నవంబర్లో విశాఖ వేదికగా నిర్వహించనున్న ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం చంద్రబాబు, లోకేష్ పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అవకాశాలను ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేస్తున్నారు. గూగుల్ తో చేసుకున్న ఒప్పందాన్ని ఓ బ్రాండ్ గా మార్చుకుని వారిద్దరూ పారిశ్రామికవేత్తల వెంట పడుతున్నారు. దేశదేశాలు తిరిగి.. తమ సమ్మిట్ కు వచ్చి..అవకాశాలను ఎక్స్ ప్లోర్ చేయాలని కోరుతున్నారు. వారి అప్రోజ్.. ఇండస్ట్రియలిస్టును విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇండియాలో ఎక్కడైనా తమకు పెట్టుబడుల ప్రణాళికలు ఉంటే.. ఏపీ వైపు చూసేందుకు వారు సిద్ధంగా ఉన్నారు.
చంద్రబాబు ,లోకేష్ అవిశ్రాంత ప్రయత్నాలు
ఏపీ ఏర్పడిన తొలి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. ఆ సమయంలో ఆయన పడిన కష్టం .. అనేక పారిశ్రామిక సంస్థల యూనిట్ల రూపంలో కళ్ల ముందే ఉంది. కానీ తర్వాత ఆయన ఓడిపోవడంతో ఏర్పడిన పరిస్థితుల వల్ల ఇప్పుడు మళ్లీ ఇన్వెస్టర్స్ ను ఆకర్షించడం పెద్ద సమస్యగా మారింది. అయినా ప్రజలు ఇచ్చిన తీర్పుతో అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. ఏపీ బ్రాండ్ ను మళ్లీ నిలబెట్టేందుకు తన అనుభవాన్నంతా ఉపయోగిస్తున్నారు. కేంద్రం మద్దతుతో చాలా సంస్థలు ముందుకు వస్తున్నాయి.
విశాఖ సమ్మిట్ లో ఒప్పందాలు కాదు..నేరుగా ఎగ్జిక్యూషన్ !
ఎంవోయూలు చేసుకోవడం మీద చంద్రబాబు, నారా లోకేష్ ఆసక్తి చూపించడం లేదు. నేరుగా ఒప్పందాలే చేసుకుంటున్నారు. విదేశీ పర్యటనల్లో వారు పెట్టబోయే పెట్టుబడులకు సంబంధించిన రోడ్ మ్యాప్ .. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాకాలు ఇలా అన్నింటిపై అవగాహన కల్పించి నేరుగా పెట్టుబడులతోనే వచ్చేలా చూస్తున్నారు. ఒప్పందం జరిగిన ఆరు నెలల్లో ఆ పెట్టుబడులు గ్రౌండ్ అయ్యేలా చూడనున్నారు. అందుకే ఈ సారి విశాఖ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఎవరూ ఊహించని రీతిలో .. ప్రపంచ దిగ్గజ పారిశ్రామిక వేత్తల సమక్షంలో ఘనంగా జరగబోతోంది.
ఈ సదస్సు తర్వాత ఏపీ పెట్టుబడుల ఎకో సిస్టమ్ మరింత మెరుగు
ఏపీ ఇప్పటికీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రమే. పారిశ్రామికంగా ఎంతో కొంత ముందడుగు వేస్తేనే.. రాష్ట్ర యువతకు ఉపాధి.. రాష్ట్రానికి ఆదాయం లభిస్తుంది. అలా నిరంతరం పెట్టుబడులు రావాలంటే.. ఓ ఎకోసిస్టమ్ ఏర్పాటవ్వాలి. దాని కోసమే చంద్రబాబు, లోకేష్.. అవిశ్రాంతంగా ప్రయత్నిస్తున్నారు. నవంబర్ వరకూ.. వారు తీరిక లేకుండా ఉంటారు. వారి ప్రయత్నాలే.. ఏపీ భవిష్యత్ కు కీలకంగా మారనున్నాయి.