వచ్చేసింది.. శానిటైజ్డ్ న్యూస్ పేపర్..!

కరోనా నుంచి కాపాడుకోవాలంటే శానిటైజర్లతో చేతులు కడుక్కోవాలి. కరోనా భయానికి శానిటైజరే పెద్ద ఉపాయం. ఇప్పుడు కరోనా బారిన పడిన నష్టపోతున్న పత్రికా రంగం కూడా.. తమను కాపాడుకునేందుకు శానిటైజర్లను వాడేసుకుంటున్నాయి. శానిటైజ్ న్యూస్ పేపర్లను తెరపైకి తెస్తున్నాయి. వినడానికి కాస్త చిత్రంగా ఉన్నా.. ఇది నిజం. తెలుగులో.. ఆంధ్రజ్యోతి పత్రిక తొలి సారి శానిటైజ్ న్యూస్ పేపర్లను మార్కెట్లోకి తెస్తున్నట్లుగా ప్రకటన చేసింది. విస్తృతంగా ప్రచారం కూడా చేస్తోంది. ఇప్పుడంతా కరోనా భయం. చికెన్ తింటే కరోనా వస్తుందని జరిగిన ప్రచారంతో పౌల్ట్రీ పరిశ్రమ ఎలా సంక్షోభంలో కూరుకుపోయిందో… దినపత్రికలపైనా అదే తరహా ప్రచారం జరిగింది.

న్యూస్ పేపర్లపై కరోనా వైరస్ ఎక్కువ కాలం ఉంటుందన్న ప్రచారం జరగడంతో.. ప్రజలు పత్రికలను పట్టుకోవడానికి భయపడిపోతున్నారు. ఈ కారణంగా… కొన్నాళ్ల పాట్లు పేపర్ ప్రింటింగ్‌ను ఆపేయాలని.. పత్రికా యాజమాన్యాలు ఆలోచించాయి. అయితే.. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో.. అత్యంత విశ్వసనీయమైన సమాచారాన్ని ప్రజలకు చేరే వేస్తోంది ప్రింట్ మీడియానేనని… ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెప్పడమే కాదు.. పత్రికలకు అవసరమైన సాయం చేస్తానని హామీ ఇచ్చారు. దాంతో.. ఆయా పత్రికల యాజమాన్యాలు… ప్రింటింగ్‌ను కొనసాగిస్తున్నాయి. పత్రికల వల్ల కరోనా రాదని ప్రచారం ప్రారంభించాయి. కొత్తగా.. ఆంధ్రజ్యోతి దినపత్రిక మరో కాన్సెప్ట్ ను కనిపెట్టింది. అదే శానిటైజ్డ్ న్యూస్ పేపర్.

తన దినపత్రిక పూర్తిగా శుభ్రంగా ఉంటుందని..తమని శానిటైజ్డ్ న్యూస్ పేపరని.. పాఠకులు.. ఎలాంటి ఇబ్బంది లేకుండా.. తమ పత్రికను చేతుల్తో పట్టుకుని చదవవచ్చని ప్రకటించేస్తోంది. ఇంతకీ శానిటైజ్ చేయడం అంటే… కలర్స్‌లో శానిటైజర్ కలుపుతారా..? ప్రింటింగ్ అయిన తర్వాత వాటిపై శానిటైజర్లు చల్లుతారా.. అన్నదానిపై క్లారిటీ లేదు.. ఆంధ్రజ్యోతి కూడా చెప్పలేదు. కానీ ఎలాంటి వైరస్‌లు ఉండని పత్రిక అని చెప్పుకునేందుకు శానిటైజ్ అనే మాటను అలా వాడేసుకుంటుందన్న అభిప్రాయం మాత్రం చాలా మందిలో కలుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పరీక్షలు పరీక్షలే..! మోడీ మాట కాదు.. జగన్ బాట..!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ చొరవతో సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షల్ని రద్దు చేసింది. ఇంటర్ పరీక్షల్ని అంటే పన్నెండో తరగతి పరీక్షల్ని వాయిదా వేసింది. మోడీనే అలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత మనం మాత్రం...

ప్రశ్నలన్నీ వైఎస్ విజయలక్ష్మికే..!

వైసీపీ గౌరవాధ్యక్షురాలికి కాలం అంతగా కలసి రావడం లేదు. వైసీపీకి గౌరవాధ్యక్షురాలిగా ఉండి.. మరో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఉంటే.. తాజాగా షర్మిలపై తెలంగాణ పోలీసులు...

తెలంగాణలో “గుర్తు”ను కోల్పోయిన జనసేన..!

జనసేన పార్టీకి.. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు ఏదీ కలసి రావడం లేదు. బీజేపీతో స్నేహం కోసం గ్రేటర్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటంతో తెలంగాణలో జనసేన పార్టీ తన...

మోడీ ఎడాపెడా అడిగేస్తున్న జగన్..!

టీకా ఉత్సవ్ అంటూ.. ఉత్సవాలు చేస్తున్నారు కానీ.. టీకాలు మాత్రం కావాల్సినన్ని పంపడం లేదని కేంద్రం వైఫల్యాన్ని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పక్కా ప్రణాళిక ప్రకారం ప్రజల ముందు పెడుతున్నారు. గత...

HOT NEWS

[X] Close
[X] Close