ఆంధ్రజ్యోతికి అతి పెద్ద కార్పొరేట్ భవనం రెడీ అవుతోంది. ఫీనిక్స్ సంస్థ ఈ భవనాన్ని సరికొత్త మోడల్లో కనిపిస్తోంది. ఫిల్మ్ నగర్ ఏరియాలో ఇప్పుడు అత్యంత ఎక్కువ అంతస్తులతో నిర్మాతమవుతున్న భవనం ఏబీఎన్ ఆంధ్రజ్యోతిదే.
అల్లు అరవింద్ కుటుంబానికి చెందిన భూమిని ఆర్కే తన సంస్థ తరపున కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో ఆ స్థానంలో మెగా కుటుంబానికి చెందిన సినిమాల పోస్టర్లు అంటించే ఏర్పాట్లు ఉండేవి. చాలా కాలం ఖాళీగానే ఉంది. ఇప్పుడు దాన్ని ఆర్కే కొనుగోలు చేసి తన సంస్థలకు సొంత కార్యాలయాలను రెడీ చేస్తున్నారు.
కొంత మంది ఆంధ్రజ్యోతి ఆర్థిక కష్టాల్లో ఉందని ప్రచారం చేస్తున్నారు కానీ ఆర్కే.. సంస్థను నిర్వహించే విధానం ఆర్థికంగా చాలా పక్కాగా ఉంటుంది. మరో పదేళ్లు సమస్యలు లేకుండా నడిపించగలిగే శక్తిని ఆయన సంస్థకు సమకూర్చిపెట్టారు. ఏ ప్రభుత్వం మీద కూడా ఆయన ఆధారపడరు. వైఎస్ ఉన్నప్పుడు..జగన్ ఉన్నప్పుడు.. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రభుత్వాల నుంచి రూపాయి రాలేదు. ఇప్పుడు కూడా ఇబ్బడిమబ్బడిగా ఏమీ రావు. ప్రభుత్వాలు చాలా స్వల్పంగా ఇచ్చే చట్టబద్ధంగా ఇచ్చే ప్రకటనల వల్లే స్వల్ప ఆదాయం వస్తుంది.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మిగతా మీడియా సంస్థల్లా విపరీతమైన ఖర్చుతో నడపరు. ఎంత తక్కువగా నడపవచ్చో అంత తక్కువకు నడుపుతారు. అందుకే ఆ సంస్థ ఆర్థిక కష్టాల్లో ఉంటుందని… ఊహించుకోవడం అమాయకత్వమే.
