అనంతపురం జిల్లా పరిషత్ సీఈవో రామచంద్రారెడ్డిపై బదిలీ వేటు పడింది. జడ్పీ చైర్ పర్సన్ గిరిజమ్మ చాంబర్ లోని గోడకు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఫోటోను తొలగించకుండా అలాగే ఉంచడంపై కూటమి ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల అక్కడికి వెళ్ళిన ఎమ్మెల్యేలు ఈ వ్యవహారంపై సీఈఓను నిలదీశారు.
మాజీ ముఖ్యమంత్రి ఫోటోను ఇంకా ఎందుకు జడ్పీ చైర్ పర్సన్ చాంబర్ లో ఉంచారని, ఏ నిబంధనల అనుసరించి ఫోటో తొలగించలేదని సీఈఓను ప్రశ్నించారు ఎమ్మెల్యేలు. అధికారులు పార్టీలకు అతీతంగా పని చేయాలని హితవు పలికారు. జిల్లా పరిషత్ కార్యాలయాన్ని వైసీపీ కార్యాలయం అనుకుంటున్నావా అని రామచంద్రారెడ్డిపై ఫైర్ అయ్యారు.
ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. సీఈవో వైసీపీ అనుకూల అధికారిగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన్ను సీఈఓను జీఏడీకి అటాచ్ చేస్తూ ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.