సుభాష్ : పవన్‌కు మనస్సాక్షి అనేది ఉందా..!?

” పదవి లేకపోయినా పర్వాలేదు ప్రజాసేవ చేస్తా..” అంటూ పవన్ కల్యాణ్ తిరుపతిలో ఊగిపోయారు. తిరుపతిలో ఆయన చేసిన సినిమా డైలాగుల అంశం పక్కన పెడితే.. అసలు బీజేపీ అభ్యర్థికి ఎందుకు ఓటెయ్యాలి..? ఓటెస్తే బీజేపీ అభ్యర్థి ఏం చేస్తారు.. ?. ప్రత్యేకహోదా, స్టీల్ ప్లాంట్ అంశాలపై స్పందనేంటి..? అనే ప్రశ్నలను ఆయన ప్రసంగం మిగిల్చేసింది. ఈ ప్రశ్నలు సామాన్య జనానికి రావడానికి కారణం ఎవరో కాదు. పవన్ కల్యాణే. ఎందుకంటే.. గతంలో ఆయనే ఈ అంశాల్లో బీజేపీపై విరుచుకుపడ్డారు. తాట తీస్తామన్నారు. డిపాజిట్లు రాకుండా చేస్తామన్నారు. బీజేపీ అంతరించి పోయిందన్నారు. ఆ సమస్యలేమీ పరిష్కారం కాలేదు. కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్ నిర్మోహమాటంగా .. బీజేపీకి ఓటు వేయాలని తిరుపతిలో పిలుపునిచ్చారు. ఆయనకు మనస్సాక్షి అంటూ ఉంటే.. కనీసం… ఎందుకు ఓటు వేయాలో.. వివరించి ఉండేవారు.

పాచిపోయిన లడ్డూల గురించి మర్చిపోయారా..?

ప్రత్యేకహోదా పేరు లేకపోయినా అందులో ఉన్న ప్రయోజనాలన్నీ ప్యాకేజీ పేరుతో ఇస్తామంటే నాటి ప్రభుత్వం అంగీకరించింది. కానీ అప్పట్లో ప్రత్యేకహోదా పేరు కావాల్సిందేనని.. ప్రజల్ని రెచ్చగొట్టిన వారిలో పవన్ కల్యాణ్ ముందు ఉంటారు. పవన్‌క‌ల్యాణ్‌కు గుర్తుందో లేదో. .ఓ సినీ వివాదం.. తన అభిమాని చనిపోతే.. పరామర్శకు వెళ్లి..రెండు రోజులు అక్కడే మకాం వేసి మరీ సభ పెట్టారు. దేని కోసం సభ పెట్టారో చివరి వరకూ తెలియదు కానీ.. తీరా సభలో ప్రత్యేకహోదా అంశాన్నే ఎత్తుకున్నారు. ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చారు. బీజేపీపై విరుచుకుపడ్డారు. వెంకయ్యనాయుడ్ని తిట్టారు. తనపై విమర్శలు చేస్తున్న నాటి బీజేపీ ముఖ్యుల్ని తన డైలాగుల్ని విమర్శించారు. అప్పటి పాలకపక్షమైన టీడీపీని వదల్లేదు. ఓ రకంగా ప్రత్యేకహోదా అంశాన్ని రాజకీయం చేసింది పవన్ కల్యాణ్. ఆ ప్రత్యేకహోదా ఇంత వరకూ రాలేదు. ఇచ్చేది లేదని కేంద్రం చెబుతోంది. ఇప్పుడు ప్రకటించిన ప్యాకేజీ కూడా ఇవ్వడం లేదు. ఉన్నది పోయింది.. ఉంచుకున్నదీ పోయిందన్నట్లుగా ఏపీ పరిస్థితి మారింది. నాడు ప్రత్యేక హోదా అంశాన్ని ప్రజల్ని రెచ్చగొట్టడానికి వాడుకున్నపవన్ కల్యాణ్.. ఇప్పుడుఆ హోదా ఇచ్చేది లేదని చెబుతున్న బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఎక్కడా బీజేపీని హోదా గురించి అడగడం లేదు. రాజకీయం కోసం రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నానని పవన్ కల్యాణ్ మనస్సాక్షికి అనిపించడం లేదా..?

బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే రాష్ట్రానికేం వస్తుంది..!?

