మరో`మౌంటెన్ మ్యాన్’…

యదార్థ సంఘటనల ఆధారంగా `మాంఝీ-ది మౌంటెన్ మ్యాన్’ సినిమా విడుదలైన కొద్దిరోజులకే మాంఝీ కథకు దగ్గర పోలికలున్న మరో వ్యక్తి యధార్థగాధ వెలుగుచూసింది. దశరథ్ మాంఝీ బిహార్ లోని ఓ మారుమూల గ్రామానికి చెందినవాడుకాగా, ఇప్పుడు వెలుగులోకి వచ్చిన వ్యక్తి మహారాష్ట్ర మౌంటెన్ మ్యాన్. అహ్మద్ నగర్ జిల్లా గుండేగావ్ గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ రాజారామ్ భాప్కర్. 50సంవత్సరాలకు పైగా కష్టపడి కొండ తొలిచి తన గ్రామానికి రోడ్లు వేయించిన ఘనుడితను.

రాజారామ్ భాప్కర్ ని అక్కడివారంతా భాప్కర్ గురూజీ అనే పిలుస్తుంటారు. 84ఏళ్ల భాప్కర్ చాలా సింపుల్ గా ఉంటాడు. తలపై గాంధీటోపీ, తెల్లటి షర్ట్ పైజమా ధరించి కొండప్రాంతాల్లో తిరగాడుతుంటాడు. ఎవరు కనిపించినా ఆత్మీయంగా పలకరిస్తుంటాడు. గత 57ఏళ్లుగా అతను 40 కిలోమీటర్ల మేరకు రోడ్లు వేయడంలోనే నిమగ్నమయ్యాడు.

మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చేనాటికి గుండేగావ్ కి పక్కగ్రామంతోకూడా రహదారి సంబంధాలు సరిగా ఉండేవికావు. 1957నుంచి 1991వరకు కొలెగావ్ అనే గ్రామంలో భాప్కర్ జిల్లాపరిషత్ స్కూల్ లో పనిచేశారు. చదువుకోవడానికి అక్కడికి చేరుకోవాలంటే మూడూర్లు దాటిరావాల్సిందేనని భాప్కర్ అలనాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. మధ్యలో కొండను తొలిచి రోడ్టు వేస్తే చాలాదూరం తగ్గుతుందని భాప్కర్ అనేకమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 700మీటర్ల మేరకు కొండదారి ఏర్పాటుకోసం ఆయన ఎంతగానో కృషిచేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం రాకపోవడంతో తానే నడుంబిగించి పొరుగు గ్రామాల నుంచి తన గ్రామానికి వచ్చే 40కిలోమీటర్ల పొడవుతో కూడిన మొత్తం ఏడురోడ్లను వేయించాడు. రహదారి యజ్ఞం 57ఏళ్లపాటు కొనసాగింది.

భాప్కర్ యజ్ఞం ఫలించింది. దెల్గావ్ నుంచి కొలెగావ్ కు రావడానికి ఒకప్పుడు 29కిలోమీటర్లు వెళ్లాల్సిరాగా, ఇప్పుడు కొత్త రహదారి పడటంతో దూరం 10 కిలోమీటర్లకు తగ్గింది. మార్గమధ్యంలోని కొండను తొలిచి దారివేయాల్సివచ్చింది.

ఇలా రోడ్లు వేయడానికి తన జీతంలో సగం ఎప్పుడూ ఖర్చుపెట్టాల్సివచ్చేదని భాప్కర్ చెప్పేవారు. కొండను తొలవడానికీ, కచ్చారోడ్డు వేయడానికి ఆయన చాలానే ఖర్చుచేశారు. చివరకు ఆయనకు వచ్చిన ఫించను కూడా …

రహదారి పనుల నిమిత్తం ఆయనకు ప్రభుత్వం నుంచి రూపాయికూడా ముట్టలేదు. మొదట్లో ఈ కొండదారిలో సైకిల్ వెళ్లడానికి కూడా కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు పెద్దపెద్ద వాహనాలు కూడా హాయిగా వెళుతున్నాయని ఎంతో ఆనందంగా చెప్పాడు భాప్కర్.

మరి బిహార్ మౌంటెన్ మ్యాన్ (దశరథ్ మాంఝీ) గురించి చెప్పుకునేటప్పుడు ఈ మహారాష్ట మౌంటెన్ మ్యాన్ (భాప్కర్) గురించి కూడా చెప్పుకోవాల్సిందే. ఇంకా ఇలాంటి నిస్వార్థ సేవకులు ఇంకా ఎంతోమంది ఉండేఉంటారు.

మనదేశం ఇప్పటికీ రహదారి వ్యవస్థలో వెనుకబడేఉంది. వాగులు, వంకలు, చెరువులు, నదీనదాలు, అడవులు, కొండలు, గుట్టల వల్ల అనేక గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు బలంగా ఉండటంలేదన్నది పచ్చినిజం. పాకృతిక అడ్డంకులవల్ల ఎదురుగాఉన్న పట్టణానికి చేరుకోవాలన్నా నాలుగైదురెట్లు అదనంగా వెళ్ళాల్సివస్తున్నది. దీంతో ఆయా గ్రామాలవాళ్లు విద్య, ఆరోగ్య, వ్యాపార రంగాల్లో వెనుకబడిపోతున్నారు. చిత్తశుద్ధిలేని ప్రభుత్వాల వల్ల ఇప్పటికీ అనేక గ్రామాలు చీకట్లో మగ్గిపోతున్నాయి. అలాంటప్పుడు ఒక మాంఝీ, మరొక భాప్కర్ యాదార్థగాధలే మనకు నిత్య స్ఫూర్తి.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close