ఏపీలో అంతే – పార్టీ, ప్రభుత్వం ఒకటే -ప్రజలే పిచ్చోళ్లు !

వైసీపీ పార్టీ, ప్రభుత్వం వేరు వేరు కాదని సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చేశారు. అందుకే ప్రభుత్వ ఖజానాను పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీని నడిపేందుకు ఖర్చు పెట్టేస్తున్నారు. పార్టీ ప్రచారాలను ప్రభుత్వం ఖాతాలో వేసేందుకు విచ్చలవిడిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజాధనంతో పాటు అధికారుల్ని వాడేస్తున్నారు. వారితోనే తమ పార్టీ ప్రచారం చేసుకుంటున్నారు.

వై ఏపీ నీడ్స్ జగన్ పేరుతో మరో అరాచకం

జగన్ రెడ్డి ఏపీకి ఎందుకు సీఎంగా ఉండాలో చెప్పేందుకు అధికారులు… అందర్నీ ఇళ్ల మీదకు తోలేసింది ప్రభుత్వం. వారి వెనుక కర్రలు పట్టుకుని వైసీపీ కార్యకర్తలు ఉన్నారు. పార్టీ ప్రచారం చేయబోమని ఎవరైనా అధికారులు అంటే.. వారికి బడితే పూజ చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పార్టీ జెండాలు ఎగరేసి.. ఆ జెండాలకు ఉద్యోగులు సలాములు కొట్టారు. ఆ ఖర్చు అంతా ప్రభుత్వానిదే. ఇది ముందు ముందు మరింత దారుణ స్థితికి చేరనుంది.

ఇప్పటికే గడప గడపకూ పేరుతో ప్రజాధనంతో పార్టీ ప్రచారం

ఇప్పటికే గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో పెద్ద ఎత్తున ప్రజాధనం ఖర్చు పెట్టి అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుని పార్టీ ప్రచారం చేసుకున్నారు. పాంప్లెట్లు, టోపీలు, సంచుల కోసం కనీసం వందల కోట్లు ఖర్చు పెట్టారు. ఇదంతా ప్రజాధనమే. వైసీపీ సొంత ఖర్చు కాదు. కానీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారంతా వైసీపీ నేతలే. వాలంటీర్లు, గృహసారధులు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్న చోట ఇంచార్జులు నిర్వహించారు.

బటన్ నొక్కే బహిరంగసభలు వైసీపీ సభలు

ఇక జగన్ రెడ్డి పని చేయని బటన్లు నొక్కేందుకు పెడుతున్న సభలు ప్రభుత్వ కార్యక్రమాలు కాదు. రాజకీయ బహిరంగసభలు. పూర్తిగా వైసీపీ ప్రచారసభ లుగా అలంకరిస్తారు. ప్రసంగాలు అలాగే ఉంటాయి. మొక్కుబడిగా ఓ బటన్ నొక్కుతారు. ఆ బటన్ నొక్కుడుకు డబ్బులు జమ కావు. కానీ ప్రచారం చేసేసుకుంటారు. ఈ సభల కోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారో చెప్పాల్సిన పనిలేదు.

పార్టీ పని చేసే వారికి జీతాలుగా ప్రజాధనం

ఇటీవల ఐ ప్యాక్ కోసం ఓ వ్యక్తిని నియమించుకోవడానికి మార్కెటింగ్ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. ఎలక్షనీరింగ్ అర్హత. ఇలాంటి నియామకాలు కొన్ని వేలల్లో జరిగాయి. వారంతా వైసీపీ పని చేస్తూంటారు. ప్రజాధనం జీతంగా తీసుకుంటారు. ఇలాంటి వారి వల్ల ఎన్ని వందల కోట్లు ఖజానా నుంచి తరలిపోతుందో చెప్పడం కష్టం.

ఇలా చెప్పుకుంటూ పోతే … పార్టీ, ప్రభుత్వం ఒకటేనని సజ్జల ఎందుకు అంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రజాధనాన్ని పార్టీ కోసం ఖర్చు పెట్టుకునేందుకే ఇలా చెప్పుకుంటున్నారు. ఎంత బాధ్యతో మరి. ఓట్లేసి గెలిపించినందుకు… ఇక ఓటర్ల ఆస్తిపాస్తులు కూడా రాసిచ్చినట్లుగా భావించేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారం ముగిసింది – 30న అసలు యుద్ధం !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అసలు ప్రచారం ముగిసింది. ఇప్పటి వరకూ ప్రచారంలో ముందు మేమున్నామంటే.. మేమున్నాని చెప్పుకునేందుకు జన సమీకరణ కోసం భారీగా ఖర్చు చేసిన పార్టీలు.. ఇప్పుడు అసలు యుద్ధం ప్రారంభించాయి....

మరో ఇద్దరు ఏపీ ఐఏఎస్‌లకు జైలు శిక్ష – సిగ్గు రాదా ?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్వాకాల గురించి గ్రంధాలు రాసినా తరగనంత సాహిత్యం పోగుపడిపోయింది. కోర్టుల దగ్గర ఉన్న ధిక్కార పిటిషన్లను లెక్కేసుకోవడానికి ఐదేళ్లు చాలవు. అతి కష్టం మీద తీర్పు వచ్చినా వాటిని అమలు...

ఏపీ సర్కార్ వారి డేటా ఎనలిటికల్ యూనిట్ – పెద్ద ప్లానే !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా డేటా ఎనలిటికల్ యూనిట్ ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏం డేటా ఎనలటిక్స్ చేస్తుందంటే... ఆదాయమంట. ఆదాయం ఎక్కడ తగ్గిపోయిందో గుర్తించి పెంచడానికి ఈ యూనిట్...

చంద్రబాబు బెయిల్ రద్దు కాలేదు సరి కదా సర్కార్‌కు సుప్రీం షరతు !

చంద్రబాబు జనాల్లోకి వస్తే తమ పరిస్థితి ఏమి అయిపోతుందోనని కంగారు పడిపోతున్న జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ సుప్రీంకోర్టులోనూ దాని కోసమే ప్రయత్నించారు. చంద్రబాబు రాజకీయ ర్యాలీలు, సమావేశాల్లో పాల్గొనకుండా షరతులు విధించాలని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close