ఆంధ్రప్రదేశ్ రాజధానిపై సొంత ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్లుగా నిర్మాణాలు జరుగుతున్నాయి. నిధుల సమస్య లేకుండా చంద్రబాబు చూశారు. కాంట్రాక్టర్లు వేగంగా పనులు చేసేలా ఎకో సిస్టమ్‌ను రెడీ చేశారు. అన్ని విధాలుగా పనులు జరుగుతున్నాయి. ప్రైవేటు పెట్టుబడుల కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా ఓ వైపు మరో వైపు ఓ ముఠా.. హైదరాబాద్‌లో, విదేశాల్లో మకాం పెట్టి సోషల్ మీడియా సైకోల్ని అమరావతి మీద ఫేక్ ప్రచారాలకు వాడేస్తున్నారు. అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తే వీళ్లకేం వస్తుంది ?. ఆంధ్రప్రదేశ్ పై కుట్రలు చేస్తే వీళ్లకేం వస్తుంది ?.
ఎక్కడైనా అమరావతికి వెళ్లి చూసేవాళ్లు కాదు !
వర్షాలు పడితే చాలు.. అమరావతి మునిగిపోయిందహో అని వచ్చేస్తున్నారు సైకోబిడ్డలు. వీరి బాధేంటో ఎవరికీ అర్థం కాదు. మునిగిపోతే ఎందుకు ఇంత సంతోషపడుతున్నారో అర్థం కాదు. పోనీ మునిగిపోయిందా అంటే… ఉండదు. అక్కడికి పది కిలోమీటర్ల దూరంలో ఏదైనా వాగు పొంగితే ఆ ఫోటోలు వీడియోలు ఎత్తుకొచ్చేస్తారు. వారు పెట్టిన ఫోటోలు..వీడియోల్లో పనులు జరుగుతున్న ప్రాంతమే ఉండదు. ఐకానిక్ టవర్లు కట్టడానికి పునాదులు తీస్తే ఆ పునాదుల్లో నీరు చేరితే.. అదే మునిగిపోయిందంటారు. వాళ్లు ఇల్లు కట్టేటప్పుడు పునాదులు తీసినప్పుడు వర్షం పడితే.. నీళ్లు చేరక ఏం చేరుతాయి ?. ఎంత పెద్ద వర్షం పడినా అమరావతిలో ఒక్క రోజు కూడా పనులు ఆగలేదు. శరవేగంగా జరుగుతున్నాయి. క్షేత్ర స్థాయిలో చూసేవారికి తెలుసు. అమరావతిలో నివసించేవారు ఒక్కరు కూడా తమ ప్రాంతంలో నీళ్లు నిలబడిపోయాయని ఫోటోలు పెట్టరు. బయట వాళ్లకే ఫేక్ ఫోటోలతో ఏడ్చేస్తున్నారు.
కాలపరీక్షకు నిలిచిన అమరావతిపై ఇన్ని ఏడుపులెందుకు ?
అమరావతి కాలపరీక్షకు నిలిచిన రాజధాని. దేవతల రాజధాని పేరు పెట్టుకున్న అమరావతిని ఓ సైకో పాలన ఐదేళ్లు శిథిలంగా మార్చింది. శ్మశానం అని పిలిచేదాకా చేశారు. అంతేనా కుల ముద్ర వేశారు.. వారున్నంత కాలం అమరావతిపై ఎంత కుట్ర చేయాలో అంత కుట్ర చేశారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. అమరావతికి పెట్టుబడులు రాకుండా తప్పుడు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఎవరికి లాభం కలుగుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణం కాని రాజధానిపై ఎందుకు తప్పుడు ప్రచారాలు చేయాలనుకుంటున్నారు…?. అమరావతి ఇప్పటికే సైకోల బారిన నుంచి బయటపడి మళ్లీ పరుగందుకుంటోంది. ఇప్పుడు పిల్ల సైకోలు గుంపులు గుంపులుగా మీద పడిపోతున్నారు.
ఇలా వదిలేయడం కూడా మంచిది కాదు !
సోషల్ మీడియా అకౌంట్ ఉందని.. రాజ్యాంగం భావప్రకటనా స్వేచ్ఛ ఇచ్చిందని ఇష్టం వచ్చినట్లుగా తప్పుడు ప్రచారాలు చేసే వారిని ఉపేక్షించడం సమాజానికి హానికరం అవుతుంది. ముఖ్యంగా కుల ద్వేషం చిమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. సమాజంలో అశాంతిని రెచ్చగొట్టేందుకు పూర్తిగా ఫేక్ న్యూస్ మీద ఆధారపడేవారితో సమాజానికి తీవ్ర నష్టం ఉంటుంది. వారందరికీ తగిన బుద్ది చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి వారి ఏడుపులే అమరావతికి దీవెనలవుతాయి. రాష్ట్రానికి , ప్రజలకు అభివృద్ధి రథ చక్రంగా మారుతుంది. ఒక్కటి మాత్రం నిజం .. వీరంతా ఇంతగా ఏడుస్తున్నారంటే.. ఖచ్చితంగా అమరావతి పురోగతిలో ఉందని అర్థం చేసుకోవచ్చు.