చైతన్య : మొండితనంతో మతంతో గెలుక్కుంటే మొదటికే మోసం..!

ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు బయటకు వచ్చేకొద్దీ వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇవన్నీ మత పరమైనవే. ఓ వైపు వివాదాస్పద ప్రకటనలు చేస్తూ.. ప్రభుత్వంలోని వాళ్లే రెచ్చగొడుతున్నారు. మరో వైపు.. మత మార్పిళ్ల కోసం జరుగుతున్న ప్రయత్నాలు సంచలనం అవుతున్నాయి. ఓ వైపు హిందూ దేవుళ్లను మంత్రులు కించ పర్చుతారు…! మతం మార్చండి.. మీ వెనుక మేమున్నామని ఎమ్మెల్యేలు పాస్టర్లకు భరోసా ఇస్తూంటారు..!. జెరూసలెం యాత్రకు ప్రోత్సాహకం పెంచుతారు…! మరో వైపు.. తిరుమల వంటి ప్రసిద్ధ ఆలయాల్లో.. ధరలు పెంచుతూ పోతూంటారు…! పేదలకు హిందూ దేవుళ్లను ఉచితంగా దర్శించుకునే పథకాలను రద్దు చేస్తారు..! బైబిల్‌ను భగవద్గీతలా చదువుతూ మత మార్పిళ్లకు ప్రయత్నాలు చేస్తూంటారు..! ఇవన్నీ ఏపీలో జరుగుతున్నవే..!

జోరుగా హిందూత్వానికి క్రిస్టినియాటీ రంగు వేసే ప్రయత్నాలు..!

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోంది ఇదే. ఓ ప్రధానమైన అజెండాతో ఏపీ సర్కార్ ప్రణాళికా బద్దంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం.. వేస్తున్న ప్రతీ అడుగు.. మతపరమైన కోణంలోనే.. ప్రజలు చూసే పరిస్థితి వచ్చింది. కొడాలి నాని.. తిరుమలపై చేసిన వ్యాఖ్యలతో దురమారం రేగుతోంది. హిందూత్వానికి క్రిస్టియానిటీని అంటగట్టే చర్యలు చురుగ్గా సాగుతున్నాయి. వైఎస్ జగన్ బావ… బ్రదర్ అనిల్ కు చెందిన రక్షణ టీవీలో.. భగవద్గీతను చదువుతున్నట్లుగా బైబిల్‌ను చదువుతున్నారు. ఆ చానల్ మొత్తం.. మత మార్పిడి లక్ష్యంతో హిందువును టార్గెట్ చేసిందన్న అనుమానాలున్నాయి. అభిషేకాలు, పూజలు లాంటివి కూడా.. హిందూ పద్దతిలో క్రీస్తుకు చేస్తూ.. మత మార్పిడులకు ప్రోత్సాహం ఇస్తున్నారు.

హిందూ దేవుళ్లను బడుగు, బలహీనవర్గాలకు దూరం చేసే ప్రయత్నం..!

గత ప్రభుత్వం .. పేదలకు.. శ్రీనివాసుడ్ని ఉచితంగా దర్శించుకునేలా.. దివ్యదర్శనం అనే పథకాన్ని గత ప్రభుత్వం ప్రారంభించారు. కొత్తగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే… ఆ పథకాన్ని నిలిపివేశారు. ఆర్థిక సమస్యలు కారణం అని చెబుతున్నారు. అదే సమయంలో జెరూసలెం యాత్రకు.. ప్రోత్సాహాకాలు పెంచడమే కాదు… పాస్టర్లు అని అనిపించుకున్న ప్రతీ ఒక్కరికి నెలకు ఐదు వేలు ఇచ్చేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. నిప్పులేనిదే పొగ రాదన్నట్లు వివాదాలు ఉరకనే రావు. నిర్ణయాల ఉద్దేశం.. అమల్లోకి వచ్చే సరికి బయటపడుతూంటుంది. ఇప్పుడు ఏపీలో అదే పరిస్థితి ఉందంటున్నారు.

మతంతో రాజకీయం చేస్తే.. ఆ మతమే మింగేస్తుంది..!

రాజకీయాల కోసం.. మతాన్ని వాడుకోవడం.. పులి మీద స్వారీ చేయడమే. ప్రజలకు ద్రోహం చేయడమే. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి.. ప్రజలకు ద్రోహం గురించి వరకూ ఆలోచించడం లేదు.. తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికే సమయం కేటాయిస్తున్నారు. ప్రజల సాధక బాధకాలు.. ఆర్థిక పరిస్థితి దిగజారిపోయినా.. ఆయన దేవుడి గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. దేవుడ్ని నమ్ముకుంటే.. అందరూ .. తన వెంట నడుస్తారని.. ఆయన అనుకుంటున్నారు. కానీ.. మతంతో పెట్టుకుంటే..మొదటికే మోసం వస్తుందని ఆయన ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అమరావతిని కొనసాగిస్తే పదవుల్ని ఇచ్చేస్తాం..! జగన్‌గు చంద్రబాబు ఆఫర్..!

అమరావతిని ఏకైక రాజధాని కొనసాగిస్తూ... ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే... తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పదవులను వదిలేస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు.. ముఖ్యమంత్రి జగన్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు...

జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్..!

జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసిన తర్వాతి రోజే...అంటే జూన్ 13న హైదరాబాద్‌లో వారిని అరెస్టు చేసిన పోలీసులు అనంతపురంకు తరలించారు....
video

క‌ల‌ర్ ఫొటో టీజ‌ర్‌: బ్లాక్ అండ్ వైట్ కాంబో

https://www.youtube.com/watch?v=T-R3h9va2j4&feature=emb_title ప్రేమ గుడ్డిది. చెవిటిది. మూగ‌ది కూడా. దానికి ప్రేమించ‌డం త‌ప్ప బేధాలు తెలీవు. న‌ల్ల‌ని అబ్బాయి.. తెల్ల‌ని అమ్మాయి ప్రేమించుకోవ‌డం కూడా వింతేం కాదు. కానీ.. మ‌ధ్య‌లోకి ఓ పులి వ‌చ్చింది....

బ్రహ్మానందం ట్రాజెడీ

బ్ర‌హ్మానందం అంటేనే.. ఆనందం. ఆనందం అంటేనే బ్ర‌హ్మానందం. హాస్య పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ బ్ర‌హ్మీ. త‌న కామెడీ ట్రాక్ తోనే సినిమా హిట్ట‌యిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు. అయితే ఇప్పుడు బ్ర‌హ్మానందం జోరు త‌గ్గింది....

HOT NEWS

[X] Close
[X] Close