సీమాంధ్రుల ఓట్లపై గురి..! కారుకు అసలు బేస్ మిస్ ..!?

తెలంగాణలో సీమాంధ్రుల ఓట్లు ఎన్ని అనే అంశంపై.. ఇతమిత్థమైన లెక్కలు ఎవీ లేవు . కానీ మహారాష్ట్ర సరిహద్దులో ఉండే… ఆదిలాబాద్ నుంచి నల్లగొండ వరకూ.. ఎక్కడ చూసినా ఉండే.. గుంటూరు పల్లెలు మాత్రం… సీమాంధ్ర మూలాలున్న వారి సంఖ్యను.. తేలిగ్గా తీసిపారేయలేమని రాజకీయవర్గాలు గట్టిగానే విశ్లేషిస్తూ ఉంటాయి. అయితే నిజాం కాలంలో.. అంతకు ముందు.. ఆ తర్వాత తెలంగాణకు వచ్చి స్థిరపడిన వారు.. తెలంగాణ సంస్కృతిలో భాగమైపోయారు. కానీ… ఆంధ్రలో బంధుత్వాలు అలాగే ఉన్నాయి. ఇక విద్య, ఉపాధి అవకాశాల కోసం.. హైదరాబాద్ …చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చి స్థిరపడిన వారు ఎంతో లెక్కే లేదు. ఓ అంచనా ప్రకారం… తెలంగాణలో కనీసం కోటి మంది సీమాంధ్ర మూలాలున్న ఓట్రలు ఉంటారన్న అంచనా ఉంది.

ఆంధ్ర పేరుతో రెచ్చగొట్టుడు ఎందుకు..?

నిజానికి సీమాంధ్ర మూలాలున్న ఎవరూ కూడా.. తాము తెలుగు రాష్ట్రంలో ఉన్నామనే భావిస్తున్నారు కానీ.. ఏపీలోనా.. తెలంగాణలోనా అన్న భావనకు ఎప్పుడూ రాలేదు. ఉద్యమ సమయంలోనూ ఎవరూ అభద్రతకు గురి కావడం లేదు. ఎన్నికలు వచ్చే సరికి.. రాజకీయ పార్టీల ఎజెండాలో.. ఈ సీమాంధ్ర మూలాలున్న ఓటర్లే టార్గెట్‌గా మారుతున్నారు. ప్రత్యేకంగా.. కొన్ని పార్టీలను టార్గెట్ చేసుకోవడానికి.. సెంటిమెంట్ రాజేస్తే తప్ప గెలవలేమనే భావన వచ్చేసరికి.. టీఆర్ఎస్ లాంటి పార్టీలు… ఆంధ్రా పేరుతో.. విద్వేషం పెంచడానికి ప్రయత్నిస్తున్నాయి. ఫలితంగా.. ఓట్లలో ఓ రకమైన చీలిక రావడం ఖాయంగా కనిపిస్తోంది. కేసీఆర్.. తొలి విడత ప్రచారంలో … ఎప్పుడైతే చంద్రబాబును వ్యక్తిగతంగా దూషించారో అప్పట్నుంచి వాతావరణం మారిపోయింది. నిజానికి అప్పటి వరకూ.. ఎవరూ.. టీఆర్ఎస్, టీడీపీని విడివిడిగా చూడలేదు. అలా చూడలేదు కాబట్టే.. గ్రేటర్ ఎన్నికల్లో భారీ విజయాలు గులాబీ పార్టీ చూసింది. కానీ ఆనూహ్యంగా.. యాంటీ ఆంధ్రా నినాదాన్ని టీఆర్ఎస్ ఎత్తుకుంది. దాంతో ఓట్లన్నీ… కన్సాలిడేట్ అయ్యే ప్రమాదం ఏర్పడింది.

జగన్, పవన్ మద్దతు టీఆర్ఎస్‌కే ఉందా..?

