మీడియా వాచ్ : కరోనా మరణాలపై ఆంధ్రజ్యోతి వర్సెస్ నమస్తే..!

కరోనా మరణాలపై రాజకీయ పార్టీల మధ్యే కాదు.. మీడియా సంస్థల మధ్య కూడా.. వార్ ప్రారంభమయింది. తెలంగాణ ప్రభుత్వ పెద్దల సొంతమైన నమస్తే తెలంగాణ… ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయడానికి ఏ మాత్రం సందేహించని.. ఆంధ్రజ్యోతి మధ్య ఈ వార్ ప్రారంభమయింది. గత వారం… కరోనా మరణాలను ప్రభుత్వం దాచేస్తోందంటూ.. ఆంధ్రజ్యోతి.. ఓ పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. శ్మశాన వాటికల వద్ద కాపలా ఉండి.. ఫోటోలు.. దృశ్యాల సహితంగా..ఎన్నెన్ని మృతదేహాలు వస్తున్నాయో… ఏ పద్దతిలో వస్తున్నాయో.. మొత్తం వివరించి సమగ్ర కథనం రాసింది. ఒక్క రోజే యాభైకిపైగా మరణాలు సంభవిస్తే.. ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్‌లో పది లోపే ఉన్నాయని తేల్చింది. ఇది ప్రజల్లో చర్చకు కారణం అయింది. విపక్ష రాజకీయ నేతలకు అస్త్రంగా మారింది.

ఈ కథనంపై ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ పరోక్షంగా మండిపడ్డారు. రోజుకు వెయ్యి మంచి చనిపోతూంటారని.. వారందరివీ కోవిడ్ మరణాలే అని.. ఓ ప్రెస్‌మీట్‌లో విరుచుకుపడ్డారు. ఈ పాయింట్ నమస్తే తెలంగాణకు నచ్చిందేమో కానీ.. వెంటనే రంగంలోకి దిగి… ఆంధ్రజ్యోతి ప్రకటించిన … ఖననాలన్నీ సాధారణ మరణాలేనన్నట్లుగా ఓ కథనం రాసింది. నిజానికి ఇక్కడ సింపుల్ లాజిక్ ఉంటుంది. సాధారణ మరణాలైతే.. కుటుంబసభ్యులు అంతిమ సంస్కార వాహనంలో తీసుకు వస్తారు. కోవిడ్ మరణాలైతేనే అంబులెన్స్‌ల్లో తీసుకువచ్చి అత్యంత జాగ్రత్తగా దహనం చేస్తారు. అయితే.. ఇదేమీ పట్టించుకోని.. నమస్తే తెలంగాణ … కొన్ని విచిత్రమైన వాదనలతో అవన్నీ.. సహజమరణాలేనని తేల్చేసి.. ఆంధ్రజ్యోతిపై విమర్శలు చేసింది.

అయితే ఈ క్రమంలో ఆంధ్రజ్యోతి సేకరించలేకపోయిన కొంత సమాచారాన్ని కూడా నమస్తే తెలంగాణ ఇచ్చింది. కరోనా చికిత్సల కోసం ప్రత్యేకించిన తర్వాత గాంధీ ఆస్పత్రిలో కరోనా మరణాలు భారీగా పెరిగాయనే విషయం స్పష్టంగా చెప్పింది. గాంధీ ఆసుపత్రిలో ఏప్రిల్‌లో 113 మంది, మే నెలలో 189 మంది, జూన్‌లో 344 మంది, జూలైలో 369 మంది చనిపోయినట్లు నమస్తే తెలంగాణ తెలిపింది. అయితే.. అధికారిక లెక్కల ప్రకారం.. తెలంగాణలో కరోనా మరణాలు 500 దాటలేదు. గాంధీలో వేరేవారిని చేర్చుకోవడం లేదు కాబట్టి.. ఆ మరణాలన్నీ కరోనా మరణాలేనని.. ప్రభుత్వం సమాచారాన్ని దాస్తోందని… నమస్తే తెలంగాణనే చెబుతోందని.. ఆంధ్రజ్యోతి ఈ రోజు కౌంటర్ ఇచ్చింది.

టీఆర్ఎస్ నేతలు.. రాజకీయంగా… విపక్షాలపై ఎటాక్ చేస్తూంటే.. నమస్తే తెలంగాణ మీడియా పరంగా ఆ బాధ్యత తీసుకుంది. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న పత్రికలపై ..మీడియా సంస్థలపై విరుచుకుపడుతోంది. అయితే.. ఈ క్రమంలో.. కొన్ని వాస్తవాలను బయట పెట్టి… వాటికి అదనపు బలం ఇస్తోంది తప్ప… గట్టిగా వాదన వినిపించలేకపోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేగేదాకా లాగుతున్న సర్కార్-ఎస్‌ఈసీ..!

ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగసంక్షోభ సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల నిర్వహణకు హైకోర్టు కూడా స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం.. అధికారులు సహకరించడానికి ఏ మాత్రం సిద్ధంగా లేరు. అదే సమయంలో ఎస్‌ఈసీ...

గ్రేటర్ పీఠం కైవసానికి టీఆర్ఎస్ స్కెచ్ రెడీ ..!

గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవిని అలా వదిలేయడానికి తెలంగాణ రాష్ట్ర సమితి పెద్దలకు మనస్కరించలేదు. ఎలాగోలా పీఠంపై గులాబీ నేతను కూర్చోబెట్టాల్సిందేనని డిసైడయ్యారు. ఎన్నికలు ముగిసి చాలా కాలం అవుతున్నా.. పాత కార్యవర్గానికి...

ధిక్కరణకే సర్కారు మొగ్గు..!

పంచాయతీ ఎన్నికల విషయంలో హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ.. ఎస్‌ఈసీకి సహకరించకూడదని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు అధికారులకు తేల్చి చెప్పడంతో వారెవరూ.. ఎస్‌ఈసీతో కనీసం సమావేశానికి కూడా ఆసక్తి చూపడంలేదు. పంచాయతీ...

వెంటిలేటర్‌పై శశికళ..!

ఇరవై ఏడో తేదీన చిన్నమ్మ విడుదలవుతుంది.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దున్ని పారేస్తుందని... తమిళ మీడియా జోరుగా విశ్లేషిస్తున్న సమయంలో అనూహ్యంగా శశికళ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆమెకు శ్వాస సమస్య...

HOT NEWS

[X] Close
[X] Close