అనిల్ రావిపూడి ఛాలెంజ్.. జంథ్యాల స్టైల్ లో!

అనిల్ రావిపూడికి జంథ్యాల అంటే చాలా ఇష్టం. ఈ విష‌యాన్ని అనిల్ రావిపూడి చాలా ఇంట‌ర్వ్యూల్లో చెప్పాడు కూడా. అనిల్ రావిపూడి పాత్ర‌ల చిత్ర‌ణ‌లో కూడా జంథ్యాల స్టైల్ క‌నిపిస్తుంటుంది. మ‌రోసారి అనిల్ రావిపూడి జంథ్యాల‌పై త‌న ఇష్టాన్ని చూపించుకున్నారు. `బి ది రియ‌ల్ మేన్‌` ఛాలెంజ్ ద్వారా.

`బి ది రియ‌ల్ మేన్‌` పేరిట ఓ ఛాలెంజ్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇంటి ప‌నుల్లో శ్రీ‌మతికి, అమ్మానాన్న‌ల‌కు సాయం చేస్తూ సెల‌బ్రెటీలు ఓ వీడియో పోస్ట్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి కూడా అలాంటి వీడియోనే పోస్ట్ చేశారు. కాక‌పోతే ఈయ‌న కాస్త వెరైటీ కాదు. ఈ వీడియోని జంథ్యాల సినిమాలోని సుత్తి వీర‌భ‌ద్ర‌రావు – బ్ర‌హ్మానందంల కామెడీ ట్రాక్ తో మొద‌లెట్టారు. సుత్తి వీర‌భ‌ద్ర‌రావు చెప్పే సుదీర్ఘ‌మైన డైలాగ్ బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తుంటే, మ‌రోవైపు అనిల్ రావిపూడి చ‌క‌చ‌క ఇంటి ప‌నుల్ని చ‌క్క‌బెట్టేశాడు. త‌న హీరోలు క‌ల్యాణ్ రామ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్‌ల‌కు ఈ ఛాలెంజ్‌ని పాస్ చేశారాయ‌న‌. ఈమ‌ధ్య కాలంలో `బి ది రియ‌ల్ మేన్‌` ఛాలెంజ్‌ల‌లో కాస్త భిన్నంగా సాగిన‌ వీడియో ఇదే అని చెప్పొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మేనిఫెస్టో మోసాలు : చేసింది జలయజ్ఞం కాదు జలభగ్నం !

వైఎస్ఆర్ జలయజ్ఞం.. వైఎస్ఆర్ కలలు కన్నారు. ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, వెలిగొండ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత మంచినీరు, సాగునీరు కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం .. జలకళను...

కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా హరీష్ రావు సవాళ్ళు..!?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు రాజకీయ వ్యూహాలు తేలిపోతున్నాయి. ప్రత్యర్ధులను కట్టడి చేసేందుకు చేస్తోన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మేలు చేయకపోగా...అధికార కాంగ్రెస్ కు ఫేవర్ చేసేలా...

ఎడిటర్స్ కామెంట్ : ఆన్ లైన్ ఎలక్షన్స్ !

ఇండియాలో కేజీ బియ్యం రూ. వంద పలుకుతుంది కానీ ఒక్క జీబీ డేటా మాత్రం ఐదు రూపాయలకే వస్తుంది. మీరు సమయం అంతా యూట్యూబ్ వీడియోలు.. సోషల్ మీడియా మీదే గడపుతామంటే...

కేసీఆర్, హరీష్ రావులకు నోటిసులు..?

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ వర్క్ స్టార్ట్ చేసింది. గురువారం మొదటిసారి రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ టీం బీఆర్కేఆర్ భవన్ లో ఇరిగేషన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close