ర‌వితేజ ఇంటి నుంచి ఓ హీరో

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా, ఎవ‌రి అండ దండ‌లపై ఆధార‌ప‌డ‌కుండా త‌న కాళ్ల‌పై తాను నిల‌బ‌డి.. స్టార్ గా మారాడు ర‌వితేజ‌. తాను నిలదొక్కుకోవ‌డ‌మే కాదు.. త‌మ్ముళ్లు భ‌ర‌త్‌, ర‌ఘుల‌కు కూడా ఓ మార్గం వేశాడు. ర‌వితేజ త‌న‌యుడు మ‌హాజ‌న్ కీ న‌ట‌న‌పై ఆస‌క్తి ఉంది. తండ్రితో క‌లిసి ఓ సినిమాలో న‌టించాడు కూడా. త్వ‌ర‌లో తాను హీరోగా అవ‌తారం ఎత్తే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయి. అయితే అంత‌కంటే ముందే ర‌వితేజ ఇంటి నుంచి మ‌రో హీరో వ‌స్తున్నాడు. త‌నే… మాధ‌వ్. ర‌వితేజ త‌మ్ముడు ర‌ఘ త‌న‌యుడు. త‌న వ‌య‌సు 21. హీరోకి కావ‌ల్సిన అన్ని ల‌క్ష‌ణాలూ, అన్ని అర్హ‌త‌లూ సంపాదించుకొన్నాడు. న‌ట‌న‌లో శిక్ష‌ణ కూడా తీసుకొన్నాడు. ఇప్పుడు హీరోగా మారుతున్నాడు.

మాధ‌వ్ హీరోగా ఓ క్రేజీ ప్రాజెక్టు సిద్ధం అవుతోంది. ఇదో కొత్త త‌ర‌హా ప్రేమ క‌థ అని తెలుస్తోంది. క‌థ ఇప్ప‌టికే సిద్ధ‌మైంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ట‌. మాధ‌వ్ ఎంట్రీ బాధ్య‌త ర‌వితేజ తీసుకొన్నార‌ని, క‌థ‌ని ఆయ‌నే ఓకే చేశార‌ని, టెక్నీషియ‌న్ల ఎంపిక‌ విష‌యంలోనూ ర‌వితేజ శ్ర‌ద్ధ తీసుకుంటున్నార‌ని స‌మాచారం. మ‌రో వారంలోగా.. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. మ‌రి ఈ కొత్త హీరో ఎలా ఉంటాడో, ఏం చేస్తాడో తెలియాలంటే… ఇంకొన్ని రోజులు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాలికో న్యాయం .. జగన్‌కో న్యాయమా ?

గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసులు, జనార్దన్ రెడ్డి తీరు , విచారణ ఆలస్యం అవుతున్న వైనం ఇలా అన్ని విషయాల్లోనూ సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణను ఫాలో అవుతున్న వారికి...

ఇక టీఆర్ఎస్ పార్టీ లేనట్లేనా !?

కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ రాజకీయాలు చేయలేరు. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ కోసమే ఆ పార్టీపెట్టారు. ఇప్పుడు భారతీయ సెంటిమెంట్‌తో భారతీయ రాష్ట్ర సమితి...

ఫ్యాక్ట్ చెక్ ఏపీ.. నిజాలు చెప్పలేక తంటాలు !

ఏపీ పోలీసులు ఫ్యాక్ట్ చెక్ చేస్తామంటూ ప్రత్యేకంగా ఫ్యాక్ట్ చెక్ ఏపీ అంటూ కొత్త విభాగాన్ని చాలా కాలం కిందట ప్రారంభించారు. ఇందులో సామాన్యులు తప్పుడు సమాచారం వల్ల నష్టపోయే...

కొత్త పార్టీ..కొత్త విమానం.. కొత్త హుషారు.. కేసీఆర్ స్టైలే వేరు !

కేసీఆర్ మౌనం వెనుక ఓ సునామీ ఉంటుంది. జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనుకున్న తర్వాత కసరత్తు కోసం ఆయన కొంత కాలం మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన సునామీలా విరుచుకుపడనున్నారు. దసరా రోజు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close