వాలంటీర్ల పేరుతో సాక్షికి నెలకు ఐదున్నర కోట్లు !

ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన సాక్షి పత్రికలకు వందల కోట్ల ప్రకటనలు ఇస్తున్నారని ఇది నిబంధనలకు విరుద్ధమని.. నైతికంగా కూడా కరెక్ట్ కాదనే వాదనలు వినిపిస్తున్నా అలాంటివేమీ తాము పట్టించుకోబోమని ప్రభుత్వ పెద్దలు ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉన్నారు. తాజాగా వాలంటీర్లను అడ్డం పెట్టుకుని సాక్షి పత్రికకు నెలకు రూ. ఐదున్నర కోట్లు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జీవో జారీ చేశారు. అయితే ఇలాంటి వ్యవహారాల్లో దొరికిపోకుండా ఆదేశాలు జారీ చేయడం.. అడ్డగోలుగా వ్యవహారాలు నడపడం అలవాటు కాబట్టి… ఆదేశాలు అలాగే జారీ చేశారు.

దినపత్రికను కొనుక్కోవడానికి వాలంటీర్లకు నెలకు రెండువందలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏ దిశపత్రిక అంటే నేరుగా సాక్షి అని చెప్పలేదు. ప్రభుత్వ పథకాల సమాచారం తెలుసుకోవడానికి.. విపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని అడ్డుకోవడానికి విస్త్రతంగా సర్క్యూలేషన్ ఉన్న పత్రికను కొనుక్కోవడానికట. అంటే సాక్షి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ వాలంటీర్ అయినా సాక్షి మినహా దేన్నైనా కొనుగోలు చేస్తే వాలాంటీర్ ఉద్యోగం ఊడుతుంది. ఏపీ వ్యాప్తంగా రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఉన్నారని వారందరికీ డబ్బులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ లెక్కన నెలకు ఐదున్నర కోట్ల వరకూ అవుతుంది.

ఇటీవలి కాలంలో సాక్షి పత్రిక సర్క్యూలేషన్ దారుణంగా పడిపోయింది. కొనేవారు లేరు. దీంతో రెండున్నర లక్షల సర్క్యూలేషన్ పెంచుకోడానికి కూడా ప్రజాధనమే ఉపయోగిస్తారన్నమాట. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒకటి కాదు రెండు సాక్షి పేపర్లు కొంటున్నారు. ఇప్పుడు వాలంటీర్లకు అంటగడుతున్నారు. అటు ప్రకటనలు.. ఇటు పత్రిక కొనుగోలు మొత్తం ప్రజాధనంతో నడిచిపోయేలా చూసుకుంటున్నారు. ఇప్పటికే సాక్షిలో పని చేసిన సగం మంది ఉద్యోగుల ప్రభుత్వంలో భాగం అయి ప్రజాధనం జీతాలుగా తీసుకుంటున్నారు. మొత్తంగా సాక్షి కోసం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా వాడేస్తున్నారు .

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇండియన్ వారెన్ బఫెట్ కన్నుమూత !

ఇండియన్ వారెన్ బఫెట్‌గా పేరు పొందిన ప్రముఖ ఇన్వెస్టర్.. భారత బిలియనీర్లలో ఒకరైన రాకేష్ ఝున్ ఝున్ వాలా కన్నుమూశారు. ఆయన వయసు అరవై రెండేళ్లు మాత్రమే. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు....

మునుగోడులో కమ్యూనిస్టుల మద్దతున్న వారికే అడ్వాంటేజ్ !

మునుగోడు ఉపఎన్నికల్లో ఎవరు గెలవాలన్నా కమ్యూనిస్టుల మద్దతు కీలకం కానుంది. అక్కడ లెఫ్ట్ పార్టీలకు ఇక్కడ దాదాపు 20 వేల ఓట్లు ఉంటాయని అంచనా. అందుకే ఆ పార్టీల మద్దతు కోసం...

అన్న క్యాంటీన్లు.. ఆరోగ్యరథాలు.. మామ అల్లుళ్ల ప్లాన్లు !

తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థులు ఇప్పటికే గ్రౌండ్ లెవల్లో తమ పనులు ప్రారంభించేసుకున్నారు. మంగళగిరి నుంచి ఈ సారి ఎమ్మెల్యేగా గెలవాలని పట్టుదలగా ఉన్న లోకేష్‌తో పాటు హిందూపురం...

ఇక ఈవీఎంలపై కేసీఆర్ పోరు !

అదేంటో కానీ గత ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏం చేశారో అచ్చంగా కేసీఆర్ కూడా అదే చేస్తున్నారు. బీజేపీతో వైరం.. మోదీపై విమర్శలు.. ఇలా అన్నీ అలాగే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close