ఏపీలో జగన్ సునామీ..! కొట్టుకుపోయిన టీడీపీ..!

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అంచనాలకు మించిన వేవ్‌తో అనితర సాధ్యమైన విజయం దిశగా దూసుకెళ్తోంది. 125కిపైగా సీట్లు సాధించడం ఖాయమవుతోంది. ఎర్లీ ట్రెండ్స్‌లో.. ఆధిక్యం సాధించి.. ఆ తర్వాత రౌండ్లలో కూడా.. ఆ ఆధిక్యాన్ని అలా కొనసాగిస్తోంది వైసీపీ. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి అధికారాన్ని చేపట్టాలన్న లక్ష్యంతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సంకల్పానికి సరైన విజయం లభించినట్లయింది. తెలుగుదేశం పార్టీ కంచుకోటల్లో కూడా.. వైసీపీ అద్భుత విజయాలను నమోదు చేసే దిశగా పయనిస్తోంది.

తెలుగుదేశం పార్టీ అగ్రనేతలంతా.. దాదాపుగా వెనుకబడ్డారు. చివరికి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా.. కుప్పం నియోజకవర్గంలో ఓ రౌండ్‌లో వెనుకబడటం .. కలకలం రేపింది. ఆ తర్వాత రౌండ్లలో ఆయన ముందడుగు వేసినప్పటికీ.. ఇంత వరకూ జరిగిన ఎన్నికల్లో ఎప్పుడూ కూడా.. ఒక్క రౌండ్ కూడా వెనుకడుగు వేయలేదు. కానీ తొలి సారి.. వెనుకబడ్డారు. మంగళగిరి నియోజకవర్గంలో.. ఆయన తనయుడు లోకేష్ మాత్రం… కాస్త ముందుంజ వేశారు. పోస్టల్ బ్యాలెట్లతో సహా… ప్రతీ రౌండ్‌లోనూ అంతో ఇంతో ఆధిక్యత చూపిస్తూ వస్తున్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు .. తాము ఘన విజయాన్ని సాధించబోతున్నట్లుగా.. కొద్ది రోజులుగా విస్తృతంగా ప్రచారం చేశారు. చివరికి అనుకున్నది సాధించారు. ఇక… విభజిత ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ శకం ప్రారంభమవుతుంది. హైదరాబాద్ నుంచి నిన్న సాయంత్రమే… తాడేపల్లి చేరుకున్న జగన్మోహన్ రెడ్డికి… ఈ ఫలితాలు ఎక్కడ లేని సంతోషాన్ని కలిగించాయి. పెద్ద ఎత్తున ఉండవల్లికి.. వైసీపీ నేతలు చేరుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇద్ద‌రు వ‌ర్మ‌ల్లో.. ఫ‌స్టు ఎవ‌రు?

క‌రోనాపై సినిమా తీసేశాన‌ని ప్ర‌క‌టించాడు రాంగోపాల్ వ‌ర్మ‌. ఆ సినిమా టీజ‌ర్‌కూడా విడుద‌ల చేసి అంద‌రికీ షాక్ ఇచ్చాడు. వ‌ర్మ ప‌నుల‌న్నీ ఇలానే ఉంటాయి. గ‌ప్‌చుప్‌గా సినిమా లాగించేయ‌గ‌ల‌డు. ఈసారీ అదే ప‌ని...

నిర్మాత‌ల‌కు ఎన్టీఆర్ ఇచ్చే గౌర‌వం అదీ!

నిర్మాత అంటే ఈ రోజుల్లో క్యాషియ‌ర్ కంటే హీనం అయిపోయాడు. నిర్మాత అనే వాడు సెట్లో ఉండ‌డానికి వీల్లేదు అంటూ హీరోలు హుకూంలు జారీ చేసే రోజుల్లోకి వ‌చ్చేశామంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవొచ్చు....

లాక్‌డౌన్ 5.0 ఖాయమే..! కాకపోతే పేరుకే..!?

నాలుగో లాక్ డౌన్ గడువు కూడా ముంచుకొస్తోంది. మరో మూడు రోజుల్లో అది కూడా పూర్తవుతుంది. మరి తర్వాత పరిస్థితి ఏమిటి..? తర్వాత కూడా లాక్ డౌన్ పొడిగించాలనే ఆలోచనలనే కేంద్రం ఉంది....

సూర్య బ్ర‌ద‌ర్స్‌ని క‌లిపిన రీమేక్‌

సూర్య హీరోగా నిల‌దొక్కుని, ఓ ఇమేజ్ సాధించిన త‌ర‌వాతే... కార్తి రంగ ప్ర‌వేశం చేశాడు. తాను కూడా... త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే వీరిద్ద‌రూ క‌లిసి ఒక్క సినిమాలోనూ న‌టించ‌లేదు....

HOT NEWS

[X] Close
[X] Close