ఎడిటర్స్ కామెంట్ : భస్మాసుర హస్తమే..!

ఎవరి నెత్తి మీద చేయి పెడితే వారు భస్మం అయ్యే అధికారం ఉన్న భస్మాసురుడు తన నెత్తి మీద తాను చెయ్యి పెట్టుకుని..ఎవరికీ అడ్డం లేకుండా పోయాడు. ఆ భస్మాసుర హస్తం వెనుక కాస్త పురాణ గాధ ఉండి ఉండవచ్చు కానీ… అంతిమంగా తనకు ఉన్న పవరే.. తనను భస్మం చేసిందని.. భస్మాసురుడు గుర్తించలేకపోవచ్చు. ఎందుకంటే.. అది గుర్తించాల్సిన సమయానికి ఆయన భస్మం అయిపోయాడు. పురాణాల్లో ఇలాంటి గాధలు ఊరకనే పుట్టలేదు. యుగాలు మారినా.., తరాలు మారినా.. వాటిని నేర్చుకోవాల్సినవి ఉన్నాయని చెప్పడానికే అవి ఉన్నాయి. భస్మాసురుడు చేసిన తప్పు నుంచి నేర్చుకుంటే స్వయం వినాశనం కాకుండా ఉంటారు.. లేకపోతే.. మాత్రం.. జరిగేది భస్మమే. కాకపోతే అక్కడ స్వయంగా భస్మం అయ్యారు.. ప్రస్తుత పరిస్థితుల్ని.. జీవితాల్ని ఎందుకూ పనికి రాకుండా చేసుకుని… నమ్మిన వారి జీవితాల్ని భస్మం చేసే పరిస్థితులు ఏర్పడతాయి. ఏపీలో ఇప్పుడు అదే జరుగుతోంది.

న్యాయవ్యవస్థతో యుద్ధం చేయడం తన నెత్తి మీద తాను చేయి పెట్టుకోవడమే..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి న్యాయవ్యవస్థపై చేస్తున్న దాడి.. ఆయన నేరుగా సుప్రీంకోర్టుతోనే యుద్ధానికి సిద్ధమైన వైనం.. ఖచ్చితంగా భస్మాసురహస్తాన్నే తలపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి సాదాసీదా వ్యక్తి కాదు. ముఖ్యమమంత్రి. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయనకు ఆ పవర్ ప్రజలే ఇచ్చి ఉండవచ్చు కానీ… రాజ్యాంగం ద్వారానే లభించింది. రాజ్యాంగంలో ప్రజాస్వామ్యాన్ని నిర్వహించబట్టి… ప్రజల ఓట్ల ద్వారానే పాలకుల్ని ఎన్నుకోవాలని నిర్వహించబట్టి.. ఆయన ఎన్నికయ్యారు. అదే రాజ్యాంగంలో క్రిమినల్ కేసులు ఉన్న వారు ఎన్నికల్లో పోటీకి అనర్హులు అని రాసి ఉంటే.. ఆయన ఎక్కడ ఉండేవారో చెప్పలేం. అంటే.. ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం .. గెలిచే అవకాశం అన్నీ రాజ్యాంగమే ఇచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు..? ఆ రాజ్యాంగాన్నే సవాల్ చేస్తున్నారు. దేశం రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మ కాకుండా.. నియంతృత్వం రాకుండా.. పాలకులు ప్రజల్ని సమంగా చూడాలన్న లక్ష్యంగా.. రాజ్యాంగం వ్యవస్థల్ని ఏర్పాటు చేసింది. ప్రజాస్వామ్యంలో అధికారం.. ప్రజలెన్నుకున్న ప్రభుత్వానిదే కావొచ్చు కానీ అది రాజ్యాంగానికి లోబడి ఉంటుంది. తమకు ప్రజలు ఓట్లేసి గెలిపించారు కాబట్టి.. ఏదైనా చేసేయడానికి లైసెన్స్ వచ్చిందనుకోవడంతోనే సమస్య వస్తోంది. అలా వచ్చిందని అనుకుని.. రాజ్యాంగాన్నే ధిక్కరిస్తూండటంతోనే అసలు సమస్య వస్తోంది.

ప్రజలు 151 సీట్లిచ్చినా రాజ్యాంగం ప్రకారమే అధికారాలు..!

