ఎడిటర్స్ కామెంట్ : చెలగాటం ప్రభుత్వానిది..చాయిస్ ఉద్యోగులది !

ముల్లు వెళ్లి ఆకు మీద పడ్డా.. ఆకు వెళ్లి ముల్లు మీద పడ్డా.. చివరికి చిరిగేది ఆకుకే.  ఈ సామెత సమాజంలో అధికారంలో ఉన్న వారితో తలపడే ప్రతి ఒక్కరికి వర్తిస్తుది. చివరికి ఉద్యోగులకు కూడా. తామే అధికారులం అనే అహాన్ని వదిలేసి ఒక్క సారిగా తల ఎత్తి చూస్తే తమను నిట్ట నిలువుగా.. అడ్డగోలుగా చింపేయడానికి ఎన్నెన్ని ముళ్లు కాచుకుని కూర్చున్నాయో కనిపిస్తుంది. నిన్నటికాదాకా బుజ్జగించిన ప్రభుత్వం ఒక్క సారిగా కొరడా దెబ్బలు కొట్టదని అనుకుంటున్నారేమో .. అదీ మాయలో ఉన్నట్లే. చెడామడా కొట్టేసి కాలి కింద ప్రపంచాన్ని కదిలించేసి నడిరోడ్డుపై నిలబెట్టేయగల ప్రభుత్వాన్ని వారు నమ్ముతున్నారు.  ఇప్పటి వరకూ జరిగింది విశ్లేషించుకోకపోతే.. ఇక ముందు వారికి రక్తకన్నీరేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

సమ్మె చేయడానికి ఎందుకు అంత తొందర.. పరిస్థితులు గమనించాలి ముందర !
   

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలు అన్నీ ఏకతాటిపైకి వచ్చి సమ్మె చేస్తున్నట్లుగా ప్రకటించాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో  వచ్చినట్లుగా పోలీసులు, అఖిలభారత సర్వీసు అధికారులు మినహా అందరూ సమ్మెలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారికి వచ్చిన సమస్య అలాంటిది. ఇప్పుడు పీఆర్సీకి అంగీకరిస్తే భవిష్యత్ కోల్పోతామని అందరూ నమ్ముతున్నారు. అందుకే సమ్మెకు వెళ్లడం ఖాయం. ప్రభుత్వం కూడా దిగి వచ్చే ప్రశ్నే లేనంటోంది. ఇప్పటి వరకూ ఉద్యోగులు.. ఉద్యోగ సంఘాలు చూపించిన ఆవేశం ప్రకారం.. ఆరో తేదీ అర్థరాత్రి నుంచి సమ్మెకు వెళ్లడం ఖాయం. ఈ లోపు వారికి జీతాలు కూడా రావు. ప్రభుత్వం జీతాల ప్రాసెస్ గురించి కథలు కథలుగా చెబుతోంది కానీ.. అవేమీ జీతాలిచ్చేందుకు కాదు. జస్ట్ షోయింగ్. ఆ విషయం ఉద్యోగ సంఘ నేతలకూ తెలుసు. కానీ రకరకాల ఉద్యమాలు చేస్తూ.. ఎందుకు సమ్మెకు తొందరపడుతున్నారన్నదే ఇప్పుడు కీలకం.

ఉద్యోగుల బలహీనతతో ప్లాన్డ్‌గా ఆడుకుంటున్న ప్రభుత్వం !
 
ఉద్యోగుల ఉద్యమం విషయంలో ఏపీ ప్రభుత్వ పెద్దలు చాలా నింపాదిగా వ్యవహరిస్తున్నారు. సమ్మె నోటీసుల్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. పీఆర్సీని ఆమలు చేసేందుకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ పోతున్నారు. అపోహలు తీర్చేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. కానీ ఆ కమిటీలో నియమించిన సగం మంది సభ్యులు పట్టించుకోలేదు. సీఎస్‌తో పాటు ఆర్థిక మంత్రి రావడం లేదు. సభ్యులయిన సజ్జల, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ రోజూ వస్తున్నారు. ఎదురు చూసి వెళ్తున్నారు. చర్చలకు రావాలంటే ఉద్యోగులు షరతులు పెడుతున్నారు. వాటి గురించి అసలు పట్టించుకునే ప్రశ్నే లేదని ప్రభుత్వం చెప్పింది. ఉద్యోగులు జీవితాంతం సమ్మె చేయలేరుగా… ఎప్పుడైనా ప్రభుత్వం వద్దకు రావాల్సిందేగా అని  ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది.  వారికి మరో ప్రత్యామ్నాయం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో నేరుగానే చెబుతున్నారు.  ఉద్యోగులు ఎంత కాలం కావాలంటే అంత కాలం సమ్మె చేసుకుని విసుగు పుట్టి తామే ఉద్యోగాల్లో చేరతామని వస్తారని అప్పటి వరకూ తాము సీరియస్‌గా కాకుండా సాధారణంగా పట్టించుకుంటే చాలని  భావిస్తున్నారు. తమ వైపు నుంచి నిర్లక్ష్యం లేదని చెప్పడానికి సజ్జల మరో ఇద్దరితో కలిసి ప్రతీ రోజూ కాన్ఫరెన్స్ హాల్‌కు వచ్చి పన్నెండు గంటల వరకూ కూర్చుని వెళ్తున్నారు. చర్చలతోనే పరిష్కారం అంటున్నారు. కానీ ప్రతీది చేసేస్తున్నామని.. చర్చలతో ఎలాంటి మార్పులు ఉండవని చేతలతోనే సంకేతాలు ఇస్తున్నారు.

కోర్టులకెళ్తే ఉద్యోగులకు ఎదురుదెబ్బ ఖాయం.. గత తీర్పులు చెప్పే పాఠం ఇదే !

సమ్మెను కోర్టులు సమర్థించవు. ఇప్పటి వరకూ జరిగిన వివిధ సమ్మెల విషయంలో కోర్టులు ఇచ్చిన తీర్పులు ఇదే విషయాన్ని చెప్పాయి. కొన్నాళ్ల క్రితం తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేశారు. సుమారు యాభైవేలమంది ఆర్టీసీ కార్మికులు రెండు నెలలపాటు సమ్మె చేసినపుడు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఒక దశలో ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.  ఆర్టీసీ కార్మికులు హైకోర్టుకు వెళ్లారు. లేబర్‌ కోర్టుకు వెళ్లండని హైకోర్టు స్పష్టం చెయ్యడంతో కార్మికులు ఏం చేయలేక ప్రభుత్వాన్నే ప్రాథేయపడాల్సి వచ్చింది. కొన్నేళ్ల కిందట తమిళనాడు ఉద్యోగులు జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెకు దిగారు. జయలలిత ఆగ్రహించి లక్షా డెబ్భైవేల మంది ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగించారు. దీంతో ఉద్యోగులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కానీ అత్యున్నత న్యాయస్థానం సమ్మె అనేది ఉద్యోగుల హక్కు కాదని, ఉద్యోగులను డిస్మిస్‌ చేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నదని, అయితే మానవీయ కోణంలో చూసి డిస్మిస్‌ చేసిన ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని జయలలితకు సూచించింది. ఇదే విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. సమ్మెకు వెళ్లడం కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు గుర్తు చేసిందని ఆయన మీడియాతో చెప్పారు. అంటే..సమ్మె విషయంలో  ఉద్యోగులకు హైకోర్టులోనూ ఊరట దక్కని ముందుగానే డిసైడైపోయింది. అందుకే ఉద్యోగులతో చెలగాటమాడటం ప్రారంభించారు.

ఉద్యోగుల సమ్మెకు లొంగింది ఒక్క ఎన్టీఆర్ మాత్రమే !

ఉద్యోగులపై కఠిన వైఖరికి నిరసనగా కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో 1971లో 56 రోజుల పాటు సమ్మె నడిచింది. కానీ ప్రత్యేకమైన హామీలేమీ లేకుండానే విరమించాల్సి వచ్చింది. సమ్మె కాలం జీతం కోసమే పోరాడాల్సి వచ్చింది. తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన సమ్మె మినహా తమ సమస్యల కోసం గత 35 ఏళ్లలో ఉద్యోగులు సమ్మె చేయలేదు. ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు 1986లో ఉద్యోగుల పదవీవిరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 55 ఏళ్లకు కుదించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్న ఉద్యోగుల కుటుంబాలకు ప్రోత్సాహకంగా అందుతున్న ఒక ఇంక్రిమెంట్‌నూ, ఎర్న్‌డ్‌ లీవ్‌లను క్యాష్‌ చేసుకునే వెసులుబాటునూ రద్దుచేశారు. వీటిలోపాటు పీఆర్సీ అమలు కూడా ఆలస్యమైంది. దీంతో ఉద్యోగుల ఐక్య సంఘం పిలుపు మేరకు 1986 అక్టోబరులో సుమారు 19 రోజులపాటు సమ్మె చేశారు.  పీఆర్సీ అమలుచేయడంతోపాటు తొలగించిన అన్ని ప్రయోజనాలను కల్పించేందుకు ఎన్టీఆర్‌ ప్రభుత్వం అంగీకరించడంతో సమ్మె విజయవంతమైంది. ఈ పీఆర్సీ ప్రయోజనాలే కాదు.. తర్వాతి కాలంలో ఎన్టీఆర్ ఉద్యోగులకు అనేక రకాల ప్రయోజనాలు కల్పిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు.

