నానీ.. ఎందుకు ఇవ‌న్నీ…?

‘అంతా బాగానే ఉంది క‌దా.. ఎందుకు నీకు ఇవన్నీ..’ అంటూ ఆంధ్ర‌జ్యోతి రాధా కృష్ణ‌ని క‌మిడియ‌న్ స‌త్య ఇమిటేట్ చేసిన డైలాగ్ ఒక‌టి బాగా పాపుల‌ర్‌. ఇదే డైలాగ్ ఇప్పుడు నానికి వాడాల్సిన సంద‌ర్భం వ‌చ్చింది.

నాని మంచి హీరో. ఓ సినిమా చేసి వ‌దిలేయ‌డు, ఆ సినిమాని జ‌నంలోకి తీసుకెళ్ల‌డానికి శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తుంటాడు. ప్ర‌మోష‌న్లు ద‌గ్గ‌రుండి చేస్తుంటాడు. త‌న క‌ష్టం ఎప్పుడూ వృధా కాలేదు కూడా. యావ‌రేజ్, ఎబౌ ఏవ‌రేజ్ సినిమాలు సైతం, నాని త‌న ప్ర‌మోష‌న్ల‌తో హిట్ రేంజ్‌కి తీసుకెళ్లాడు. ఇప్పుడు ‘హాయ్ నాన్న‌’ కోసం కూడా అలానే క‌ష్ట‌ప‌డుతున్నాడు. ఈ సినిమా కోసం డిఫరెంట్ గా ప్ర‌మోష‌న్లు మొదలెట్టాడు. ఎన్నిక‌ల సీజ‌న్ క‌దా, అందుకే పొలిటీషియ‌న్ గెట‌ప్పు వేసి, ఎన్నిక‌ల వాగ్దానాలంటూ, ప్రెస్ మీట్లు అంటూ.. కొత్త త‌ర‌హా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టాడు. ఇవ‌న్నీ బాగా వ‌ర్క‌వుట్ అయ్యాయి కూడా. అయితే లేటెస్ట్ వీడియో మాత్రం.. రివ్యూల‌పై, రివ్యూ రైట‌ర్ల‌పై ఓ ర‌క‌మైన సెటైర్ వ‌దిలాడు.

ఈ ప్ర‌మోష‌న్ వీడియోలో… నాని పొలిటీషియ‌న్ గెట‌ప్పులో వ‌చ్చాడు. మ‌ధ్య‌లో ఓ రిపోర్ట‌ర్ ‘ఈ మ‌ధ్య జ‌నాలు రివ్యూలు బాగా చూస్తున్నారు క‌దా’ అని అడిగితే.. ‘ఆ.. అయితే ఏం చేయ‌మంటావ్‌.. త‌లో ల‌క్షా ఇవ్వ‌మంటావా’ అంటూ కేసీఆర్ టైపులో సెటైర్ వేయ‌డం జ‌రిగిపోయాయి. అంత‌కు ముందు వీడియోలో ‘స్నాక్స్ తిన్నారా’ అంటూ ఓ ప్రెస్ మీట్ లో సుమతో ముడిప‌డిన‌ ఇష్యూని గుర్తుకు చేశాడు. ఇదంతా నాని ఫ‌న్ కోస‌మే చేసి ఉండొచ్చు. కానీ… జ‌నంలోకి, మీడియాలోకి త‌ప్పుడు అర్థాల్ని మోసుకెళ్లే ప్ర‌మాదం ఉంది. నానికి మీడియాకీ ఎప్పుడూ స‌ఖ్య‌తే ఉంది. త‌ను ఎప్పుడూ గీత దాటలేదు. మీడియాతో స‌ఖ్య‌త‌గా ఉంటాడు. ఎవ‌రు కావాల‌న్నా ఇంట‌ర్వ్యూలు ఇస్తాడు. ఓపిగ్గా స‌మాధానాలు చెబుతాడు. అంత క్లీన్ ఇమేజ్ ఉన్న నానికి ఇలాంటి అన‌వ‌స‌ర ఇష్యూలు అవ‌స‌ర‌మా అనిపిస్తోంది. ప్ర‌మోష‌న్ల కోసం ఎంత ఫ‌న్ అయినా చేయొచ్చు. కానీ.. ఎవ‌రినైనా హ‌ర్ట్ చేసేలా ఉంటే… ఫ‌లితాలు వేరేలా మారిపోతాయి. ఈ విష‌యం నాని లాంటి హీరోలు గ‌మ‌నిస్తే మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎగ్జిట్ పోల్స్ : తెలంగాణలో కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉందని అత్యధిక ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నయి. దేశంలో అత్యధిక స్ట్రైక్ రేట్ ఉన్న ఎగ్జిట్ పోల్స్ అన్నింటిలో కూడా కాంగ్రెస్ కే అడ్వాంటేజ్ లభించింది. జాతీయ మీడియాలు...

ఏపీ పోలీసులతో సాగర్ గేట్లు ఎత్తేయించి జగన్ రెడ్డి సాధించిందేంటి ?

తెలుగుదేశం పార్టీ నేతలను అరెస్టు చేయాలంటే వారు అందుబాటులో ఉన్నా సరే. అర్థరాత్రి వాళ్లు నిద్రపోయిన తర్వాత గేట్లు దూకి, తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేస్తారు. అది కోర్టులో నిలబడని కేసు.....

ప్రాసెస్‌లో క్వాష్ పిటిషన్‌పై తీర్పు : సుప్రీంకోర్టు ధర్మాసనం

చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై తీర్పు ప్రాసెస్ లో ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఫైబర్ నెట్ స్కాంలో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై...

తెలంగాణ ఓటరు నిరాసక్తత

తెలంగాణ ఓటరు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. పెద్ద పెద్ద క్యూలైన్లు ఎక్కడా కనిపించడం లేదు. మధ్యాహ్నం ఒంటింగంట వరకూ పోలింగ్ పర్సంటేజీ కేవలం 37 శాతం వరకే ఉంది. 2018లో ఇది...

HOT NEWS

css.php
[X] Close
[X] Close