చైతన్య : కారణాలు కాదు మాస్టారూ.. పరిష్కారాలు కావాలి..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి తన వైఫల్యాలన్నింటికీ కారణాలు చెబుతున్నారు కానీ.. .పరిష్కారాలు మాత్రం చూపించడం లేదు. గడిచిన రెండేళ్లలో .. ఏపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. చివరికి పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని ప్రాజెక్టులు కూడా కట్టలేని స్థితికి చేరిపోయింది. ప్రారంభంలో ఎలాంటి ఆశలు కల్పించారో.. అవన్నీ దూదిపింజల్లా తేలిపోతున్నాయి. అయితే అన్నింటికీ కారణాలు చెబుతున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు కావాల్సింది కారణాలు కాదు.. పరిష్కారాలు. కారణాలు చెప్పి చేతెలెత్తేస్తే వారిని పాలకులు అనరు…!

ప్రతీ సమస్యకూ కారణం చెబుతారు కానీ..పరిష్కారం చూపరు..!

కరోనా వల్ల ఆదాయం తగ్గింది.. అందుకే అభివృద్ధి లేదు..! ఆదాయం తగ్గింది అందుకే రోడ్లు వేయలేకపోతున్నాం..! చంద్రబాబు అప్పులు చేసివెళ్లారు.. తీర్చడానికే అప్పులు చేస్తున్నాం..! ఇళ్లు కట్టాలనుకున్నాం.. చంద్రబాబు అడ్డుకున్నారు..! అన్నీ చేయాలనుకున్నాం.. కోర్టులు అడ్డు పడ్డాయి..! తెలంగాణలో ఆంధ్రోళ్లున్నారు.. అందుకే లైట్‌ తీసుకుంటున్నాం..! అంటూ ప్రతీ దానికి ప్రభుత్వం వైపు కారణాలు వినిపిస్తున్నాయి. కానీ ఒక్క దానికంటే.. ఒక్క దానికి పరిష్కారం చూపించలేకపోతున్నారు. ఫలానా పని మా పనినం వల్ల పూర్తి చేశామని చెప్పడానికి కూడా ప్రభుత్వం వద్ద సరుకు లేకుండా పోయింది.

అన్నీ తెలంగాణకు కట్టబెట్టారు.. ప్రతిగా ఏం సాధించారు..?

తెలంగాణతో సత్సంబంధాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఏం చేయాలి..? విభజన సమస్యలన్నింటినీ పరిష్కరించేసుకుని.. ఏపీకి అటు వైపు నుంచి రావాల్సిన దాదాపు లక్ష కోట్లను తెచ్చుకోవాలి. కనీ రెండేళ్లలో ఒక్క రూపాయి తెచ్చుకోలేకపోయారు. చివరికి కరెంట్ బకాయిలు ఐదు వేల కోట్లు రావాల్సి ఉంటే.. గత ప్రభుత్వం ఎన్సీఎల్టీకి వెళ్తే ఈ ప్రభుత్వం ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది కానీ రూపాయి వసూలు చేసుకోలేకపోయింది. రెండేళ్లలో ఏమీ తెలంగాణ వైపు సహకారం పొందకపోగా.. ఏపీ ప్రయోజనాలను మొత్తం తెలంగాణకు తాకట్టు పెట్టేశారు. చివరికి సచివాలయభవనాలను కూడా అప్పగించేశారు. అంత అవసరం ఏమొచ్చింది..?

ప్రజా ప్రయోజనాలను కాపాడకపోతే ప్రజలే నిర్ణయం తీసుకుంటారు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటా బయటా సంపదను వేగంగా కోల్పోతోంది. ప్రభుత్వ ఆస్తులను ధర్మకర్తగా ఉండి కాపాడాల్సిన ప్రభుత్వ పెద్దలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. తమ సొమ్ము కాదన్నట్లుగా పంచి పెట్టేస్తున్నారు. పొరుగు రాష్ట్రాలకు… సొంత వారికి పంచేస్తున్నారు. ప్రజల్ని అప్పుల పాలు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం .. చేస్తున్న పనుల పట్ల.. ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంది. ప్రజలకు కారణాలు.. కాదు పరిష్కారాలు చూపించాలన్న సంగతిని గుర్తు చేసుకోవాల్సి ఉంది. లేకపోతే.. ప్రజలే చేసిన తప్పులను ఓటు రూపంలో గుర్తు చేస్తారు. అలా చేసిన తర్వాత ఏమీ ప్రయోజనం ఉండదు. .. ఎందుంటే అప్పటికే చేతులు కాలిపోతాయి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close