కొత్తపలుకు : జగన్ సినిమా ఇంకో ఆరు నెలలు మాత్రమేనంటున్న ఆర్కే..!

ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరక్టర్ వేమూరి రాధాకృష్ణ… జగన్ మహా అయితే.. ఇంకో ఏడాది మాత్రమే సీఎంగా ఉంటారని… ఆ తర్వాత జైలుకు వెళ్లక తప్పదని అంటున్నారు. తన వారాంతపు ఆర్టికల్ ” కొత్త పలుకు”లో పలు సంచలన విషయాలు వెల్లడించారు. త్వరలో జగన్ బెయిల్ రద్దు కోసం.. సీబీఐ సుప్రీంకోర్టుకు వెళ్లబోతోందని… అదే జరిగితే.. కచ్చితంగా బెయిల్ రద్దవుతుందంటున్నారు. అసలు.. ఈ విషయం జగన్ కు కూడా తెలిసే… అటు కేంద్రంతో అణిగిమణిగి ఉంటున్నారని చెబుతున్నారు. కేసీఆర్‌తో జగన్ కొద్ది రోజుల కిదంట… నాలుగు గంటల పాటు భేటీ జరిపి చర్చించింది.. బెయిల్ ఎలా పొందాలనే అంశంపైనే అంటున్నారు ఆర్కే. సీబీఐ చార్జిషీట్లపై రోజువారీ విచారణ ప్రారంభం కాబోతోందని హింట్ కూడా తన ఆర్టికల్‌లో ఇచ్చారు ఆర్కే.

ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా.. డబ్బులు పంచి పెట్టే విషయంలో జగన్ ఎక్కడా ఆగకపోవడానికి కారణం.. కూడా ఇదే నట. ఆరు నెలల్లో… పంచగలగినంత పంచితే.. ఆ తర్వాత తాను జైలుకెళ్లినా… పేరు ఉంటుందని జగన్ అనుకుంటున్నారని.. ఆర్కే చెబుతున్నారు. తన తర్వాత వచ్చే వాళ్లు పథకాలు అమలు చేయలేరు. జగన్ ఉంటే.. అమలు చేసేవారన్న అభిప్రాయం ప్రజల్లో కల్పించడానికి ఇప్పుడిలా చేస్తున్నారని అంటున్నారు. అవినీతి కేసులలో శిక్షపడినా ప్రజలలో మాత్రం మంచివాడుగా మిగిలిపోవడానికై జగన్మోహన్‌రెడ్డి తనదైన శైలిలో వ్యూహరచన చేసుకున్నారని ఆర్కే విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఊహించిన దాని కంటే ఎక్కువగా పెరుగుతోందని.. జనవరి తర్వాత ఆర్థికంగా ఏపీ మరింత కుంగిపోతుందని.. అప్పుడు ప్రజల్లో మరింత వ్యతిరేకత వస్తుందని… ఆ తర్వాత బీజేపీ కార్యాచరణ ప్రారంభిస్తుందని ఆర్కే హింట్ ఇస్తున్నారు.

