అమరావతి రైతులకూ విజయం తథ్యం !

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ధర్నాలు చేసే వాళ్లని ఖలిస్తాన్ తీవ్రవాదులన్నారు. అమరావతికి భూములిచ్చి మోసపోయి రోడ్డెక్కిన రైతులను రియల్ ఎస్టేట్ వ్యాపారులన్నారు. ఢిల్లీలో ఆందోళనల చేస్తున్న వారిలో రైతులెవ్వరూ లేరు.. ఉన్నది దళారులేనన్నారు. అమరావతి రైతుల్లో రైతులెవ్వరూ లేరు.. పెయిడ్ ఆర్టిస్టులే ఉన్నారన్నారు. అక్కడి రైతులపై కార్లు ఎక్కించి.. కాల్పులు జరిపారు. ఇక్కడి రైతులపై జల ఫిరంగులతో దాడులు చేశారు. అక్కడి రైతులు ముదుకు రాకుండా మేకుల బారికేడ్లు కట్టారు. ఇక్కడి రైతులు గుడికి వెళ్లాలనుకున్నా లాఠీలతో కుళ్లబొడిచారు. అక్కడ పంజాబ్ రైతులే పోరాటం చేస్తున్నారని తేలిగ్గా తీసుకున్నారు. ఇక్కడ భూములిచ్చిన రైతులే ఆందోళన చేస్తున్నారని తీసిపడేశారు.

ఢిల్లీ తరహాలోనే అమరావతిలోనూ వందల మంది రైతులు ప్రాణాలు పోరాటాల్లోనే గాల్లో కలిసిపోయాయి. అక్కడి అమరులైన రైతుల్ని అవమానించినట్లుగానే ఇక్కడ ప్రాణాలు పోయిన రైతుల్ని కూడా అవమానించారు. ఢిల్లీ రైతుల పోరాటానికి అమరావతి రైతుల పోరాటానికి ఎన్నో సారూప్యతలు ఉన్నాయి. అమరావతికి భూములిచ్చిన పాపానికి కులం పేరుతో దాడులకు గురయ్యారు. అత్యంత బలహీనవర్గాలకు చెందిన వారే అత్యధిక భూములిచ్చినట్లుగా అధికారిక రికార్డులు ఉన్నా భూములు ఇచ్చారు కాబట్టి వారు ఓ కులానికి చెందినవారనే ముద్ర వేసి దారుణంగా తిట్టారు..కొట్టారు. అన్నీ భరించారు. భరిస్తున్నారు. పోరాటం సాగిస్తున్నారు. ఇప్పటికి ఏడు వందల రోజులు అయింది. పోరాటం సాగిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం నిర్బంధం అమలు చేస్తూనే ఉంది.

ఇప్పుడు రైతులకు వారి పోరాటం ద్వారా ప్రజల్లో కదలిక తీసుకు వస్తున్నారు. పాదయాత్రలో మంచి స్పందన వస్తోంది. ఇంత కాలం చూడని కేంద్రం కూడా.. అమరావతికి మద్దతు ప్రకటించింది. హోంమంత్రి అమిత్ షా మద్దతు ప్రకటించడం రైతులకు కొత్త ఉత్సాహాన్నిస్తోంది. ఇప్పుడు కేంద్రం కూడా క్షమాపణ చెప్పి మరీ సాగు చట్టాలను వెనక్కి తీసుకుంది. అంటే ప్రజా వ్యతిరేకత ఎంత ఉందో అంచనా వేసుకోవడం వల్లనే ఇది సాధ్యమయింది. త్వరలో ఈ ప్రజావ్యతిరేకత సెగ ఏపీ ప్రభుత్వానికీ తగలకతప్పదు. అది తథ్యం. అది తగిలిన తర్వాత అమరావతి రైతులకే విజయం లభిస్తుంది. ప్రాంతీయ విభేదాలను అధికారంలో ఉన్న వారు ఎంత రేపే ప్రయత్నం చేసినా రైతుల వైపే న్యాయం ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నామా కేంద్ర మంత్రి – కాంగ్రెస్ కూటమి సర్కార్‌లోనా ?

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎవరితో ఉంటారో ఇంకా ప్రకటించలేదు ..కానీ ఆయన మాత్రం ఓ ప్లాన్ తో ఉన్నారు. నామా నాగేశ్వరరరావును కేంద్ర మంత్రిని చేయాలనుకుంటున్నారు. కేంద్రంలో బీజేపీకి...

మరోసారి అభాసుపాలైన హరీష్ ..!!

సీఎం రేవంత్ రెడ్డికి ఇటీవల వరుస సవాళ్ళు విసిరి నవ్వులపాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హారీష్ రావు మరోసారి అభాసుపాలు అయ్యారు. రిజర్వేషన్ల విషయంలో ఢిల్లీ పోలీసులు నోటిసులు ఇచ్చారని, ఆలస్యం చేయకుండా రేవంత్...

ఓటేస్తున్నారా ? : పోలవరం వైపు ఓ సారి చూడండి !

ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కరువులో నిండా మునిగిపోవాలో.. కనీసం రైతుల కడుపు నింపుకోవాలో తేల్చుకోవాల్సిన సంధి స్థితిలో ఉంది. ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధమయ్యారు. గతంలో ఓట్లు వేశారు. ఐదేళ్లలో ఏం...

ఏది నైతికత… ఏది అనైతికత ..!?

రిజర్వేషన్లపై అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేశారనే ఆరోపణలతో కాంగ్రెస్ సోషల్ మీడియా టీంకు నోటిసులు జారీ చేయడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రిజర్వేషన్ల విషయంలో తమపై అభాండాలు వేస్తున్నారని గగ్గోలు పెడుతోన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close