అందుకే టీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు… విభిన్నమైన వాదనలు తెరపైకి తెస్తున్నారు. సీమాంధ్రులు మొత్తం చంద్రబాబు వైపు ఎందుకుంటారని ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సామాజికవర్గం.. పవన్ సామాజికవర్గం మొత్తం టీఆర్ఎస్ వైపే ఉటుందని.. వారు తమ పార్టీకి మద్దతు ఇస్తున్నారని..సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. అంతే కాదు.. జగన్ బావ.. బ్రదర్ అనిల్ ఇప్పుడు తెలంగాణలోని చర్చిల్లో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రార్థనలు అయిపోయిన తర్వతా… బ్రదర్ అనిల్ ఇస్తున్న సందేశం కారు గుర్తుకు ఓటేయమని అన్న ప్రచారం జరుగుతోంది. కేవలం.. హైదరాబాద్ లో ఉన్న కమ్మ సామాజికవర్గం మాత్రం..టీడీపీకిఅండగా ఉంటారేమో కానీ.. చంద్రబాబును వ్యతిరేకించే… జగన్, పవన్ సామాజికవర్గాలు.. తమ వైపే ఉంటాయని…. అందుకే తాము గ్రేటర్‌లో క్లీన్ స్వీప్ చేస్తామని… కేటీఆర్ కూడా అంతర్గత సంభాషణల్లో చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

తెలంగాణ ప్రజల మద్దతు అక్కర్లేదా..?

జగన్, పవన్ ఫ్యాన్స్, ఆ సామాజికవర్గం.. ఓట్లు వేస్తారు.. సరే.. మరి అసలు తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తారా.. అన్న సెటైర్లు సోషల్ మీడియాలో జోరుగానే పడుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో… సనత్‌నగర్‌లో కట్టిన.. నాలుగు డబుల్ బెడ్ రూం ఇళ్లను… ఆశగా అందరికీ చూపించారు. అలాంటి లక్ష ఇళ్లు.. హైదరాబాద్ పేదలకు ఇస్తామని.. ప్రతి డివిజన్‌లోనూ దరఖాస్తులు తీసుకున్నారు. అవేమైనవో ఎవరికీ తెలియదు. అదొక్కటే కాదు.. చాలా హామీ అలా కాలగర్భంలో కలసిపోయాయి. ఇప్పుడు అలా ఆశ పడిన వాళ్లంతా.. తమ ఓటుతో .. సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారన్న విశ్లేషణలు వస్తున్నాయి. అదే జరిగితే.. జగన్, పవన్ ఫ్యాన్స్ మాత్రం.. అండగాఉంటారేమో కానీ.. మిగతా జనం అంతా తిరగబడినట్లే..!

— సుభాష్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బాల‌కృష్ణ‌తో నాకు శ‌త్రుత్వం లేదు: నాగ‌బాబు

టాలీవుడ్ Vs నంద‌మూరి బాల‌కృష్ణ కాస్తా.. నాగ‌బాబు Vs బాల‌కృష్ణ‌గా మారింది. బాల‌య్య బాబు నోరు జార‌డం ఏమో గానీ.. వెంట‌నే వాటిపై ఘాటు వ్యాఖ్య‌లు చేస్తూ.. కామెంట్లు...

టాలీవుడ్‌లో బాలకృష్ణ మాటల మంటలు..!

షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభించాలన్నదానిపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో చిరంజీవి నేతృత్వంలో బృందం సమావేశం కావడంపై.. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభించాలా టాలీవుడ్ పెద్దలు..తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు...

కేంద్రం ఏపీపై ఆధారపడినప్పుడు ప్రత్యేక హోదా : జగన్

అప్పు రేపు.. తరహాలో ప్రత్యేకహోదా రేపు అంటున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా గతంలో ఆయన "హోదా యోధ"గా స్వయం ప్రకటితంగా చేసుకున్న పోరాటం ఏమయిందని.. ప్రజలు...

శ్రీవారి ఆస్తులు అమ్మేదిలేదని టీటీడీ బోర్డు తీర్మానం..!

శ్రీవారికి భక్తులు కానుకగా ఇచ్చిన వాటిని అమ్మే ప్రసక్తే లేదని... తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు పాలకమండలి భేటీలో నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి ఆస్తుల అమ్మకాన్ని పూర్తిగా...

HOT NEWS

[X] Close
[X] Close