ఐదేళ్లు : ఫేక్ పార్టీ – ఫేక్ పాలన – ఫేక్ లీడర్

జగన్ రెడ్డి ప్రజలకు మాయ మాటలు చెప్పి కులంపై తప్పుడు ప్రచారాలు చేసి .. ప్రజల్ని రెచ్చగొట్టి తెచ్చుకున్న గెలుపులో… తన పాలనకు కూడా అదే ఫార్ములా అనుసరించారు. అంతా ఫేక్. ఒక్కటీ నిజం ఉండదు. నిజం ఒకటి అయిదే.. దాన్ని ఫేక్ చేసి… ఇష్టం వచ్చినట్లుగా ప్రచారం చేస్తూ ఉంటారు. అది పాలనతో పాటు.. రాజకీయంలోనూ అంతే. ప్రజలు ఒకసారి నమ్ముతారు.. రెండో సారి నమ్ముతారు.. కానీ మూడో సారి నిజం చెప్పిన నమ్మరు. ఇప్పుడు వైసీపీకి ఆ పరిస్థితి వచ్చింది.

పాలన మొత్తం ఫేకే !

ఐదేళ్లలో జగన్ రెడ్డి ఏం చేశారంటే… అబ్బో ప్రపంచం మొత్తాన్ని మార్చేశారని చెప్పుకునే ఫేక్ ప్రచారంతో తెర మీదకు వస్తారు. ప్రపంచంలో ఉన్న అభివృద్ధి పనులు మాత్రమే జగన్ రెడ్డే చేసినట్లుగా మార్ఫింగ్‌లు చేస్తారు. నిజాలు మాత్రం జనం కళ్ల ముందే ఉంటాయి. ఉదాహరణకు మెడికల్ కాలేజీలు. తెలంగాణ సర్కార్ పాతికపైకా మెడికల్ కాలేజీలు గత పదేళ్లలో కట్టి క్లాసులు ప్రారంభించిది. జగన్ రెడ్డి సర్కార్ అనుమతులు తెచ్చింది మూడు కాలేజీలు. అరకొరగా నిర్మించి క్లాసులు ప్రారంభించారు. కానీ ప్రచారం చేసుకునేది పదిహేడు. చాలా కాలేజీల నిర్మాణం పునాదులు దాటలేదు. ఆ పేరుతో అప్పులు మాత్రం చేసి ఖర్చు పెట్టేశారు. ఇలా ఒక్కటే.. జగన్ రెడ్డి సర్కార్ చెప్పే ఏ విషయంలోనూ నిజం ఉండదు. అంతా ఫేక్. చివరికి బడ్జెట్ పత్రంలోనూ ఫేకే. అప్పుల లెక్కలు చెప్పరు. కార్పొరేషన్ల పేరుతో తీసుకున్నరుణాలు చెప్పరు. జగన్ రెడ్డి తీరు ఎలా ఉంటుందంటే… తాను తీసుకున్న అప్పులు ఎంతో చెప్పరు.. కానీ పర్సంటేజీలతో చెబుతారు. అప్పటి పర్సంట్ కన్నా ఇప్పటి వర్సంట్ తక్కువని చెబుతారు. ఈ పర్సంట్‌లలో ఆయన ఎక్స్ పర్ట్. ఆయన మాటలు విని.. అందరూ ఆశ్చర్యపోతారు. వైసీపీ ఫేక్ పాలన గురించి చెప్పుకోవాలంటే… ఎంత రాసినా తక్కువే. ఫలానాది నిజం అని చెప్పడానికి చాన్స్ లేదు.

ఫేక్ రాజకీయం

పోనీ రాజకీయం అయినా నిజాయితీగా చేస్తారంటే.. అది ఇంకా ఫేక్. ప్రజల డబ్బుతో మార్ఫింగ్‌ల మాఫియా నడిపే ఒకే ఒక్క ప్రభుత్వం జగన్ రెడ్డిదే. తాజాగా చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి అమిత్ షాతో భేటీ కాక ముందే ఆయన కాళ్లకు మొక్కారంటే ఫేక్ చేసి రిలీజ్ చేశారు. అది ఫేక్ అని అందరికీ తెలిసిపోయేలా చేసి దొరికిపోవడం వైసీపీ స్టైల్. అయితే ఇదేమీ వైసీపీ తెలివి తక్కువ తనం కాదు. జగన్ రెడ్డిని గుడ్డిగా నమ్మవాళ్లు గొర్రెలని..ఆయన ఏం చెబితే అది గట్టిగా నమ్ముతారని వారి భావన. అలాంటి గొర్రెలు ఉన్నారనే.. ఇలా ఫేక్ రాజకీయంలో తమదైన ముద్ర వేస్తున్నారు. అయితే ఇలాంటి వారంతా ప్రతీ సారి బకరాలు అవరు ..కదా..ఎంతో కొంత మార్పు వస్తుంది. అయినా వీరు మాత్రం మారడం లేదు. తమ ఫేక్ రాజకీయంలో … ఎవడూ కొట్టలేడని చెలరేగిపోతున్నారు.

ఫేక్ లీడర్

పాలనను.. పార్టీని ఫేక్ పునాదుల మీద నిర్మించుకున్న జగన్ రెడ్డి తనలోనైనా కాస్త నిజాయితీ ఉందని.. ప్రజల ముందు చూపించుకుంటారా అంటే.. అసలు తానే ఓ పెద్ద ఫేక్ అన్నట్లుగా ఆయన వ్యవహారం ఉంటుంది. ఆయన తనకు పత్రికలు లేవు.. టీవీలు లేవు.. ఆస్తులు లేవు.. పేద బిడ్డనని చెప్పుకుంటూ ఉంటారు. కానీ కళ్ల ముందు ఆయన అవినీతి అక్రమ సంపాదన… విలాస జీవితం ఉంటుంది. కానీ తాను చెబితే ఫేక్ అయినా నిజమని నమ్మేస్తారని ఆయన నమ్మకం. అది ఒక్కటే కాదు..తనకు అవసరం అయిన ప్రతీ మాట ఫేకే. తండ్రి చావు దగ్గర్నుంచి .. చెల్లిని గెంటేయడం వరకూ అన్నీ ఫేక్ పనులు చేసి.. నిజమైన ఫేక్ లీడర్ ముద్ర వేసుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close