం.. చికిత్స గదుల్లో కూడా నీరు చేరడంతో.. విపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. ఐదేళ్ల...

సంతోష్ కుమార్ చాలెంజ్ అంటే స్వీకరించాల్సిందే..!

కొద్ది రోజులుగా మీడియాలో.. సోషల్ మీడియాలో ఓ వార్త రెగ్యులర్‌గా కనిపిస్తోంది. అదే.. ప్రభాస్.. బ్రహ్మానందం.. సమంత లాంటి స్టార్లు.. మొక్కలు నాటుతూ.. చాలెంజ్‌ను కంప్లీట్ చేయడం.. ఆ చాలెంజ్‌ను మరికొంత...

కరోనా రాని వాళ్లెవరూ ఉండరు : జగన్

భవిష్యత్‌లో కరోనా వైరస్ సోకని వాళ్లు ఎవరూ ఉండదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. ప్రస్తుతం కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయని.. ఎవరూ వాటిని ఆపలేరని వ్యాఖ్యానించారు. కరోనా ఆపడానికి...

HOT NEWS

[X] Close
[X] Close