యానిమ‌ల్‌..ఏమిటా మొండి ధైర్యం?

సందీప్ రెడ్డి వంగాది డిఫ‌రెంట్ స్టైల్‌. హిట్ వ‌చ్చింది క‌దా అని ప‌రుగులు పెట్ట‌డు. లేదంటే అర్జున్ రెడ్డి త‌ర‌వాత తెలుగులో ఈపాటికి రెండు మూడు సినిమాలు చేసేసేవాడు. కానీ తన‌కు న‌చ్చిన దారిలోనే వెళ్తున్నాడు. త‌న కొత్త సినిమా యానిమ‌ల్ ఇప్పుడు విడుద‌ల‌కు రెడీగా ఉంది. ఈ సినిమా ర‌న్ టైమ్ దాదాపు మూడున్న‌ర గంట‌లు. ఈరోజుల్లో రెండున్న‌ర గంట‌ల సినిమా అంటేనే `వామ్మో` అంటున్నారు. అలాంటిది మూడున్న‌ర గంట‌లంటే మాట‌లా? సినిమా నిడివి త‌గ్గించ‌మ‌ని ఎవ‌రు ఎన్ని చెప్పినా… సందీప్ విన‌డం లేదు. నిడివి త‌గ్గించ‌నే త‌గ్గించ‌ను.. అంటున్నాడు. చివ‌రికి పావు గంట క‌త్తిరించి మూడు గంట‌ల 15 నిమిషాలుగా ర‌న్ టైమ్ ఫిక్స్ చేశారు. అర్జున్ రెడ్డి సినిమా కూడా ఇంతే. నిడివి ప‌రంగా అర్జున్ రెడ్డి సుదీర్ఘ‌మైన సినిమానే. నిజానికి ఈరోజుల్లో ఇంతింత ఫుటేజీ ఉంటే.. దాన్ని ఇంకాస్త పెంచి, రెండు భాగాలుగా తీస్తుంటారు. ఆ ఐడియా చిత్ర‌బృందానికి కూడా వ‌చ్చింది. తొలి భాగానికి కామా పెట్ట‌డానికి స‌రైన ప్లేస్ మెంట్ దొర‌క‌లేద‌ట‌. అందుకే… ఈ సినిమాని ఒకే భాగంగా విడుద‌ల చేస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు, ప్ర‌చార చిత్రాలు ఈ సినిమాపై మ‌రింత అంచ‌నాలు పెంచేశాయి. ఈ సినిమా కోసం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సందీప్ కిషన్… ఓరి నాయనో ?

'ధమాకా' తర్వాత దర్శకుడు త్రినాథరావు నక్కి నుంచి కొత్త సినిమా ప్రకటన రాలేదు. ఈ గ్యాప్ లో ఆయన నిర్మాతగా నక్కిన నెరేటివ్ అనే బ్యానర్ స్థాపించారు. అందరూ కొత్తవారితో చౌర్యపాఠం అనే...

వెంకీ, త్రిష… మరోసారి

టాలీవుడ్ లో మరో సక్సెస్ ఫుల్ కాంబో సెట్ అయ్యింది. ఎఫ్ 2 ఫ్రాంచైజ్ తో అలరించిన వెంకటేశ్‌, అనిల్‌ రావిపూడి కలసి ఓ సినిమా చేయనున్నారు. దిల్‌రాజు నిర్మాత. కథ...

చంద్రబాబును జైలుకి పంపామని జనం మర్చిపోయారు : సజ్జల

చంద్రబాబును తప్పుడు కేసుల్లో అరెస్టు చేసి దాదాపుగా రెండు నెలలు జైల్లో ఉంచి ఆయన ఆరోగ్యానికి పెను ముప్పు తెచ్చిన జగన్ రెడ్డి సైకోతత్వాన్ని ప్రజలు మర్చిపోయారని అనుకుంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్నికలు...

పొత్తు కోసం బీజేపీని ఒప్పించింది నేనే : పవన్

టీడీపీ, జనసేనతో కలిసి నడవడానికి బీజేపీని ఒప్పించింది తానేనని పవన్ కల్యాణ్ ప్రకటించారు. టిడిపి, జనసేన కూటమికి బీజేపీ ఆశీస్సులుండాలన్నారు. పొత్తు ప్రతిపాదనను ఒప్పించడానికి ఎంత నలిగిపోయానో తనకు తెలుసని భీమవరంలో పార్టీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close