ల‌క్ష కుటుంబాల క‌డుపు నింపనున్న బిగ్ బీ

ప్రార్థ‌న చేసే పెద‌వులు కాదు, ట్వీట్లు చేసే వేళ్లు కాదు, సేవ చేసే చేతులే ఇప్పుడు కావాలి. ప్ర‌పంచం మొత్తం ఇప్పుడు క‌రోనా దిగ్భంధ‌నంలో ఉంది. ఆక‌లి కేక‌లు మిన్నంటుతున్నాయి. ఆక‌లి చావులు కూడా చూస్తామేమో అన్న భ‌యం వ్యాప్తిస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో కాలుతున్న క‌డుపులు నింప‌డానికి చాలామంది ముందుకొస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా సెల‌బ్రెటీలు త‌మ వంతు స‌హాయం అందిస్తున్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వ‌ర‌కూ స్టార్లు, సూప‌ర్ స్టార్లంతా క‌రోనాపై పోరాటానికి త‌మ మ‌ద్ద‌తు తెలిపారు. భారీగా విరాళాలు ప్ర‌క‌టించారు. ఇప్పుడు అమితాబ్ బ‌చ్చ‌న్ మ‌రో అడుగు ముంద‌డుగు వేశారు. ఏకంగా ల‌క్ష కుటుంబాల క‌డుపు నింప‌డానికి సిద్ధ‌మయ్యారు.

దేశ వ్యాప్తంగా ఆక‌లితో అల‌మ‌టిస్తున్న  సినీ కార్మికుల్ని గుర్తించి వాళ్ల‌కు నెల‌కు స‌రిప‌డ నిత్యావ‌స‌ర వ‌స్తువుల్ని అందించాల‌ని బిగ్ బి నిర్ణ‌యించుకున్నారు. హిందీ, త‌మిళ‌, తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళీ… ఇలా భాష‌తో సంబంధం లేకుండా, సినీ కార్మికులు ఎక్క‌డున్నా స‌రే, వాళ్ల‌కు ఈ స‌హాయం అందుతుంది. అందుకు త‌గిన ప‌టిష్ట‌మైన ప్ర‌ణాళిక‌ను కూడా బిగ్ బీ టీమ్ సిద్ధం చేసింది. ఈ విష‌యంలో బిగ్ బీకి సాంకేతిక స‌హాయం అందించ‌డానికి క‌ల్యాణీ జ్యూయెల‌ర్స్‌, సోనీ పిక్చ‌ర్స్ సంస్థ‌లు ముందుకు వ‌చ్చాయి.  

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క్రైమ్ : ఒక్క హత్య బయట పడకుండా 9 హత్యలు..! కానీ..

ఒక్క హత్య చేశాడు.. అది ఎక్కడ బయటపడుతుందోనని తొమ్మిది మందిని చంపేశాడు. స్థూలంగా వరంగల్ జిల్లాలోని గొర్రెల కుంట బావిలో బయటపడిన తొమ్మిది మృతదేహాల కథ. ఇందులో నిందితుడు..బాధితులు.. ఎవరూ తెలుగువాళ్లు కాదు....

తూచ్.. శ్రీవారి భూములు అమ్మాలని బోర్డు నిర్ణయం తీసుకోలేదన్న సుబ్బారెడ్డి..!

శ్రీవారి భూములు అమ్మడానికి ఆస్తులు గుర్తించి..రిజిస్ట్రేషన్ అధికారాలను కూడా అధికారులకు కట్టబెట్టేసిన తర్వాత... ఇప్పుడు వివాదం ఏర్పడటంతో.. టీటీడీ బోర్డు చైర్మన్ మాట మార్చారు. భూములు అమ్మడానికి పాలక మండలి నిర్ణయం తీసుకోలేదని...కేవలం...

బీజేపీ తల్చుకుంటే శ్రీవారి ఆస్తుల అమ్మకం నిలిపివేత ఎంత సేపు..!?

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు..శ్రీవారి ఆస్తులను అమ్మకానికి పెట్టిన విషయంపై బీజేపీ భగ్గమని లేస్తోంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు దీక్షలకు సిద్ధమయ్యారు..తెలంగాణ నేతలు కూడా.. ఊరుకునేది లేదని.. హెచ్చరికలు జారీ చేస్తున్నారు. స్వయంగా......

ఏడాదిలో 90 శాతం హామీలు అమలు చేశాం : జగన్

మద్యం రేట్లను పెంచడం ద్వారా మద్యం తాగే వారి సంఖ్య 24 శాతం మేర తగ్గిపోయిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తేల్చారు. పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా.. మన పాలన- మీ...

HOT NEWS

[X] Close
[X] Close