న్యాయవ్యవస్థపై జగన్మోహన్ రెడ్డి సరైన అవగాహన లేదని తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది. న్యాయమూర్తులంటే.. వారికి ఇష్టం వచ్చిన తీర్పులు చెప్పేస్తారని.. వారికి ఇష్టం అయిన వారి కేసులకు ఫేవర్‌గా తీర్పులు చెబుతారని… వారు తల్చుకుంటే ఏ తప్పయినా ఒప్పయిపోతుందని.. జగన్ అనుకుంటున్నారు. అందుకే తనకు నచ్చని తీర్పులు వచ్చిన న్యాయమూర్తులపై… తనకు వ్యతిరేకంగా ఉన్నారని ఆయన అభిప్రాయం ఏర్పర్చుకున్నారు. న్యాయమూర్తులు వారి ఇష్టానికి తీర్పులు చెప్పరు. మెరిట్ ప్రకారమే తీర్పులు చెబుతారు. తాము ఎందుకు ఆ నిర్ణయలను కొట్టి వేశామో.. లేకపోతే.. అనుమతించామో వారు తమ తీర్పుల్లో స్పష్టంగా చెబుతారు. జగన్మోహన్ రెడ్డి వేసిన రంగుల గురించి కానీ.. ఇంగ్లిష్ మీడియం విషయంలో కానీ.. తీర్పులను పరిశీలిస్తే.. చాలా స్పష్టంగా ఆ విషయం స్పష్టమవుతుంది. ఇళ్ల పట్టాల విషయంలోనూ అంతే. ప్రభుత్వ భూమి జగన్మోహన్ రెడ్డి సొంత భూమి కాదు. ఇష్టం వచ్చినట్లుగా .. ఎవరికి పడితే వారికి రిజిస్ట్రేషన్ చేయించేసి.. అమ్మేసుకునే హక్కులు ఇవ్వడానికి. ప్రభుత్వ భూమికి ప్రభుత్వం కస్టోడియన్ మాత్రమే. ఎవరికైనా ఇవ్వాలనుకుంటే అనుభవించడానికి మాత్రమే ఇవ్వాలి. ఆ తర్వాత అమ్ముకునే అవకాశం ఇవ్వాలంటే… దానికోసం కొన్ని చట్టాలున్నాయి. అన్నింటినీ ఫాలో కావాలి. కానీ తనకు 151 సీట్లు వచ్చాయి కాబట్టి… ఏమైనా చేస్తానంటే ఎలా కుదురుతుంది..? అన్నీ చేయకూడనివి చేసేసి కోర్టులు తన నిర్ణయాలను కొట్టేస్తున్నాయని..వాటి వెనుక చంద్రబాబు ఉన్నాడని గగ్గోలు పెడితే ఏమొస్తుంది…?

న్యాయవ్యవస్థను బలహీనం చేసి తాను బలపడాలనుకుంటే సాధ్యమా..?

కాబోయే సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ఫిర్యాదు చేస్తూ.. ప్రస్తుత న్యాయమూర్తికి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. దాన్నితన ప్రభుత్వ ముఖ్య సలహాదారులతో ప్రెస్‌మీట్ పెట్టించి మరీ మీడియాకు విడుదల చేశారు. రాజ్యాంగం గురించి కనీస అవగాహన ఉన్నా కూడా.. ఈ పని చేసి ఉండేవారు కాదు. కానీ తెలియకుండా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారని అనుకోలేం. ఎందుకంటే.. ముఖ్యమంత్రి ఓ వ్యవస్థ. అంత వరకూ ఎందుకు ఆ లేఖ మీడియాకు విడుదల చేసిన సలహాదారు.. చీఫ్ సెక్రటరీగాపని చేసి రిటైరయ్యారు. ఆయనకైన అవగాహన లేకుండా ఉంటుందా..?. న్యాయమూర్తులకు రాజ్యాంగంలో .. రాజకీయ వ్యవస్థ నుంచి దాడిని తప్పించుకోవడానికి రక్షణలు ఉన్నాయి. వారు నిష్పాక్షికంగా తీర్పులు చెప్పడానికి భయం లేని .. పరిస్థితుల్లో న్యాయం చెప్పడానికి వారికి రాజ్యాంగం కొన్ని రక్షణలు కల్పించింది. దాని ప్రకారం.. వారిపై ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేస్తే సరిపోదు. దానికి కొన్ని లెక్కలుంటాయి. వారిపై ఏదైనా ఫిర్యాదును ముందుకు తీసుకెళ్లాలంటే.. ఓ ప్రక్రియ ఉంటుంది. అలా కాకుండా.. వారి మీద రాజకీయ నాయకులపై చేసినట్లుగా ఆరోపణలు చేసి.. మీడియాలో ప్రచారం చేసి.. ప్రజల్లో అనుమాన బీజాలు నాటేసి.. తమ పని తాము చేసేస్తామంటే.. కుదరదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అది చేయకూడదని తెలిసి.. కావాలని చేసేశారు. ఆయన కుట్రను అర్థం చేసుకోలేనంత అమాయకత్వంగా న్యాయవ్యవస్థ ఉండదు గా..! అందరికీ అర్థమైపోయింది.. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో.. అంచనా వేయడం కష్టమే.