కమ్మ సామాజికవర్గాన్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చే వ్యూహాన్ని జగన్ నిర్మోహమాటంగా అమలు చేస్తున్నారని… ఆర్కే కొన్ని ఉదాహరణలు చెప్పారు. కమ్మ సామాజికవర్గానికి చెందినవారు పోలీసుశాఖలో కనీసం పోలీస్ స్టేషన్లలో కానిస్టేబుల్ పోస్టులలో కూడా లేకుండా బదిలీ చేస్తున్నారంటున్నారు. డీఎస్పీ ఆ పైస్థాయి అధికారులు 40 మందిని ఒకే సారి వేకెన్సీ రిజర్వ్‌లోకి పంపగా అందులో 30 మంది కమ్మ సామాజికవర్గానికి చెందినవారే. కమ్మ సామాజికవర్గానికి చెందినవారికి ఏ మాత్రం సహాయం చేసినట్లు తెలిసినా మీపై చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి స్వయంగా చెబుతున్నారని ఆర్కే బయటపెట్టారు. కమ్మ సామాజికవర్గానికి చెందినవారు బతికి బట్టకట్టాలంటే వైసీపీ పంచన చేరాల్సిన పరిస్థితులను రాష్ట్రంలో కల్పించారు. వైసీపీలో చేరినా ద్వితీయశ్రేణి పౌరులుగానే ఉండాల్సిన పరిస్థితి ఉందనీ, అయితే మనుగడ కోసం తప్పడంలేదనీ ఇటీవలే ఆ పార్టీకి చెందిన ఒక కమ్మ సామాజికవర్గం నాయకుడు ఆవేదన వ్యక్తంచేశారని ఆర్కే చెబుతున్నారు. ఇదే వ్యూహాన్ని కాపులపైనా జగన్ ప్రయోగిస్తున్నారంటున్నారు. కాపులపై ఇతర కులాల్లో వ్యతిరేకత తెప్పించడానికి బొత్స, పేర్ని నానిలతో.. వివాదాస్పదమైన ప్రకటలను జగన్ చేయిస్తున్నారని ఆర్కే విశ్లేషించారు. సామాజికవర్గాలను టార్గెట్ చేసి.. బొత్స, పేర్ని నాని ప్రకటనలు చేస్తున్నారు. కానీ రెడ్డి సామాజికవర్గ నేతలతో ఆ ప్రకటనలు చేయించడం లేదు. కాపులపై అన్ని వర్గాల్లో ప్రజల్లో వ్యతిరేకత పెంచడానికే ఇలా జగన్ చేస్తున్నారని ఆర్కే చెప్పుకొస్తున్నారు.

ప్రభుత్వ పెద్దలే… మాఫియాగా మారి.. వ్యాపారుల్ని… పారిశ్రామికవేత్తల్ని బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారన్న విషయాన్ని ఆర్కే నిర్మోహమాటంగా చెబుతున్నారు. “ముఖ్య” నేత పిలిచి బెదిరిస్తున్న ఘటనలను కూడా ఆర్కే ఉదహరించారు. విజయసాయిరెడ్డి పేరు చెప్పకపోయిన ాఆయన కూడా… వ్యాపారుల్ని పిలిచి.. ఏటా వంద కోట్ల రూపాయల వంతున కట్టండి” అని హుకుం జారీచేసిన విషయాన్నీ బయట పెట్టారు. ఓ రకంగా.. ఆర్కే.. సంచలనాత్మకమైన విషయాలను.. తన ఆర్టికల్‌లో పొందు పరిచారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైద‌రాబాద్‌, బెంగ‌ళూరుల్లో.. `యునైటెడ్ తెలుగు కిచెన్స్‌` ప్రారంభం

తెలుగు వారి ప‌సందైన రుచుల‌కు పెట్టింది పేరు గోదావ‌రి జిల్లాలు. వెజ్ ఐటంల నుంచి నాన్‌వెజ్ డిషెస్ వ‌ర‌కు.. గోదావ‌రి రుచులు ప్ర‌పంచ వ్యాప్తంగా ఘుమ‌ఘుమ‌లాడుతూనే ఉన్నాయి. దీంతో తెలుగు వారు ఎక్క‌డ...

కోన వెంక‌ట్ రూ.50 కోట్ల ఆశ‌

ఈ రోజుల్లో ఏ సినిమాలో ఎంత స‌త్తా ఉందో ముందే ఊహించ‌డం క‌ష్టం. టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలు వంద కోట్లు దాటేసి బాక్సాఫీసుని ఆశ్చర్య‌ప‌రుస్తున్నాయి. అందుకే త‌మ సినిమాల‌కు వంద కోట్లు,...

పులివెందుల బాధ్యతలు భారతికి ఇచ్చిన జగన్ !

పులివెందుల నియోజకవర్గ బాధ్యతలను భారతికి అప్పగించారు సీఎం జగన్. మరో వారం రోజుల్లో నామినేషన్లు ప్రారంభం కానున్న సమయంలో భారతి పులివెందులలోనే మకాం వేయనున్నారు. ఈ నెల ఇరవై ఐదో తేదీన సీఎం...

జక్క‌న్న‌కు అంత టైమ్ ఉందా?

రాజ‌మౌళి ఈమ‌ధ్య బ‌య‌ట ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఫంక్ష‌న్ల‌లో మెర‌వ‌డం చాలా త‌క్కువ‌. సినిమా వేడుక‌ల్లో చూడ‌డం వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. త‌న టైమ్ అంతా మ‌హేష్ బాబు సినిమా కోస‌మే....

HOT NEWS

css.php
[X] Close
[X] Close