వైసీపీకి ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నా… ఒక్కరూ నోరెత్తరని.. తిరుపతి నుంచి పోటీ చేస్తున్న వ్యక్తికి కూడా నోరు లేదని.. ఆయనను గెలిపించి ఏం ప్రయోజనమని పవన్ కల్యాణ్ తిరుపతి ఓటర్లను ప్రశ్నించారు. చాలా మంచి ప్రశ్న వేశారు. నిజానికి ఇది చాలా మందిలో ఉన్న ఆలోచన. వైసీపీ అభ్యర్థిని మరోసారి గెలిపిస్తే.. రాష్ట్రానికేం ప్రయోజనం అని ఆలోచిస్తున్నారు. అదే సమయంలో… బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే.. రాష్ట్రానికి ఎలా ప్రయోజనమో… పవన్ కల్యాణ్ విశదీకరించి చెప్పాల్సి ఉంది. దేశంలో బీజేపీకి నాలుగు వందల వరకూ ఎంపీలు ఉన్నారు. ఒక్కరంటే ఒక్కరైనా సమస్యలపై నోరెత్తుతున్నారా..?. తెలంగాణలో నలుగురు ఎంపీలు గెలిచి.. ఆ రాష్ట్రానికి బీజేపీ ఎంపీలు ఏం తీసుకొచ్చారు..? ఏపీకి ప్రత్యేకహోదా తరహాలో.. తెలంగాణకు పసుపుబోర్డు మోసం చేశారు. అధికారం అండగా ఎదురుదాడి చేస్తున్నారు. ప్రశ్నించిన వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరిస్తున్నారు. ఏపీలో రత్నప్రభ గెలిస్తే.. రాష్ట్రం కోసం ఆమెఏ విధంగా పోరాడుతారు..?. ప్రత్యేకహోదా పై ఆశలు పెట్టుకోవద్దని ఆమె నేరుగానే చెబుతున్నారు.. కాబట్టి… ఒక వేళ గెలిస్తే ఏం చేస్తారు..?. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటారా..? పోలవరంకు సవరించిన అంచనాలను ఆమోదించేలా చేస్తారా..? కేంద్ర ప్రాజెక్టులకు నిధులు ఆపకుండా తీసుకు వస్తారా..? వెనుకబడిన జిల్లాలకు నిధులు తీసుకు వస్తారా..? విభజన చట్టం హామీలను అయినా అమలు చేసేలా ప్రయత్నిస్తారా..? ఏ ఒక్కటైనా రత్నప్రభ చేయగలరా..?. ఒక వేళ పవన్ చెప్పినట్లుగా బీజేపీని గెలిపిస్తే.. అది రాష్ట్రనికి మరింత చేటు చేస్తుంది కానీ ఏ మాత్రం మేలు చేయదని.. రాజకీయంగా కాకుండా.. రాష్ట్రం ప్రకారం ఆలోచిస్తే.. ఏ వ్యక్తికైనా అర్థమవుతుంది. మరి రాష్ట్రం కోసమే.. జనం కోసమే ఉన్నానంటున్న పవన్ కల్యాణ్‌కు ఎందుకు తెలియలేదు. ఆయనకు మనస్సాక్షి అనేది ఉందా..?

రత్నప్రభ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు..!?

అభివృద్ధి కావాలంటే బీజేపీ అభ్యర్థిని గెలిపించాలంటూ… పవన్ కల్యాణ్ చెబుతున్నారు. తిరుపతికి ఎలాంటిఅభివృద్ధి చేస్తారు..?. తిరుపతికి నిజంగా చేయదల్చుకుంటే… ఎన్నో పనులు ఉన్నాయి. గత ఆరేడేళ్ల కాలంలో… ఎంత చేశారో శ్వేతపత్రం విడుదల చేయించగలరా..?. కనీసం తిరుపతి ఎయిర్ పోర్టుకు ఇంటర్నేషనల్ హోదా ఇచ్చినా ఒక్కటంటే ఒక్క ఫ్లైట్‌ను కూడా ఏర్పాటు చేయలేదు. మాటకొస్తే బీజేపీ నేతలు వందల కోట్లు.. తిరుపతి మీద గుమ్మరించామని చెబుతూంటారు. కానీ… ఏ ఒక్క అభివృద్ధి పని కనిపించదు. తిరుపతి స్మార్ట్ సిటీకి వందల కోట్లు ఇచ్చామంటారు. కానీ జగన్ తినేశారని ఎదురుదాడి చేస్తూంటారు. జగన్ తినేస్తే.. కేంద్రంలో ఉన్న బీజేపీ వాటా తీసుకుని సైలెంట్‌గా ఉందా..? . ఇలాంటిప్రశ్నలు సంధించడానికే పార్టీ పెట్టానని చెప్పే జనసేనానికి మనస్సాక్షి లేదా..?

వైసీపీ-బీజేపీ మైత్రి కళ్ల ముందు కనిపిస్తున్నా.. మనస్సాక్షికి తెలియడం లేదా..?

