కొత్త జిల్లాల మార్పులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లాల సంఖ్య 26 నుంచి 32 కి పెరిగే అవకాశం ఉన్నట్లుగా లీకులు వస్తున్నాయి. కృష్ణ జిల్లానుంచి పెనమలూరు.. గన్నవరం నియోజక వర్గాలను ఎన్టీఆర్ జిల్లా లోకి మార్చాలన్న డిమాండ్లపై పరిశీలన జరుపుతున్నారు. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలు మళ్ళీ ప్రకాశం లోకి మార్చాలన్న డిమాండ్లు ఉన్నాయి. వాటిపై చర్చిస్తున్నారు.
కొత్తగా మార్కాపురం, అమరావతి, గూడూరు, ఆదోని, మదనపల్లి, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్లపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. జిల్లా కేంద్రాల దూరం తగ్గించడం..పాలనా సౌలభ్యం సంబంధించి ప్రభుత్వం దృష్టి పెడుతోంది. త్వరలో మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం కానుంది. తాజా పరిస్థితులు. ..కొత్త జిల్లాలు..సరిహద్దు మార్పులు పై చర్చిస్తారు.
ఎన్నికల సమయంలో కొన్ని జిల్లాల ఏర్పాటు, శాస్త్రీయంగా లేకుండా ఏర్పాటు చేసిన జిల్లాల వల్ల ప్రజలకు ఏర్పాటు చేసిన సమస్యలను పరిష్కరిస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. అదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. అప్పుడు మళ్లీ జిల్లాల విభజన అవసరం రాకుండా శాస్త్రీయంగా ఇప్పుడే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి.