ఇంత‌కీ బిగ్ బీ రోల్ ఏంటి?

అమితాబ్ బ‌చ్చ‌న్ ఎంట్రీ నిజంగా.. సైరాకి ఊపు నిచ్చేదే. బిగ్ బీ ఒక్క‌డు చాలు.. ‘సైరా’ సినిమాని బాలీవుడ్‌లో అమ్ముకోవ‌డానికి. బాల‌య్య ‘రైతు’కి నో చెప్పి – చిరు 151వ సినిమాకి అమితాబ్ ‘ఎస్‌’ చెప్ప‌డం ఆశ్చ‌ర్యం అనిపించినా… బిగ్ బీ కార‌ణాలు బిగ్ బీకి ఉన్నాయి.

బాల‌య్య సినిమ‌లో న‌టించ‌డానికి ఒప్పుకోని బిగ్ బీ.. చిరుకి ఎలా సై అన‌గ‌లిగాడు? అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తాయి. నిజంగా చిరు సినిమాలో త‌న పాత్ర న‌చ్చి అమితాబ్ న‌టించ‌డానికి ముందుకొచ్చాడా? లేదంటే వేరే కార‌ణాలేమైనా ఉన్నాయా? అనే చ‌ర్చ మొద‌లైంది. ‘బుడ్డా ‘ప్ర‌మోష‌న్ కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన అమితాబ్ అదే ఫంక్ష‌న్‌లో గెస్ట్ గా హాజ‌రైన చిరుకి ఓ మాట ఇచ్చాడు. ‘మీరు 150వ సినిమా చేస్తే అందులో నేను ఓ పాత్ర పోషిస్తా’ అన్నాడు. బిగ్ బీ అంత‌టివాడు ఆ ఆఫ‌ర్ ఇస్తే ఎవ‌రైనా ఎలా వ‌దులుకొంటారు. అయితే చిరు ఈ ఆఫ‌ర్‌ని 150వ సినిమా కోసం కాకుండా… 151 కోసం వాడుకొంటున్నాడు. పైగా.. క్యారెక్ట‌ర్ కూడా డిమాండ్ చేసింది.

‘రైతు’తో పోలిస్తే.. ‘సైరా’లో త‌న పాత్ర‌కు బ‌లం ఎక్కువ‌. పైగా గెస్ట్ రోల్‌లా ఇలా వ‌చ్చి, అలా వెళ్లిపోయే క్యారెక్ట‌ర్ కాదు బిగ్ బీది. ద్వితీయార్థంలో ఆ పాత్ర చాలా కీ రోల్ పోషిస్తుంద‌ట‌. ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డి గురువుగా బిగ్ బీ క‌నిపించ‌బోతున్నార‌ని, చ‌రిత్ర‌లో న‌ర‌సింహారెడ్డికి ధీటైన స్థానం ఆయ‌న గురువుకీ ఉంద‌ని, సినిమాటిక్‌గా కొన్ని మార్పులు చేసి… ఆ పాత్ర‌ని ఇంకా ఉదాత్తంగా తీర్చిదిద్దార‌ని తెలుస్తోంది. అందుకే అమితాబ్ ఈ సినిమాకి సై చెప్పాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.