నెల్లూరు నుంచి ఆనం రూపంలో మరో రఘరామ !

ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఇటీవల ప్రభుత్వ తీరుపై విమర్శలు చేసిన వెంకటగరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి భద్రత తగ్గించారు. అప్పుడు ఏమీ మాట్లాడని ఆయన ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి సంచలన ఆరోపణలు చేశారు. తనకు ప్రాణహానీ ఉందని.. ప్రాణం తీసేస్థాయికి దిగజారిపోయారని ఆరోపణలు గుప్పించారు. ప్రాణాలు తీసేందుకు కూడా తెగిస్తున్నారని.. తాను దేనికైనా సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. తాను చనిపోతే తన లాంటి వాళ్లు మరో పది మంది పుట్టుకు వస్తారన్నారు.

ఇలాంటి పోకడలు గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. స్థానికంగా ఉన్న అధికారులను మార్చడంతో పాటూ తన భద్రతను కూడా తగ్గించారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో రాజ్యాంగేతర శక్తులు అధికారం చెలాయిస్తున్నాయని, ఇది సరైన పద్ధతి కాదంటూ హితవు పలికారు. తాను ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబు అధికారంలో ఉన్నా తన సెక్యూరిటీని తగ్గించలేదని గుర్తు చేశారు. తన ఫోన్లు, తన పీఏ ఫోన్లు కూడా ఏడాదిన్నరగా ట్యాపింగ్ చేస్తున్నారని మండిపడ్డారు ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరు జిల్లాలో మాఫియా గ్యాంగ్ లు రాజ్యమేలుతున్నాయని తాను ఏడాదిన్నర క్రితం కామెంట్లు చేసినప్పటి నుంచి తన ఫోన్లు ట్యాపింగ్ కి గురవుతున్నాయని అన్నారు.

ఆఫ్ ది రికార్డ్ చెప్పాల్సిన ఖర్మ పట్టలేదని, తాను ఆన్ రికార్డే చెబుతున్నానన్నారు రామనారాయణ రెడ్డి. ముఖ్యమైన సందేశాలుంటే వాట్సప్, ఫేస్ టైమ్ యాప్ ద్వారా కాల్స్ చేసుకుంటున్నానని చెప్పారు. కన్న కూతురితో ఫోన్లో మాట్లాడాలనుకున్నా ఫేస్ టైమ్ వీడియో కాల్ లో మాట్లాడుతున్నానని చెప్పారు. అధికార పార్టీయే ట్యాప్ చేస్తున్నప్పుడు ఇక నేనెవరికి చెప్పుకోవాలని ఆయన ప్రశ్నించారు. ఆనంకు ఇప్పటికే పార్టీలో ప్రాధాన్యం లేకుండా చేశారు. అయితే ఆయనను సస్పెండ్ చేసే అవకాశం లేదు. తీవ్ర ఆరోపణలు చేస్తున్న రఘురామరాజునే ఏమీ చేయలేదు..ఎమ్మెల్యేను సస్పెండ్ చేయరని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత ఏమైనా దిల్ రాజు కూతురా..?

సినిమాపై ప్యాష‌న్ ఉన్న నిర్మాత దిల్ రాజు. ఓ స‌బ్జెక్ట్ న‌చ్చితే ఎంతైనా ఖ‌ర్చు పెడ‌తారు. గుణ‌శేఖ‌ర్ కూడా అంతే. త‌న క‌ల‌ల చిత్రాన్ని తెర‌పైకి తీసుకురావ‌డానికి ఏం చేయ‌డానికైనా సిద్ద‌మే. అందుకే...

ఈ సారి రాజమండ్రిలో టీడీపీ మహానాడు !

ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అతి పెద్ద సభను నిర్వహించేందుకు సిద్ధమయింది. ఒంగోలు మహానాడు నుంచి ఆ పార్టీలో జోష్ పెరగ్గా ఈ సారి ఎన్నికలకు ముందు రాజమండ్రిలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించుకుంది....

హెచ్‌ఎండీఏ కంటే సీఆర్డీఏ పెద్దది…కానీ : కేటీఆర్

హైదరాబాద్ కంటే అమరావతి పెద్దది. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన హెచ్‌ఎండీఏ కంటే... ఏపీ కొత్త రాజధాని సీఆర్డీఏ విస్తీర్ణం చాలా పెద్దది. ఈ విషయాన్ని స్వయంగా చెప్పింది తెలంగాణ మంత్రి...

అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ కావాలట !

వైఎస్ వివేకానందరెడ్డి కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనను సీబీఐ అధికారులు అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close