ఏప్రిల్ పథకాల డబ్బులేవి..!?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం సంక్షేమ పథకాల నిధులు విడుదల చేస్తూ ఉంటుంది. దాని కోసం ముందుగానే క్యాలెండర్ ప్రకటిస్తారు. ఈ ఆర్థిక సంవత్సరం కోసం కూడా గత ఫిబ్రవరిలో సంక్షేమ క్యాలెండర్ ప్రకటించారు. ఆ ప్రకారం ఏప్రిల్‌ నెలల్లో ఐదు పథకాలకు నిధులు విడుదల చేయాల్సి ఉంది. పదిహేనో తేదీ వచ్చినా సీఎం జగన్ ఇంత వరకూ పథకాలకు నిధులు విడుదల చేసేలా మీటలు నొక్కే ప్రోగ్రాం పెట్టుకోలేదు. ఆర్థిక సమస్యలు కారణమా.. లేకపోతే ఇంకేమైనా కారణం ఉందా అన్న చర్చలు ప్రస్తుతం ప్రభుత్వ వర్గాలతో పాటు.. ఆయన పథకాల లబ్దిదారుల్లోనూ జరుగుతున్నాయి.

ఏప్రిల్ నెలలో జగనన్న వసతి దీవెన , జగనన్న విద్యా దీవెన మొదటి విడత నిధులు విడుదల చేయాల్సి ఉంది. ఇవి ఫీజు రీఎంబర్స్‌మెంట్ తో పాటు పై చదువులు చదివేవారికి చేస్తామన్న ఆర్థిక సాయానికి సంబంధించినది. ఫీజు రీఎంబర్స్ మెంట్ ప్రతీ సారి కాలేజీలకు ఇస్తారు. దాంతో విద్యార్థులకు ఎలాంటి టెన్షన్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు విద్యార్థులే కట్టుకుంటే ప్రభుత్వం ఇస్తుంది. దీని వల్ల ప్రభుత్వం ఇస్తుందో లేదో కానీ కాలేజీలు మాత్రం విద్యార్థుల వద్ద ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. ఈ నిధుల కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. అలాగే పొదుపు సంఘాల మహిళలకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ చెల్లింపులు కూడా చేయాల్సి ఉంది. రైతులకు రబీకి సంబంధించి వైఎస్సార్‌ సున్నా వడ్డీ నిధులు చెల్లించాలి. వీటిపై ప్రభుత్వం ఇంత వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ముఖ్యమంత్రి మీట నొక్కే కార్యక్రమం ఎప్పుడు ఉంటుందో చెప్పడం లేదు.

సాధారణంగా సంక్షేమ పథకాలను ప్రారంభించాలని అనుకున్నప్పుడు… నాలుగైదు రోజుల ముందు నుంచే ప్రచార హడావుడి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఫుల్ పేజీ ప్రకటనలు ఇస్తారు. చివరికి ముఖ్యమంత్రి జగన్ ల్యాప్ ట్యాప్‌లో కంప్యూటర్ మీట నొక్కుతారు. ఆ మీట నొక్కగానే లబ్దిదారుల అకౌంట్లలలో డబ్బులు పడిపోతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతాయి… కానీ విడతల వారీగా ఎప్పటికి పడతాయో చెప్పలేని పరిస్థితి కొంత కాలంగా ఏర్పడింది. ఇలాంటి సమయంలో అసలు ఆ ప థకాలకు మీటలు నొక్కే కార్యక్రమమే ఇంకా పెట్టకపోవడంపై కొంత మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

తిరుపతి ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమయంలో పెండింగ్ బకాయిలన్నీ విడుదల చేస్తే ఎంతో కొంత ప్లస్ అవుతుందని రాజకీయ పార్టీలు అనుకుంటాయి. కానీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం అలా భావిస్తున్నట్లుగా లేదు. ఓటింగ్ అయిపోయిన తర్వాత ఇవ్వవొచ్చని ఆలోచన చేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాలో నిధులు ఉన్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఆర్బీఐ నుంచి తెచ్చుకున్న రెండు వేల కోట్ల రుణాన్ని వాడలేదని… ఏ బిల్లులూ చెల్లించలేదని అంటున్నారు. మరి నిధులు ఉన్నా… పథకాలకు ఎందుకు నగదు బదిలీ చేయడం లేదో ప్రభత్వ వ్యూహం ఏమిటో తేలాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close