మీడియా వాచ్‌: మ‌రో ఉప సంస్థ‌ని మూసేస్తున్న రామోజీ

`ఈనాడు` ఓ మ‌హా వృక్ష‌మైతే… అందులోంచి చాలా ఉప శాఖ‌లు పుట్టుకొచ్చాయి. సితార‌, విపుల‌, చ‌తుర‌, అన్న‌దాత‌, తెలుగు వెలుగు… ప‌త్రిక‌లు `ఈనాడు` గొడుకు కింద పెరిగి, పెద్ద‌వైనవే. అయితే… విపుల‌, చ‌తుల‌, సితార‌ల‌ను మూసేసిన రామోజీ రావు.. ఆ త‌ర‌వాత ఎంతో ఇష్ట‌ప‌డి ప్రారంభించిన తెలుగు వెలుగు ప‌త్రిక‌నూ ఆపేశారు. దానికి కార‌ణం… పాఠ‌కులు క‌రువ‌వ్వ‌డం, పేప‌ర్ కాస్ట్ పెరిగిపోవ‌డ‌మే. ఇప్పుడు అన్న‌దాత ప‌త్రిక‌నీ నిలిపి వేయాల‌న్న నిర్ణ‌యం తీసుకొన్నారు. ఎన్నో ఏళ్లుగా రైతుల‌కు ఉప‌కారిగా ఉన్న అన్న‌దాత ఇక క‌నిపించ‌దు. నిజానికి సితార‌, విపుల చ‌తుర‌, తెలుగు వెలుగు..ఇవ‌న్నీ న‌ష్టాల్లో ముగిశాయి. అన్న‌దాత లాభాల‌ను తెచ్చి పెట్టేది. అయినా స‌రే, ఇప్పుడు అన్న‌దాత‌ని మూసేస్తున్నారు. ఈనెల‌తో అన్న‌దాత ఇక క‌నిపించ‌దు. అందులోని ఉద్యోగుల‌కు వాలెంట‌రీ రిటైర్మెంట్ ఇవ్వాల‌ని సంస్థ భావిస్తోంది. అయితే.. ఉద్యోగులు మాత్రం ఈనాడులోనే వేరేశాఖ‌ల్లో స‌ర్దుబాటు చేయండ‌ని యాజ‌మాన్యాన్నికోరుతున్నారు. రామోజీకి అన్న‌దాత చాలా ఇష్ట‌మైన ప‌త్రిక‌. రైతు రంగానికి ఈ ప‌త్రిక‌తో సేవ చేయాల‌నుకొన్నారు. దాంతో లాభాల‌నూ ఆర్జించారు. కానీ స‌డ‌న్‌గా అన్న‌దాత‌ని మూసేయాల‌న్న నిర్ణ‌యం ఎందుకు తీసుకొన్నారో అర్థం కావ‌డం లేదు. మొత్తానికి ఇప్పుడు ఈనాడు ఒక్క‌టే మిగిలింది. దాని ఉప ప‌త్రిక‌ల చ‌రిత్ర మొత్తం ముగిసిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అసెంబ్లీలో కేసీఆర్ రోల్‌లో కేటీఆర్ !

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ ను కూడా ప్రవేశ పెట్టారు. గవర్నర్ ప్రసంగం రోజున ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ నుంచి ఆహ్వానించి.. వీడ్కోలు పలికేందుకు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. కానీ...

ఎన్నికల్లో పోటీపై ఆశలు పెంచుకుంటున్న అలీ !

సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు .. ఎక్కడెక్కడ పోటీ చేయాలో ఓ క్లారిటీకి వచ్చారు. టిక్కెట్లు ఇవ్వలేని వాళ్లకు సలహాదారు పదవులు ఇతర పదవులు ఇచ్చారు. అలా పదవులు పొందిన...

సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్‌కు పొంగులేటి సవాల్ !

పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి తిరుగుతున్నారని బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంత మంది నేతల్ని ఆ పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. అందరూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినవారే. వీరిలో కొంత మంది నామినేటెడ్...

విజయ్, దిల్ రాజు పై అల్లు అరవింద్ ప్రెస్ మీట్ కాన్సిల్ !

విజయ్ దేవరకొండ, పరశురాం, దిల్ రాజు సినిమా ప్రకటన వచ్చింది. విజయ్, పరశురాం ‘గీత గోవిందం’తో బ్లాక్ బస్టర్ కొట్టారు. దీంతో ఇది క్రేజీ కాంబినేషన్ అయ్యింది. అయితే ఈ కాంబినేషన్ లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close