ఉద్యోగాలపై కనీస జాలి కూడా చూపించే స్థితిలో లేని ఏపీ ప్రభుత్వం !

ఉద్యోగుల జీత భత్యాలు కత్తించి.. చాలా కాలంగా పెండింగ్‌లో పెట్టిన డీఏలను ఇచ్చి జీతం కోత భర్తీ చేసే వ్యూహం పాటిస్తున్న ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో ఏ మాత్రం సానుకూల నిర్మయం తీసుకునే అవకాశం లేదు.  డిమాండ్లను అంగీకరించే ప్రశ్నే లేదని ఇప్పటికే తేట తెల్లమయింది. ఉద్యోగులు సమ్మెకు వెళ్లినా చివరికి తమంతటకు తాము వచ్చి విధుల్లో చేరేలా పరిస్థితి మారుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకే లైట్ తీసుకుంటోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి ఉద్యోగులు ఎన్నాళ్లు సమ్మె చేద్దామనుకుంటున్నారు..? రెండునెలల పాటు సమ్మె చేసినా.. ప్రభుత్వంలో స్పందన లేకపోతే…వచ్చే జీతాలు కూడా రాకపోతే ఏం చేస్తారు ? తెలంగాణ ఆర్టీసీ కార్మికుల్లా ప్రభుత్వం వద్దకెళ్లి బతిమాలుకుంటారా ? లేకపోతే.. ప్రభుత్వాన్ని సైతం మెట్టు దిగేలా చేసేలా ప్లాన్ బీ ఉందా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఈ విషయంలో ఉద్యోగ సంఘాల వ్యూహమే వారి ఉద్యమాన్ని ఏ తీరానికి చేరుస్తుందన్నది నిర్ణయిస్తుంది.

ఈ పరిణామాలకు అడుగులకు మడుగులొత్తిన ఉద్యోగ నేతలే కారణం !

ఏపీలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులకు ఖచ్చితంగా ఉద్యోగ నేతలే కారణం. వారు వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చేసిన చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు.ప్రభుత్వ పెద్దలతో రాసుకుపూసుకుతిరిగారు. మాకు సామాజిక బాధ్యత ఉందని కొంత మంది చెలరేగిపోయారు. స్థానిక ఎన్నికల సమయంలో ప్రభుత్వం చెప్పినట్లుగా చేశారు. ఎస్ఈసీ మీద తిరుగుబాటు చేశారు.  అంత చేసిన తమ పలుకుబడి… ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించడం ద్వారా నెరవేరుస్తారని అనుకున్నారు. ఎంతో కొంత జీతం పెంచి.. డీఏలు ఇచ్చేస్తే… సంతృప్తి పడదాం అనుకున్నారు. చివరికి ప్రభుత్వం వారి ఇజ్జత్‌ను ఉద్యోగుల్లో తీసేసింది. జీతం తగ్గించేసింది.  ఇప్పటి వరకూ ఇచ్చిన ఐఆర్‌ను వెనక్కి తీసుకుంటామని అంటోంది. తాము అడుగులకు మడుగులొత్తినా చివరికి అసలు గత ప్రభుత్వం ఇచ్చిన ప్రయోజనాలకే టెండర్ పెట్టడంతో ఉద్యోగ నేతలకు ఏం చెప్పాలో.. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి.

ప్రభుత్వానికి చెలగాటం.. ఉద్యోగుల చేతుల్లోనే వారి భవిష్యత్ !

కాస్త తీరిగ్గా ఆలోచిస్తే..  ఉద్యోగుల సమస్య పరిష్కారం కావాల్సింది ప్రభుత్వం దగ్గరే.  ఉద్యోగులు తెలుసుకోవాల్సింది కూడా ఇదే. తమ నేతలు  వైసీపీకి కావాల్సినంతగా సహకరించారు. తాము కూడా మూడు రాజధానులకు సై అన్నారు. అయినా ఎలాంటి ప్రయోజనాలు కల్పించకపోగా.. జీతాలు తగ్గించి.. లంచగొండులు అని ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం టైం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి చెలగాటమే. ఉద్యోగుల భవిష్యత్ వారి చేతుల్లోనే ఉంది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదానిపై అది అధారపడి ఉంది.  ప్రభుత్వం తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలు.. చట్ట విరుద్ధమైన నిర్ణయాల్నింటినీ సమర్థించి.. ఇప్పుడు అలాంటి వాటికే ఉద్యోగులు బలైపోతూండటం.. విషాదం

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close