ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం అత్యంత పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతోంది. ప్రత్యర్థి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పన్నే కుతంత్రాలను, కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలను తిప్పికొట్టాలంటే కేవలం మాటలు సరిపోవని, నాయకత్వ స్థాయిలోనే పటిష్టమైన ఐక్యత ఉండాలని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గుర్తించారు. ఇటీవల అసెంబ్లీ వేదికగా వారు పంచుకున్న సందేశాలు, వారి మధ్య ఉన్న సఖ్యత కేవలం రాజకీయ అవసరం మాత్రమే కాదు, జగన్ విభజిస్తేనే గెలుస్తామన్న వ్యూహానికి ఒక గట్టి సమాధానమం.
కూటమిలో చిచ్చు పెట్టే ప్లాన్లు అమలు చేస్తున్న జగన్
జగన్ రెడ్డి రాజకీయ శైలిని గమనిస్తే, కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య అసంతృప్తి రాజేయడం లేదా కుల సమీకరణలను మార్చడం ద్వారా లబ్ధి పొందాలని చూస్తుంటారు. అయితే, ఈసారి కూటమి నాయకత్వం ఎంతో అప్రమత్తంగా ఉంది. క్షేత్రస్థాయిలో ఉన్న క్యాడర్ మధ్య ఎలాంటి గందరగోళం తలెత్తకుండా ఉండాలంటే, పైస్థాయి నాయకులు ఒకే మాట మీద ఉండటం అత్యంత కీలకం. చంద్రబాబు అనుభవం, పవన్ కళ్యాణ్ నిబద్ధత కలగలిసి ఒకే తాటిపై నడవడం వల్ల, కార్యకర్తల్లో ఉన్న చిన్న చిన్న సందేహాలు కూడా పటాపంచలై, కూటమి ఒక సుస్థిర శక్తిగా రూపాంతరం చెందింది.
కూటమికి..జగన్ 20శాతం ఓట్ల దూరం !
తాజా సర్వేలు చెబుతున్న లెక్కల ప్రకారం, కూటమి ఐక్యంగా ఉన్నంత కాలం వైకాపాతో పోలిస్తే ఓట్ల శాతంలో దాదాపు 20 శాతం భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ భారీ గ్యాప్‌ను పూడ్చడం జగన్ రెడ్డికి సాధ్యం కాని పని. అందుకే ఆయన సోషల్ మీడియా ద్వారా ఫేక్ దాడుల కథనాలను సృష్టించి, ప్రజల్లో అలజడి రేపేందుకు ప్రయత్నిస్తున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ప్రభుత్వం ఈ దాడుల వెనుక ఉన్న అసలు సూత్రధారులను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచుతూ, ఆ కుట్రలను ఆదిలోనే నిర్వీర్యం చేస్తోంది.
జగన్ రెడ్డి కుట్రలన్నీ ఔట్ డేటెడ్ !
కూటమి ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తే, జగన్ రెడ్డికి అసెంబ్లీ మెట్లు ఎక్కే అవకాశం కూడా ఉండదు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అయినా, ఒక నాయకుడిని ప్రజలు ఎంతగా తిరస్కరించారో గత ఎన్నికల ఫలితాలే సాక్ష్యం. ఆ తిరస్కారం అలాగే కొనసాగాలంటే, కూటమి నేతలు తమ మధ్య ఉన్న సమన్వయాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి ,ఉపముఖ్యమంత్రి ఇద్దరూ ఒకరికొకరు ఇచ్చుకున్న గౌరవం, పంచుకున్న బాధ్యత రాష్ట్రాభివృద్ధికి , రాజకీయ స్థిరత్వానికి ఒక బలమైన పునాదిగా కనిపిస్తోంది.