రేపే జాతీయ అవార్డుల ప్ర‌క‌ట‌న‌: మ‌న‌కు ఛాన్సుందా?

68వ జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల ప్ర‌క‌ట‌న శుక్ర‌వారం సాయింత్రం వెలువ‌డ‌నుంది. ఈ అవార్డుల్లో ప్ర‌తీసారీ.. తెలుగు సినిమాకి మొండి చేయి చూపించ‌డం మామూలే. కాక‌పోతే.. 2021లో తెలుగులోనూ మంచి సినిమాలొచ్చాయి. ఆర్‌.ఆర్‌.ఆర్ ఈ యేడాది విడుద‌లైనా, 2021లో సెన్సార్ జ‌రుపుకొంది. అంటే… 2021 అవార్డులకు ఆర్‌.ఆర్‌.ఆర్ గ‌ట్టి పోటీ ఇస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఉత్త‌మ ప్రాంతీయ చిత్రం, స్పెష‌ల్ ఎఫెక్ట్స్‌, సౌండ్ డిజైనింగ్‌, ఉత్త‌మ స్క్రీన్ ప్లే విభాగాల్లో ఈ సినిమా గ‌ట్టి పోటీ ఇవ్వ‌నుంది. `పుష్ప‌` కూడా… 2021లోనే వ‌చ్చింది. ఈ సినిమాని జాతీయ అవార్డుల ప‌రిశీల‌న‌లో ప‌రిగ‌ణ‌లోకి తీసుకొంటారు. జాతిర‌త్నాలు, శ్రీ‌కారం, నాంది, సినిమా బండి… ఇలా కొన్ని చిన్న సినిమాలు అవార్డు రేసులో ఉన్నాయి. ప్రాంతీయ ఉత్త‌మ చిత్రంగా వీటిలో ఏదైనా నిల‌వొచ్చు. 2021లో ఓటీటీ వేదిక చేసుకొని విడుద‌లైన సినిమాలే ఎక్కువ‌. వాటిలో కొన్ని అవుటాఫ్ ది బాక్స్ ఐడియాల‌తో రూపొందిన‌వి. వాటికి అవార్డులొచ్చే ఛాన్సుంది. గ‌తేడాది అద్భుతమైన విజ‌యం సాధించిన `జై భీమ్‌` పేరు ఈసారి అవార్డుల జాబితాలో గట్టిగా వినిపించే ఛాన్సుంది. కాక‌పోతే.. అది త‌మిళ సినిమా. ఎప్ప‌టిలానే ఈసారి మ‌ల‌యాళం చిత్ర‌సీమ ఎక్కువ అవార్డుల్ని ఎగ‌రేసుకొని వెళ్లే ఛాన్సుంది. చూద్దాం.. రేప‌టి ఫ‌లితాలు ఉలా ఉంటాయో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప‌తంజ‌లిని మ‌ళ్లీ నిల‌దీసిన సుప్రీం… ఈసారి ఇంకా ఘాటుగా!

ప‌తంజ‌లి క్ష‌మాప‌ణ‌ల‌కు స‌సేమిరా అంటున్న సుప్రీంకోర్టు... ప‌తంజ‌లి ప్ర‌మోట‌ర్ల‌పై మ‌రోసారి మండిప‌డింది. కావాల‌నే తెలివిగా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూ త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై సాగుతున్న విచార‌ణ‌లో భాగంగా...

సూర‌త్ ఎన్నిక వెనుక జ‌రిగింది ఇదేనా?- బీజేపీలోకి కాంగ్రెస్ అభ్య‌ర్థి

క‌మ‌ల వికాసం మొద‌లైపోయింది. సూర‌త్ లో బీజేపీ అభ్య‌ర్థి గెలుపుతో మొద‌లైన ఈ హ‌వా 400సీట్ల‌కు చేర‌కుంటుంద‌ని బీజేపీ సంబురాలు చేసుకుంటుంది. అనైతిక విజ‌యం అంటూ కాంగ్రెస్ విరుచుక‌ప‌డుతుంటే, నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణకు గురైన...

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close