తెలంగాణ‌కు నెల‌కోసారి అమిత్ షా… తెరాస పాల‌న‌పై ఫోక‌స్‌!

తెలంగాణలో పార్టీ విస్త‌ర‌ణ‌పై భాజ‌పా ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్న సంగ‌తి తెలిసిందే. అందుకే, నాయ‌కుల చేరిక‌లు, స‌భ్య‌త్వ న‌మోదు అంటూ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇక్క‌డే సంద‌డి చేశారు. అయితే, మిగ‌తా రాష్ట్రాల‌తో స‌మానంగా తెలంగాణ‌ను అమిత్ షా చూడ్డం లేద‌ని అర్థ‌మౌతోంది. ఇక్క‌డ మ‌రింత శ్ర‌ద్ధ పెట్ట‌నున్నారు! ఇక‌పై నెల‌కోసారి అమిత్ షా హైద‌రాబాద్ వ‌స్తారని రాష్ట్ర అధ్యక్షుడు ల‌క్ష్మ‌ణ్ చెప్పారు. కేంద్ర హోంమంత్రి క‌దా, ఆయ‌న‌కి అంత తీర‌క ఉంటుందా అంటే, రాష్ట్రంలో పార్టీ బ‌లోపేతానికి ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని ల‌క్ష్మ‌ణ్ అన్నారు. ప్ర‌తీనెలా అమిత్ షా ప‌ర్య‌ట‌న ఉంటుంద‌నీ, ఈ స‌మ‌యంలో పార్టీ విస్త‌ర‌ణ కార్య‌క్ర‌మాల‌తోపాటు తెలంగాణ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై కూడా ప్ర‌త్యేక దృష్టి సారించి విశ్లేష‌ణ‌లు చేస్తార‌ని చెబుతున్నారు. దీంతో అధికార పార్టీ నేత‌ల‌కు ఇక నిద్ర ప‌ట్ట‌ద‌న్నారు ల‌క్ష్మ‌ణ్‌.

కేంద్ర ప‌థ‌కాల‌ను కేసీఆర్ అమలు చేయ‌డం లేద‌నీ, ఇక‌పై వాటిపై అమిత్ షా ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెడ‌తార‌ని ల‌క్ష్మ‌ణ్ చెప్పారు. దీంతోపాటు, రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల్లో లోపాల‌ను భాజ‌పా ప్ర‌శ్నిస్తుంద‌నీ, తెరాస మీద విమ‌ర్శ‌లు చేస్తుంద‌ని అన్నారు. కాళేశ్వరానికి జాతీయ హోదా రాలేద‌ని విమ‌ర్శించ‌డం స‌రికాద‌నీ, కేంద్రం సాయం అంద‌క‌పోతే అది పూర్త‌య్యేది కాద‌న్నారు ల‌క్ష్మ‌ణ్‌. మిష‌న్ భ‌గీర‌థ‌ను ప్ర‌ధాని కాపీ చేశార‌ని కేటీఆర్ అంటున్నారన‌డం అర్థం లేనిద‌న్నారు. గ‌తంలో గుజ‌రాత్ లో అమ‌ల్లో ఉన్న ప‌థ‌కాన్ని కాపీ చేసిందే కేసీఆర్ క‌దా అని ప్ర‌శ్నించారు.

మొత్తానికి, రాష్ట్రంలో ఇక‌పై అన్ని అంశాల‌పైనా భాజ‌పా మాట్లాడేందుకు బేస్ సిద్ధం చేసుకుంటోంది. ఇక్క‌డ‌ ప్ర‌తిప‌క్ష పార్టీ అంటూ ఏదీ బ‌లంగా లేదు. ఉన్న కాంగ్రెస్ పార్టీకి కూడా ప్ర‌తిప‌క్ష‌ హోదా ద‌క్క‌నీయ‌కుండా తెరాస చేసింది. గెలిచిన కొద్దిమంది ఎమ్మెల్యేల‌నూ ఆక‌ర్షించి, ఏకంగా సీఎల్పీని విలీనం చేసేసింది. దీంతో, తెరాస మాట‌‌కు అసెంబ్లీలో తిరుగు ఉండ‌కూడ‌దు అనే పంతాన్ని సీఎం కేసీఆర్ నెగ్గించుకున్నారు. ఓర‌కంగా ఈ వైఖ‌రే ఇప్పుడు భాజ‌పాకి అవ‌కాశం ఇచ్చింద‌ని చెప్పొచ్చు. తెలంగాణ‌లో ఇక‌పై ప్ర‌తిప‌క్ష పాత్ర‌ను పూర్తిస్థాయిలో పోషించేందుకు భాజ‌పా సిద్ధ‌మౌతోంది. అంటే, రాష్ట్రంలో కేంద్ర‌మే ప్ర‌తిప‌క్ష పాత్రకు రెడీ అవుతున్న‌ట్టే. మ‌రి, ఈ ప‌రిస్థితిని కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close