ఏపీ పేరును ” వైఎస్ఆర్‌ ఏపీ ” అని మార్చేశారా !?

ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్. ఏపీ ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వ విధానం అమలు చేయాలంటే… ఏపీ అని ప్రారంభిస్తుంది. అంటే ఏపీ భవన నిర్మాణ విధానం, ఏపీ పారిశ్రామిక విధానం, ఏపీ అప్పుల పాలసీ, ఏపీ నిధుల పాలసీ అని పెట్టుకుంటారు. కానీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పారిశ్రామిక అనుమతుల విధానానికి… వైఎస్ఆర్‌ ఏపీ వన్ అని పేరు పెట్టారు. దీంతో ఏపీని వైఎస్ఆర్‌ ఏపీ అని మార్చేశారా ఏమిటి అని ఆశ్చర్యపోవడం ప్రజల వంతు అవుతోంది.

ఏదైనా కట్టండి .. దానికి పేర్లు పెట్టుకోండి మహా ప్రభో అని ఆంధ్రజనం మెత్తుకుంటున్నా ఏపీ ప్రభుత్వం మాత్రం సర్టిఫికెట్ల మీద పేర్లు ఫోటోలు వేసుకోవడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే ఆస్పత్రుల్లో చీటీల మీద కూడా జగన్ బొమ్మ పెట్టేసుకుంటున్నారన్న సెటైర్లు వినిపిస్తూంటే… తాజాగా పరిశ్రమలకు అనుమతు ఇచ్చేందుకు తీసుకొచ్చిన విధానానికి వైఎస్ఆర్ పేరు పెట్టేశారు. వైఎస్ఆర్ ఏపీ వన్ పేరుతో యాప్, పోర్టల్ తెచ్చి అనుమతులు కావాల్సిన వారందరూ అందులో దరఖాస్తు చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఇది ప్రభుత్వ పోర్టల్. దీనికి వైఎస్ఆర్ పేరేమిటా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

పేర్లు, రంగుల పిచ్చి ఈ ప్రభుత్వ పెద్దలకు మొదటి నుంచి ఉంది. అది అంతకంతకూ పెరిగిపోతోంది. ఇక పెట్టుకోవడానికి ఎక్కడా సందు లేదని పారిశ్రామిక విధానానికీ పేరు పెట్టేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేందుకు ప్రత్యేక విధానం తెచ్చింది. భవనాలకు అనుమతులు ఇచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇదంతా పాలనలో ఓ భాగం. అయితే వాటికి కేసీఆర్, కేటీఆర్ తమ పేర్లు పెట్టుకోలేదు. తెలంగాణ అనే పెట్టుకున్నారు. కానీ ఏపీలో మాత్రం…. వైఎస్ఆర్ ఏపీ అని పేరు పెట్టారు. అంటే ఏపీ పేరును వైఎస్ఆర్ ఏపీగా ప్రచారంలోకి తెచ్చేందుకు ఈ పని చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: టక్కర్

Takkar Movie Review తెలుగు360 రేటింగ్ : 2/5 సిద్ధార్థ్ ప్రతిభ గల నటుడు. ఆయనకి విజయాలు కూడా వచ్చాయి.‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ సినిమాలతో తెలుగులో చాలా క్రేజీ ని తెచ్చుకున్నాడు. ఐతే విజయాలని కొనసాగించడంలో...

మీడియా వాచ్ : బ్యాన్ చేసి ఏబీఎన్‌ క్రేజ్ పెంచేసిన జగన్ !

ఏబీఎన్ చానల్ కు జగన్ ఎంత మేలు చేశారంటే.. ఇప్పుడా చానల్ యూ ట్యూబ్ లో జాతీయ.స్థాయిలో నాలుగో స్థానంలో ఉంది. ఏపీలో ఆ చానల్ రాకుండా చేశారు. డిష్‌లలో వస్తుంది. కానీ...

లిక్కర్ స్కాంలో కవితపై ఆధారాలున్నాయన్న కోర్టు !

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు అనూహ్యమైన షాక్ తగిలింది. నేరుగా కోర్టే ప్రాథమిక అదారాలు ఉన్నాయని వ్యాక్యానించింది. ఇప్పటి వరకూ ఈడీ, సీబీఐ ఆరోపణలు చేసింది. కానీ న్యాయమూర్తి ఆధారాలున్నాయని...

వారాహియాత్రకు భారీ ఏర్పాట్లు చేస్తున్న జనసేన !

ముందస్తు ఎన్నికలు వచ్చినా రాకపోయినా జనంలోనే ఉండేందుకు పవన్ కల్యాణ్ రెడీ అయ్యారు. పద్నాలుగో తేదీన వారాహి యాత్రను ప్రారంభిస్తున్నారు. రెండు రోజుల ముందే అమరావతి చేరుకుని హోమాలు చేయనున్నారు. ఆ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close