బిగ్ బాస్ కే పెద్ద బిస్కెట్ వేశాడు

బిగ్ బాస్ షో అట్ట‌హాసంగా ముగిసింది. అభిజిత్ విజేత‌గా నిల‌వ‌డంలో ఎవ్వ‌రికీ ఆశ్చ‌ర్యం ఏమీ లేదు. ముందు నుంచీ అత‌నే హాట్ ఫేవ‌రెట్. గ్రాండ్ ఫినాలేలో చిరంజీవి ప్ర‌త్యేక అతిథిగా రావ‌డం, మెహ‌రీన్ లాంటి గ్లామ‌రెస్ క‌థానాయిక‌లు వేదిక‌పై సంద‌డి చేయ‌డంతో ఈ షో మ‌రింత ఆస‌క్తిగా సాగింది. అనిల్ రావిపూడి సైతం ఈ షోకి అతిథిగా వ‌చ్చాడు.

ఈ షోకి వ‌చ్చేవాళ్లంతా బిగ్ బాస్ టాపు.. తోపూ అంటూ మాట్లాడ‌డం స‌హ‌జం. ఆఖరికి బిగ్ బాస్ చూడ‌క‌పోయినా స‌రే, `నేను బిగ్ బాస్ త‌ప్ప ఇంకేం చూడ‌ను` అన్న‌ట్టే మాట్లాడ‌తారు. అనిల్ రావిపూడి మాత్రం ఈ విష‌యంలో పీహెచ్ డీ చేసేశాడు. బిగ్ బాస్ కే పెద్ద బిస్కెట్ వేశాడు. తాను బిగ్ బాస్‌కి వీరాభిమానిన‌ని చెప్పుకున్నాడు. నాగ్ అయితే… “బిగ్ బాస్ గురించి గూగూల్ లో వెద‌కాల్సిన ప‌నిలేదు. అనిల్ రావిపూడిని అడిగితే చెప్పేస్తాడు. ఏ ఎపిసోడ్ లో ఏం జ‌రిగిందో అత‌నికి కంఠ‌తా వ‌చ్చు..“ అంటూ బిల్డ‌ప్ ఇచ్చాడు. అతి పెద్ద బిస్కెట్ ఏమిటంటే.. ఓ రోజు `స‌రిలేరు నీకెవ్వ‌రు` షూటింగ్ జ‌రుగుతోందంటే.. అది ఆపేసి.. బిగ్ బాస్ షో చూడ్డంలో మునిగిపోయాడ‌ట అనిల్ రావిపూడి. మ‌హేష్‌ని ప‌క్క‌న పెట్టుకుని, `ఇప్పుడే వ‌చ్చేస్తా.. అని బిగ్ బాస్ షో చూడ్డానికి వెళ్లిపోయాడ‌ట‌… ఇదీ నాగ్ చెప్పిన మాట‌. మ‌హేష్ లాంటి స్టార్ ని ప‌క్కన పెట్టుకుని టీవీలో ఓ రియాలిటీ షో చూడ్డానికి ద‌ర్శ‌కుడు ప‌రుగులు పెట్టాడంటే.. అంత‌కంటే హాస్యాస్ప‌దం ఇంకోటి ఉండ‌దు. ఓ షోలో.. ఆ షో గురించి మాట్లాడ‌డం వ‌ర‌కూ ఓకే. మ‌రీ ఇలాంటి బిల్డప్పులే
ఓవ‌ర్ గా అనిపిస్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జనసైనికుల్ని రెచ్చగొట్టేందుకు వైసీపీ దింపుడు కళ్లెం ఆశలు !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం పూర్తయింది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఏ సీట్లలో పోటీ చేయాలో కూడా ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే పవన్ 24 సీట్లే తీసుకున్నారంటూ.....

విచారణకు రాను – సీబీఐకి కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు తాను హాజరు కావడం లేదని సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి...

మళ్లీ ఉద్యోగుల పోరాటం ప్రభుత్వానికి తాకట్టు !

ఎన్నికలకు ముందు ఉద్యోగ నేతలు ఆందోళనలు అంటూ హడావుడి చేశారు. కానీ అదంతా స్క్రిప్టెడ్ అని.. ఏమీ చేయకపోయినా ఏదో ఇచ్చినట్లుగా హడావుడి చేయడానికని మొదటి నుంచి అనుమానాలుననాయి. ఇప్పుడు అదే నిజం...

అభిప్రాయం : జనసేన శ్రేణుల అంతర్మధనం

2024 ఎన్నికల రాజకీయ వేడి రాజకుంది. తెలుగు దేశం పార్టీజనసేన కలిసి ఏర్పాటు చేసుకున్న పొత్తు లో భాగం గా జనసేన 24 ఎమ్మెల్యే సీట్ల లో పోటీ చేస్తుందని చంద్రబాబు -పవన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close