ప‌వ‌న్ పై మ‌రో ఫేక్ వార్త‌!

ప‌వ‌న్ క‌ల్యాణ్ పై చుట్టూ ఎన్నో రూమ‌ర్లు పుట్టుకొస్తుంటాయి. అలాంటిదే మ‌రో ఫేక్ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి హైద‌రాబాద్‌లో బోనీ క‌పూర్ ఓ భారీ పార్టీ ఇచ్చార‌ని, ఆ పార్టీలో అజిత్ కూడా ఉన్నాడ‌ని.. ఇండ‌స్ట్రీలోని కీల‌క‌మైన కొంత‌మంది సెల‌బ్రెటీల‌కు మాత్ర‌మే ఈ పార్టీకి ఆహ్వానం అందింద‌ని ఆ వార్త‌ల సారాంశం. `పింక్‌` సినిమాని ప‌వ‌న్ తెలుగులో `వ‌కీల్ సాబ్‌`గా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పింక్ ని బాలీవుడ్ లో తీసింది.. బోనీక‌పూర్‌నే. దాన్ని త‌మిళంలో అజిత్ హీరోగా తెర‌కెక్కించారు. ఈ నేప‌థ్యంలో `పింక్‌` హీరోల‌కు బోనీ పార్టీ ఇచ్చాడ‌ని, ఈ పార్టీని అత్యంత ర‌హ‌స్యంగా ఉంచార‌ని, వాటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలూ కూడా బ‌య‌ట‌కు రాకుండా జాగ్ర‌త్త ప‌డ్డాని, ఇలాంటి పార్టీలకు ఏమాత్రం ఆసక్తి చూపించిన ప‌వ‌న్ సైతం.. ఈ పార్టీకి హాజ‌ర‌య్యాడ‌ని గుస‌గుస‌లు వినిపించాయి.

దీనిపై బోనీక‌పూర్ పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. బోనీ ఎవ‌రికీ, ఎలాంటి పార్టీ ఇవ్వ‌లేద‌ని, ఆయ‌న గ‌త రెండు వారాలుగా ముంబైలోనే ఉన్నార‌ని, హైద‌రాబాద్ రాలేద‌ని తేల్చి చెప్పింది. సో.. అస‌లు హైద‌రాబాద్‌లో బోనీ కాలు పెట్ట‌నేలేద‌న్న‌మాట‌. అలాంటప్పుడు ప‌వ‌న్‌, అజిత్ ల‌కు పార్టీ ఎవ‌రిచ్చారో??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close