వ్యవస్థల్ని శాశిద్ధామనుకుంటే చెల్లిపోతారు..!

చరిత్రలో ప్రజా నాయకులు ఎందురో వచ్చారు. అందరికీ ప్రజాభిమానం ఒకే తీరులో లేదు. పదవి చేపట్టక ముందు నీరాజనాలు అందుకున్నవారు పదవి చేపట్టిన తర్వాత… వారిచర్యలతో ఛీకొట్టించుకున్న సందర్భాలు ఉన్నాయి. అందుకు వారి చర్యలే కారణం. ఉక్కు మహిళ ఇందిరాగాంధీ కూడా ప్రజాభిమానాన్ని కోల్పోయారు. ప్రజలు ఓ సారి ఓట్లేశారని.. వారంతా.. తన బానిసలని.. తాను ఏం చేసినా పడి ఉంటారని అనుకోవడం భ్రమే. అధికారం అండగా వ్యవస్థల్ని నరుక్కుంటూ పోతే.. చివరికి నరకడానికి ఏమీ ఉండదు. తనకు దక్కిన అధికారం కూడా. తాత్కాలిక ప్రయోజనాల కోసం.. బలమైన ప్రజాస్వామ్య పునాదుల్ని బలహీనం చేసే ప్రయత్నం చేస్తే.. ఆ ప్రజాస్వామ్యం అనే చెట్టునే పట్టుకుని ఎదిగామన్న విషయాన్ని మర్చిపోయినట్లే. ప్రస్తుతం ఏపీ సీఎం ఆ పరిస్థితిలో ఉన్నారు. ఆయన మర్చిపోయారు.. చెప్పేవాళ్లు కూడా లేరు. చెప్పినా వినరని కొంత మంది వాపోతూంటారు.. అది వేరే విషయం.

రాజ్యాంగం పవర్ తెలిశాక… చేయడానికేమీ ఉండదు..!

చంద్రబాబు మీద ఆరోపణలు చేస్తే రాజకీయం. అధికారంలోకి వచ్చి నిరూపించలేకపోయినా అది రాజకీయమే. ఎందుకంటే… శ్రీశ్రీ చెప్పినట్లుగా.. పబ్లిక్ లైఫ్‌లోకి వస్తే ఏదైనా అంటామనే హక్కు ఉంటుంది. మహా అయితే అవతలి వైపు నుంచి ప్రత్యారోపణలు వస్తాయి. కానీ న్యాయవ్యవస్థ ఆ రాజకీయంలో భాగం కాదు. వారిపై రాజకీయం చేద్దామనుకుంటే.. సాధ్యం కాదు. అలా చేయడం.. తన నెత్తి మీద తాను చేయి పెట్టుకున్నట్లే అవుతుంది. ఇప్పటికే ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి అవగాహనకు వచ్చి ఉండాలి. ఒక వేళ రాకపోతే… ఆ విషయం తెలియడానికి ఎన్నో రోజులు పట్టకపోవచ్చు. కానీ మొత్తంగా…అన్నింటికన్నా.., రాజ్యాంగమే గొప్పదని.. నిరూపితమయ్యే రోజు.. చాలా దగ్గర్లోనే ఉందని.. ఊహించడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే.. అది భస్మాసుర హస్తమే మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close