రవిప్రకాష్‌పై మరో కేసు..! మళ్లీ రిమాండ్..!

టీవీ9 చానల్ మాజీ సీఈవో రవిప్రకాష్‌పై “బోనస్” కేసు విషయంలో నవంబర్ రెండో తేదీ వరకూ ఎలాంటి చర్యలు వద్దని హైకోర్టు ఆదేశించడంతో పోలీసులు రూటు మార్చారు. వెంటనే రవిప్రకాష్‌పై మరో కేసు నమోదు చేశారు. నటరాజన్, ఐ ల్యాబ్ పేరుతో.. ఫేక్ ఈమెయిల్ ఐడీ సృష్టించారనేది ఆ కేసు. ఆలా కేసు నమోదు చేసి.. అలా ఆయనను చంచల్ గూడ జైలు నుంచి పీటీ వారెంట్‌తో అదుపులోకి తీసుకున్నారు. రవిప్రకాష్‌ను మియాపూర్ కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. ఇప్పుడు బోనస్ కేసులో బెయిల్ వచ్చినా.. ఆయన ఫేక్ ఐడీ కేసులో… జైల‌ులోనే ఉండాల్సిన పరిస్థితి కల్పించారు.

రవిప్రకాష్‌పై నమోదైన కొత్త కేసులో అసలు ఫిర్యాదు దారు ఎవరు.. ? అన్నదానిపైనా స్పష్టత లేకుండా పోయింది. ఫేక్ ఈమెయిల్ క్రియేట్ చేస్తేనే పోలీసులు అరెస్ట్ చేస్తారా.. అన్న నోరెళ్లబెట్టడం… ఇతరుల వంతు అయింది. ఐ ల్యాబ్ పేరు తో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద ఫేక్ ఈమెయిల్ ఐడిని రవిప్రకాష్ క్రియేట్ చేశారనేది అసలు ఆరోపణ. అందుకే.. ఐటీ యాక్ట్ 406/66 కింద సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. రవిప్రకాష్‌ను జైలు నుంచి బయటకు రానివ్వకూడదన్న ఉద్దేశంతోనే… పోలీసులు ఇలా కేసులో.. అరెస్టులు చూపిస్తున్నారని.. రవిప్రకాష్ వర్గీయులు ఆరోపణలు గుప్పిస్తున్నారు.

నిజానికి గతంలో ఇలా టీవీ9 కొత్త యాజమాన్యంతో ఏర్పడిన వివాదాల్లో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఆ బెయిల్ షరతుల ప్రకారం… పోలీసుల ముందు హాజరవుతున్నారు. అలాంటి సందర్భాల్లో అరెస్ట్ చేయాల్సిన అవసరం రాదనేది… న్యాయనిపుణుల వాదన. నిందితుడు పారిపోతాడన్న అనుమానం ఉంటేనే అరెస్ట్ చేయాలి. కానీ ఇక్కడ చాలా చిన్న చిన్న కేసుల్లోనూ రవిప్రకాష్‌పై కేసులు నమోదు చేసి.. రిమాండ్‌కు తరలిస్తున్నారు. ఇదే న్యాయవాద వర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంగ్లిష్ మీడియం కోసమూ సుప్రీంకోర్టుకు ఏపీ సర్కార్..!

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో ఇంగ్లిష్ మీడియం మాత్రమే ఉండాలనే పట్టుదలను ప్రదర్శిస్తున్న ఏపీ సర్కార్.. సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో...

కృష్ణా బోర్డు భేటీలో ఎప్పటి వాదనలే.. ఎప్పటి వాటాలే..!

కృష్ణా నద యాజమాన్య బోర్డు భేటీలో ఆరు గంటలు వాదోపవాదాలు చేసుకున్నా..చివరికి మొదటికే వచ్చారు రెండు రాష్ట్రాల అధికారులు. ఇద్దరి వాదనలుక..కేఆర్ఎంబీ బోర్డు.. డీపీఆర్‌లు సమర్పించాలనే సూచనతో ముగింపునిచ్చింది. డీపీఆర్‌లు...

తూచ్.. విజయ్‌ మాల్యాను అప్పగించరట..!

విజయ్ మాల్యాను అప్పగించడం లేదని బ్రిటన్ ప్రభుత్వం తేల్చేసింది. న్యాయపరమైన ప్రక్రియ పూర్తి కాలేదని.. చట్ట లాంచనాలు పూర్తి చేయాల్సి ఉందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. అవి ఏమిటో..ఎప్పుడు పూర్తవుతాయో..మాత్రం చెప్పడం లేదు....

బాల‌య్య ఇంట్లో విందు… చిరు వ‌స్తాడా?

జూన్ 10... బాల‌కృష్ణ పుట్టిన రోజు. ఈసారి పుట్టిన రోజు ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. ఇది ఆయ‌న ష‌ష్టి పూర్తి మ‌హోత్స‌వ సంవ‌త్స‌రం. అందుకే ఈ పుట్టిన రోజుని కాస్త ప్ర‌త్యేకంగా జ‌రుపుకోవాల‌ని బాల‌య్య...

HOT NEWS

[X] Close
[X] Close