ఏపీ రికార్డ్.. ఏడాదిలో రూ. 77వేల కోట్ల అప్పు..!

ఆంధ్రలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడ్జెట్ ప్రవేశ పెట్టారు. అందులో రూ. 35వేల కోట్ల వరకూ అప్పు తీసుకుంటామని ప్రతిపాదించారు. కానీ.. ఆర్థిక సంవత్సం ముగిసే సరికి.. అంతకు రెండింతలు అప్పు చేశారు. ప్రభుత్వం చేసిన అప్పు రూ. 77వేల కోట్లు. ఓ ఆర్థిక సంవత్సరంలో ఓ రాష్ట్ర ప్రభుత్వం ఇంత భారీగా అప్పు చేయడం.. ఇటీవలి కాలంలో లేదు. ఈ అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని రకాల ఆప్షన్స్‌ను వాడుకుంది. ఆర్బీఐ బాండ్లు, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచుకుని వాడుకోవడం… ఉద్యోగుల నిధులు వాడుకోవడం.. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. వాటి ద్వారా నిధులు తీసుకోవడం ఇలా.. అప్పులు పుట్టడానికి ఏ చిన్న అవకాశం ఉన్నా.. వదిలి పెట్టలేదు. ఇలా.. మొత్తంగా రూ. 77వేల కోట్లు అప్పు చేసింది.

గత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనా రూ. 2 లక్షల 27వేల కోట్లు. మొత్తంగా మార్చి నెలాఖరు ఖర్చు పెట్టింది రూ. 1 లక్షా 87వేల కోట్లు. ఇందులో రూ. 77వేల కోట్లు అప్పు. అంటే.. నికంగా ఏపీకి వచ్చిన ఆదాయం రూ. 1లక్షా పదివేల కోట్లకు అటూ ఇటూగానే. ప్రస్తుత ఆర్థిక సంవత్సంలో ప్రభుత్వం స్థానిక ఎన్నికలు, కరోనా కారణంగా బడ్జెట్ ప్రవేశ పెట్టలేకపోయింది. మూడు నెలల పద్దుల కోసం.. ఆర్డినెన్స్ జారీ చేసి.. ఖర్చులకు అనుమతి తీసుకున్నారు. అయితే.. ఈ ఏడాదిలోనూ.. అప్పులపైనే.. ప్రభుత్వం ఆధారపడటం తప్పని పరిస్థితి కనిపిస్తోంది. కరోనా కారణంగా ఆదాయం మొత్తం నిలిచిపోవడంతో.. ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. కరోనా సహాయక చర్యలకు.. కేంద్రం నుంచి నిధులు వచ్చినా.. ప్రభుత్వాన్ని నడపటానికి .. ఇతర సంక్షేమ పథకాలకు నిధులు వెచ్చించడానికి అప్పులు చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది.

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో.. ఆర్బీఐ ద్వారా సెక్యూరిటీలు వేలం వేసి నిధులు సమీకరించుకోవడానికి కొత్త అవకాశం లభించింది. దీంతో.. మొదట్లోనే ప్రభుత్వం రూ. మూడు వేల కోట్ల సెక్యూరిటీలు వేలం వేయడానికి ప్రయత్నించింది.అయితే.. రూ. వెయ్యి కోట్ల సెక్యూరిటీలు మాత్రమే అమ్ముడయ్యాయి. మరో రూ. రెండు వేల కోట్ల సెక్యూరిటీల జారీని ఉపసంహరించుకున్నారు. వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి మరో రూ. పదివేల కోట్ల అప్పుల కోసం.. ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని.. కేంద్రం సాయం చేయాలని విజ్ఞప్తులు చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే వరకూ రమేష్‌కుమార్ బాధ్యతలు తీసుకోకూడదట..!

స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ బాధ్యతలు తీసుకున్నట్లుగా ప్రకటించుకుని.. సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం చట్ట విరుద్ధమని తాజాగా ఏపీ ప్రభుత్వం వాదన వినిపించడం ప్రారంభించింది. సోమవారం.. ఎస్‌ఈసీగా రమేష్...

అన్‌లాక్ 1 : 8వ తేదీ నుంచి హోటళ్లు, ఆలయాలు ఓపెన్..!

దేశంలో లాక్‌డౌన్‌ను కంటెన్మెంట్‌జోన్లకే పరిమితం చేస్తూ... కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్‌ ముగింపు కోసం.. అన్‌లాక్ పాలసీని ప్రకటించింది. దీనిలో భాగంగా జూన్ ఎనిమిదో తేదీ నుంచి ఆలయాలు, హోటళ్లు,...

ఇన్ సైడ్ న్యూస్: సొంత పత్రిక , ఛానల్ ప్రారంభించడం కోసం జనసేన కసరత్తు

త్వరలోనే సొంత పత్రిక, టీవి ఛానల్ ప్రారంభించాలనే యోచన తో జనసేన పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. ఈ మేరకు పార్టీలో క్యాడర్ నుంచే కాకుండా, పార్టీ ముఖ్య నేతల...

మోడీ సాధించే స్వావలంబనపై పవన్‌కు ఎంతో నమ్మకం..!

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీతో దేశం స్వయం స్వావలంబన సాధిస్తుందని.. ప్రధానమంత్రి మోడీ, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ తరవాత గట్టిగా నమ్ముతున్న వ్యక్తి జనసేన అధినేత పవన్...

HOT NEWS

[X] Close
[X] Close