ఛ‌త్ర‌ప‌తిపై మ‌రో ఫేక్ న్యూస్‌

తెలుగు ఛ‌త్ర‌ప‌తి.. ఇప్పుడు బాలీవుడ్ కి వెళ్తున్న సంగ‌తి తెలిసిందే. బెల్లంకొండ శ్రీ‌నివాస్ హీరో. వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. ఇటీవ‌లే షూటింగ్ ప్రారంభ‌మైంది. ఇందులో క‌థానాయిక ఎవ‌ర‌న్న‌ది ఇంకా తేల‌లేదు. అయితే సోష‌ల్ మీడియాలో మాత్రం రెజీనా పేరు గ‌ట్టిగా వినిపిస్తోంది. రెజీనా క‌థానాయిక‌గా ఖ‌రారైంద‌ని వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. దీనిపై చిత్ర‌బృందం గ‌ట్టిగానే క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా ఫిక్స్ అవ్వ‌లేద‌ని, రెజీనాని ఎంచుకున్నామ‌న్న వార్త‌ల‌లో నిజం లేద‌ని తేల్చేసింది. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ భామ‌ని ఎంచుకోవాల‌న్న‌ది చిత్ర‌బృందం ఆలోచ‌న‌. అందుకోసం గ‌ట్టిగా ప్ర‌య‌త్నాలు కూడా చేస్తున్నారు. క‌చ్చితంగా ఈ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ ఉంటుంద‌ని చెబుతోంది చిత్ర యూనిట్. హీరోయిన్ గా ఎవ‌రు ఎంచుకున్నా 35 రోజుల ఏక‌ధాటి కాల్షీట్లు కావాల‌ట‌. అలా ఎవ‌రిస్తే.. వాళ్ల‌ని తీసుకోవాల‌ని భావిస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ సినిమాల్లో స్టార్ హీరోయిన్లే క‌నిపిస్తుంటారు. ఈసారి కూడా స్టార్ క‌థానాయికే ఉంటుంద‌ని, కాస్త ఆల‌స్య‌మైనా పేరున్న అమ్మాయినే తీసుకుంటామ‌ని టీమ్ క్లారిటీ ఇస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కత్తి మహేష్ టెంప్లేట్ వైకాపా వదలదా? కత్తి స్థానాన్ని పోసాని భర్తీ చేయగలరా ?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైఎస్ఆర్సిపి మంత్రులు వర్సెస్ పవన్ కళ్యాణ్ అంటూ చిన్న సైజు యుద్ధమే జరుగుతుంది. సినిమా టికెట్లను ప్రభుత్వ పోర్టల్ ద్వారా అమ్మాలి అన్న జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పవన్...

పోసాని మళ్లీ రచ్చ – దాడికి ప్రయత్నించిన పవన్ ఫ్యాన్స్ !

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మరోసారి మీడియా ముందుకు వచ్చిన పోసాని కృష్ణమురళి ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం పెట్టి "పవన్ నీకెంత...

ప్రజల వరద కష్టాల కన్నా మీడియాకు సినిమా గొడవలే మిన్న !

ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో తుపాన్ బీభత్సం సృష్టించింది. ఏపీలో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పటికీ తేరుకోలేదు. కొన్ని వందల గ్రామాల్లో అంధకారం అలుముకుంది. ఇక నష్టపోయిన వారి గురించిచెప్పాల్సిన...

పంజాబ్ కాంగ్రెస్ చిందర వందర !

అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదో చేద్దామని ప్రయత్నించిన కాంగ్రెస్ హైకమాండ్... పంజాబ్ లో పార్టీని చిందర వందర చేసుకుంది. సిద్దూకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి అందర్నీ కూల్ చేయాలనుకుంటే చివరికి అదే...

HOT NEWS

[X] Close
[X] Close