చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమా మొన్ననే సెట్స్ మీదకు వెళ్లింది. అన్నపూర్ణలో వేసిన ఒక ప్రత్యేకమైన సెట్లో టాకీ పార్ట్‌ను మొదలుపెట్టారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఫుల్ బౌండ్ స్క్రిప్ట్‌తో ఉండటంతో షూటింగ్ కూడా చకచకా సాగిపోతోంది. అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఈ షెడ్యూల్లో మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. త్వరలోనే రెండో షెడ్యూల్ కూడా ప్రారంభించనున్నారు.
వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. దానికి అనుగుణంగానే అనిల్ రావిపూడి అన్ని పనులను చకచకా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పటినుంచే ప్రమోషన్స్ కూడా తనదైన స్టైల్లో స్టార్ట్ చేశాడు. టెక్నికల్ టీమ్ అందరినీ పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన వీడియోకు మంచి స్పందన వచ్చింది. అలాగే, హీరోయిన్గా నయనతారను పరిచయం చేసిన వీడియో కూడా వైరల్ అయింది. అటు భీమ్స్ ట్యూన్స్ కూడా పూర్తిచేసే పనిలో ఉన్నాడు. అనిల్ రావిపూడి “సంక్రాంతికి వస్తున్నాం” తో ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్ ఇచ్చి మంచి జోష్ మీద ఉన్నాడు. అదే జోష్‌తో మెగా సినిమాను కూడా సంక్రాంతికి రెడీ చేస్తున్నాడు. మొత్తానికి మెగా – అనిల్ మూవీ జెట్ స్పీడ్‌లో ముందుకు వెళుతోంది.