పుష్ఫ‌కి మ‌రో స్పీడ్ బ్రేక‌ర్‌

డిసెంబ‌రు 17న పుష్ఫ విడుద‌ల కావాల్సివుంది. ఈ సినిమా డిసెంబ‌రు 17న రావ‌డం కొంచెం క‌ష్ట‌మే. చిత్ర‌బృందం అహ‌ర్నిశ‌లూ క‌ష్ట‌ప‌డితే త‌ప్ప‌, అనుకున్న స‌మ‌యానికి సినిమా విడుద‌ల చేయ‌డం క‌ష్టం. ఈ సినిమా.. డిసెంబ‌రు 17న రాద‌ని, మ‌రో డేట్ చూసుకోవాల్సిందే అని ఫిల్మ్‌న‌గ‌ర్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దానికి త‌గ్గ‌ట్టే ఈ టీమ్ కి మ‌రో షాక్ త‌గిలింది. ద‌ర్శ‌కుడు సుకుమార్ అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్టు, ప్ర‌స్తుతం ఆయ‌న విశ్రాంతి తీసుకుంటున్న‌ట్టు టాక్. ఆయ‌న లేక‌పోతే.. పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నుల‌కు బ్రేక్ ప‌డిన‌ట్టే. గ‌త రెండు నెల‌లుగా సుకుమార్ విశ్రాంతి లేకుండా ప‌నిచేయ‌డం వ‌ల్ల‌.. బాగా నీర‌సించిపోయార‌ని, అందుకే ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నార‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. ఆర్‌.ఆర్‌, ఎడిటింగ్ విష‌యాల‌న్నీ ద‌గ్గ‌రుండి చూసుకోవ‌డం సుకుమార్ కి అల‌వాటు. సుకుమార్ గైర్హాజ‌రీతో ఆ ప‌నులు ఎక్క‌డవి అక్క‌డే ఆగిపోయాయి. దాంతో… ఈ సినిమా స్పీడుకి స‌డ‌న్ బ్రేక్ ప‌డిన‌ట్టైంది. ఈ నెలాఖ‌రున పుష్పలోని ఐటెమ్ గీతాన్ని తెర‌కెక్కించాల్సివుంది. అప్ప‌టికి సుకుమార్ కోలుకుని తిరిగొచ్చేస్తాడు. ఆ త‌ర‌వాత‌.. మళ్లీ పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నులు స్పీడందుకుంటాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close