ఐదేళ్ల వ్యవస్థల విధ్వంసమే ఏపీకి శాపం !

ఒకే ఒక్క పొరపాటు వల్ల జరిగే నష్టాలను ఎంతో కాలం భరించాల్సి ఉంటుంది. అలాంటి పొరపాట్లు ఎంత కాస్ట్‌లీగా ఉంటాయో… ఇప్పుడు ఏపీని చూస్తే ఏర్థమవుతుంది. వైసీపీకి ఒక్క చాన్స్ ఇచ్చినందున ఐదేళ్ల పాటు ఏపీ పునాదుల్ని బలహీనం చేసేసింది ఆ పార్టీ. ఫలితంగా ప్రతి వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. ఓ పద్దతి లేకుండా ప్రతీ రంగంలోనూ ఇష్టారాజ్యంగా మారిపోయింది. ఆ దుష్పరిణామాలు తీవ్రంగా బయటపడుతున్నాయి. విశాఖలో వరుస ఫార్మా ప్రమాదాలు ఆ నిర్లక్ష్య వైరస్ పాలన పాపమే.

పారిశ్రామిక భద్రతా వ్యవస్థ నిర్వీర్యం

జగన్ రెడ్డి హయాంలో పారిశ్రామిక భద్రతా వ్యవస్థ అనేదే లేకుండా పోయింది. ఎవరు కమిషన్లు ఇస్తే వారికి అనుమతులు ఇచ్చేశారు. ఇంకా చెప్పాలంటే… పై స్థాయిలో వారు చేస్తున్నారు కాబట్టి మేము చేస్తే తప్పేంటని కింది స్థాయి అధికారులు ప్రతీ దానికి విలువ కట్టి.. కంపెనీల్లో సేఫ్టీ నార్మ్స్ ప్రకారం చర్యలు తీసుకున్నారా లేదా అన్నది చూడటమే మానేశారు. ఫలితంగా యాజమాన్యాలు ఖర్చు తగ్గించుకునేందుకు రాజీపడటం ప్రారంభించారు. చివరికి అది అత్యంత ఘోరమైన ప్రమాదాలకు కారణం అవుతోంది.

ఎల్జీ పాలిమర్స్ ఘటనతో జాగ్రత్తపడాలి…కానీ వసూళ్లుకు వాడుకున్నారు !

జగన్ సీఎం అయ్యాక ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగింది. ఈ ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం జాగ్రత్త పడాలి. కానీ జగన్ రెడ్డి సమీక్షల పేరుతో హడావుడి చేశారు. ప్రతి పరిశ్రమలోనూ సేఫ్టీ అడిట్ అని ప్రకటనలు చేశారు. ఎక్కడైనా చేశారా అంటే… ఆ పేరుతో ప్రతి పరిశ్రమ నుంచి అనధికారి వసూళ్లు అయితే చేసుకున్నారు. అంటే ఓ విషాదాన్ని బూచి చూపి డబ్బులు దండుకున్నారు కానీ.. ఆ పరిశ్రమలో రక్షణ వ్యవస్థలు బలంగా ఉన్నాయా లేదా.. కార్మికుల ప్రాణాలతో ఆడుకుంటున్నారా అన్న అంశాలను పరిశీలించలేదు.

వరుసగా బయటపడుతున్న దుష్ఫరిణామాలు

కంచే చేను మేసినట్లుగా వ్యవహరించిన వైసీపీ ప్రభుత్వ తీరు వల్ల ఇప్పుడు ప్రజలు నష్టపోతున్నారు. కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయింది. ఫలితంగా ఒక్క విశాఖ ఫార్మా లోనే ఎన్నెన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు వ్యవస్థను మళ్లీ కింది స్థాయి నుంచి బలోపేతం చేసుకుంటూ రావాలి. అప్పుడు మాత్రమే మళ్లీ వ్యవస్థలు బాగుపడతాయి.. ప్రజలకు రక్షణ దొరుకుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తిరుపతి లడ్డూ ఇష్యూ : అడ్డంగా దొరికినా అదే ఎదురుదాడి !

వైసీపీ సిగ్గులేని రాజకీయాలు చేస్తుంది. అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఎదురుదాడి చేసేందుకు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని.. పశువుల కొవ్వుతో కల్తీ...

తిరుప‌తి ల‌డ్డు చుట్టూ వివాదం… ఇంత‌కు ఈ ల‌డ్డూ ఎందుకింత స్పెష‌ల్?

తిరుప‌తి ల‌డ్డూ. తిరుమ‌ల‌లో శ్రీ‌వారి వెంక‌న్న ద‌ర్శ‌నాన్ని ఎంత మ‌హాభాగ్యంగా భావిస్తారో... తిరుప‌తి ల‌డ్డూను అంతే మ‌హాభాగ్యంగా భావిస్తారు. ఉత్త‌రాది, ద‌క్షిణాది అన్న తేడా ఉండ‌దు... ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అన్న...

అడియోస్ అమిగో రివ్యూ: అపరిచితుల జీవయాత్ర

సినిమా అనగానే ఇంట్రడక్షన్, పాటలు, ఫైట్లు, స్క్రీన్ ప్లే లో త్రీ యాక్ట్.. ఇలా కొన్ని లక్షణాలు ఫిక్స్ అయిపోతాయి. కానీ అప్పుడప్పుడు ఆ రూల్స్ ని పక్కన పెట్టి కొన్ని చిత్రాలు...

తిరుప‌తి ల‌డ్డూ నెయ్యి వివాదం- ఆధారాలు బ‌య‌ట‌పెట్టిన టీడీపీ

తిరుమ‌ల వెంక‌న్న ల‌డ్డూ ప్ర‌సాదం అంటే ఎంతో సెంటిమెంట్. క‌ళ్ల‌కు అద్దుకొని తీసుకుంటారు. వెంక‌న్న‌ను ద‌ర్శించుకున్నంతగా భావిస్తారు. కానీ ఆ ల‌డ్డూ త‌యారీలో వాడిన నెయ్యిని గొడ్డు మాసం కొవ్వుతో త‌యారు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close