దళితడ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసిన ఘటనలో అనంతబాబు భార్య రోజా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణను సిట్ కొనసాగిస్తోంది. సీసీ ఫుటేజీలు, కాల్ రికార్డ్స్ వంటి వాటిని సిట్ విశ్లేషించి సాంకేతిక ఆధారాలు బయటకు తీయడంతో…ఆ హత్యలో ఇంకా చాలా మంది ఉన్నాడన్న విషయం బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా అనంతబాబు భార్య రోజా ఈ హత్య సమయంలో ఘటన జరిగిన ప్రాంతంలోనే ఉన్నట్లుగా తెలియడంతో ఆమెను విచారణకు పిలవాలనుకుంటున్నారు. ముందుగా ఆమె గురించి సమాచారం కోసం ఎమ్మార్వోను సంప్రదించారు. కానీ విషయం ఎమ్మార్వో కార్యాలయం నుంచి అనంతబాబుకు చేరింది.దీంతో తనను కూడా అరెస్టు చేస్తారన్న ఉద్దేశంతో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
అనంతబాబు చెప్పిన కథనే అప్పట్లో రాసుకున్న పోలీసుుల
అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన తర్వాత మీడియాలో హైలెట్ అయితేనే పోలీసులు కేసు పెట్టారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో తప్పనిసరిగా అనంతబాబును అరెస్టు చేశారు. కానీ విచారణ చేయలేదు. తూ తూ మంత్రంగా విచారణ ప్రక్రియ కొనసాగించారు. అందులో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఒక్కడే ఆ హత్య ఎలా చేయగలడు.. చేసినా దాన్ని డోర్ డెలివరీ చేయాలంటే ఒక్కడి వల్ల కాదు.. చాలా మంది ప్రమేయం ఉంటుందని సహజంగా పోలీసులకు రావాల్సిన డౌట్. కానీ అంత చాన్స్ ఇవ్వలేదు.
అనంతబాబు నేరుగా వైసీపీ సపోర్టు
అసలు ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనే అంశంపై దర్యాప్తు చేయకుండా.. అనంతబాబు చెప్పిన కథల్నే రాసుకున్నారు. కావాలని చంపలేదని.. ప్రమాదవశాత్తూ జరిగిపోయిందన్న కథను చెబితే అంతే రాసుకున్నారు. కానీ దర్యాప్తు చేయలేదు. తానే చంపేశారని లొంగిపోయాడని సరి పెట్టారు. కానీ లోతుగా కాకపోయినా పైపైన విచారణ జరిపినా అప్పట్లో అన్ని విషయాలూ బయటకు వచ్చేవి.కానీ పోలీసుల్ని పూర్తిగా నియంత్రించారు. అనంతబాబును పైకి సస్పెండ్ చేసినట్లుగా ప్రకటించినా వైసీపీ నాయకత్వం ఆయనపై చాలా నమ్మకాన్ని పెట్టుకుని ప్రోత్సహించింది. పోలీసులు దర్యాప్తు చేయకపోవడం.. చార్జిషీటు దాఖలు చేయకపోవడంతో సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చింది.
చాలా వివరాలు బయటకు రావాల్సిఉంది !
ప్రభుత్వం మారిన తర్వాత కొత్త సిట్ వేసి పునర్విచారణ చేస్తున్నారు. ఆధారాలన్నీ సమీకరిస్తున్నారు. ఇందులో హత్య ఘటనలో ఒక్క అనంతబాబు మాత్రమే కాదని ఇంకా చాలా మంది ఉన్నారని గుర్తిస్తున్నారు. అనంతబాబు భార్య కూడా హత్య ఘటనలో ఉన్నట్లుగా సీన్ టీవీతో పాటు ఇతర సాంకేతిక ఆధారాలు లభించడంతో విచారణకు పిలవనున్నారు.కానీ వారికి ముందస్తుగా సమాచారం లీక్ కావడంతో కోర్టుకు వెళ్లారు. త్వరలో ఈ కేసులో అసలు హత్యకారణంతో పాటు అన్ని వివరాలను వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది.
