జరిగిందేదో జరిగిపోయిందన్న ఏపీ డీజీపీ..!

అవసరం లేదని పోలీసుల మోహరింపు.. అంతకు మించి ఆడవాళ్లపై దాడులు.. 144 సెక్షన్లు.. వెంటబడి కొట్టడాలు.. ఇవీ.. అమరావతి గ్రామాల్లోనే కాదు.. గుంటూరు, కృష్ణా జిల్లాలో గత నెల రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు. ఇవన్నీ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. ఇంత దారుణమా.. అంటూ.. హైకోర్టు కూడా స్పందించింది. చట్టాన్ని ఉల్లంఘించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో పోలీసుల్లో ఉలికిపాటు ప్రారంభమయింది. పోలీసుల అత్యంత దారుణంగా విరుచుకుపడుతున్న సమయంలో.. ఎక్కడా కనిపించని.. వినిపించని ఏపీ డీజీపీ… హైకోర్టు సీరియస్ అయిన తర్వాత ఒక్క సారిగా తెరపైకి వచ్చారు. ఓ రాజకీయ నేత సాయంతో.. కొంత మంది రైతుల్ని పిలిపించుకున్నట్లుగా మీడియాకు సమాచారం ఇచ్చారు. వారంతా.. పోలీసులు తమను బాధలు పెట్టారని.. చెప్పుకున్నారట.

అప్పుడు డీజీపీ సవాంగ్.. ఇప్పటి వరకూ జరిగిందేదో జరిగిపోయింది.. ఇక నుంచి పోలీసులు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా.. ఉంటారని.. హామీ ఇచ్చారట. మీడియాకు.. పోలీసు వర్గాల నుంచి అందిన సమాచారం ఇది. ఓ బీజేపీ స్థానిక నాయకుడి ఆధ్వర్యంలో కొంత మంది రైతులు డీజీపీ వద్దకు వెళ్లారని.. పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారని చెప్పుకొచ్చారు. అసుల పోలీసులు చేసిన ప్రతీ పనికి బాధ్యత వహించాల్సింది డీజీపీనే. చట్టాలను ఉల్లంఘిస్తూ.. మానవ హక్కులను హననం చేస్తూ.. రౌడీమూకల్లా పోలీసులు విరుచుకుపడుతున్న సమయంలో… పట్టించుకోని డీజీపీ.. హఠాత్తుగా.. ఇక నుంచి పోలీసులు ఎలాంటి ఇబ్బందులు పెట్టరని హామీ ఇచ్చారు.

ఇదంతా.. హైకోర్టు ఆగ్రహం ఫలితమేనని.. రైతులు అంటున్నారు. ఇక నుంచి ఆందోళనలకు ఎలాంటి ఆటంకాలు కల్పించబోమని.. డీజీపీ చెప్పినట్లుగా చెబుతున్నారు. ప్రజాస్వామ్యయుతంగా చేసుకునే ఆందోళనలకు.. అభ్యంతరం చెప్పబోమంటున్నారు. ప్రజాస్వామ్యయుతంగా చేసుకున్న నిరసనలపైనే ఇప్పటి వరకూ నిర్బంధాలు విధించారు. అలా చేయడం చట్ట విరుద్ధం. ఇక చట్టవిరుద్ధంగా ఏమీ చేయబోమని డీజీపీ పిలిచి మరీ హామీ ఇచ్చారు. న్యాయవ్యవస్థ జోక్యం వల్లే పోలీసులు తగ్గారని రైతులు అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close