బీజేపీ- వైసీపీ రెండు అప్రకటిత మిత్రపక్షాలు. ఎన్డీఏలో ఉన్న ఏ పార్టీ కూడా ఇవ్వనంత సహకారం..బీజేపీకి వైసీపీ ఇస్తుంది. అదే పద్దతితో బీజేపీ సహకరిస్తుంది. అసలు వైసీపీని విమర్శిస్తున్నారని .. అవినీతిని బయట పెడుతున్నారన్న కారణంగానే… ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణను తొలగించి.. వైసీపీ చాయిస్ అయిన సోము వీర్రాజుకు పీఠం ఇచ్చారు. ఈ విషయం పవన్ కల్యాణ్‌కు తెలియదా..? తెలిసినా నటిస్తున్నారా..?

పదవి కోసం కాకపోతే బీజేపీతో పవన్‌కు ఎందుకు పొత్తు..!

పదవి వద్దని తనకు రాష్ట్రమే ముఖ్యమని పవన్ కల్యాణ్ చెబుతూంటారు. నిజానికి రాష్ట్రమే ముఖ్యమైతే.. ఆయన బీజేపీతో కలిసి ఏం సాధించారో ఎందుకు చెప్పడంలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ… రాష్ట్రాన్ని నాశనం చేస్తుందని తెలుసు. గతంలో ఆయనే చెప్పారు. అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి నైతిక మద్దతు ఇస్తున్నా ఆపలేకపోయారు. స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నా.. అడ్డం చెప్పలేకపోతున్నారు. పోలవరం నిధులివ్వలేకపోతున్నా ఆగడం లేదు. ఇన్ని చేస్తున్నా బీజేపీతో ఎందుకు పొత్తు.. పదవి కోసమేగా..? బీజేపీ మార్క్ రాజకీయాలు చేసి.. తనను ఏదో విధంగా ముఖ్యమంత్రి పదవిలో కూర్చో బెడుతుందనే ఆశతోనే కదా బీజేపీకి మద్దతిస్తుంది. పవన్ మనస్సాక్షికి ఇది కూడా తెలుసు… కానీ ఆయన తనను తాను ప్రశ్నించుకోవడం లేదు.

ఒక్కటి మాత్రం నిజం. పవన్ కల్యాణ్ పదవి కోసమే.. ఇదంతా చేస్తున్నారు. మనస్సాక్షిని చంపుకుని రాజకీయం చేస్తున్నారు. ఆశ కాకపోతే..బీజేపీ రాజకీయాలు చూసిన వాళ్లెవరూ ఆపార్టీని నమ్మరు. పవన్ గుడ్డిగా నమ్ముతున్నారు. చివరికి ఆయనకు పార్టీనే లేకుండా చేస్తారు. ఇప్పటి వరకూ జరిగింది ఇదే.. జరగబోయేది కూడా ఇదే. ఆ తర్వాత ఏమనుకున్నా ప్రయోజనం ఉండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐడీపై సుప్రీంకోర్టుకెళ్లిన ఏబీఎన్, టీవీ5..!

ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు తమపై నమోదు చేసిన రాజద్రోహం కేసులు కుట్రపూరితమని.. తక్షణం ఆ కేసులపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఆదేశాలివ్వాలని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ5 సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రెండు టీవీ చానళ్లు వేర్వేరుగా...

కరోనా అనాథల్ని చేసిన పిల్లలకు అండగా జగన్..!

కరోనా ఎన్నో కుటుంబాల్లో చీకట్లు ముసిరేలా చేస్తోంది. కొన్ని చోట్ల ఇంటి పెద్ద దిక్కును కోల్పోగా.. మరికొన్ని చోట్ల..తల్లిదండ్రులు ఇద్దర్నీ కోల్పోయి చిన్నారు అనాథలవుతున్నారు. ఒకటో.. రెండో కాదు.. దాదాపుగా ప్రతి ఊరిలోనూ...

రఘురామ కేసులో “సుప్రీం” టర్న్..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో సీఐడీ పోలీసులు కొట్టారో లేదో తేల్చడానికి సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామకు వైద్యపరీక్షలు నిర్వహించాలని.....

ఈ సారీ కౌంటర్ దాఖలుకు సీబీఐ, జగన్‌కు తీరలేదు..!

రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ విషయంలో కౌంటర్ దాఖలు చేయడానికి వారాలకు వారాల గడువు సీబీఐకి సరిపోవడం లేదు. ఒక్క సీబీఐకే కాదు.... నిందితుడైన జగన్మోహన్ రెడ్డికీ...

HOT NEWS

[X] Close
[X] Close