శ్రావ‌ణిని చంపాల‌నుకున్నాడా?

బుల్లి తెర న‌టి శ్రావ‌ణి ఆత్మ‌హ‌త్య కేసు మ‌రో మ‌లుపు తిరిగింది. నిన్న అర్థ‌రాత్రి హైద‌రాబాద్ లోని ఎస్‌.ఆర్ న‌గ‌ర్ లోని త‌న నివాసంలో శ్రావ‌ణి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన సంగ‌తి తెలిసిందే. టిక్ టాక్ స్టార్ దేవ‌రాజు రెడ్డి వేధింపులు భ‌రించ‌లేకే.. శ్రావ‌ణి ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని ఆమె కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు దేవ‌రాజుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో దేవ‌రాజు కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని పోలీసుల‌కు చెప్పిన‌ట్టు తెలుస్తోంది. సాయి అనే మ‌రో వ్య‌క్తి శ్రావ‌ణి వెంట‌ప‌డేవాడ‌ని, త‌న‌ని పెళ్లి చేసుకోమ‌ని వేధించేవాడ‌ని, పెళ్లి చేసుకోక‌పోతే… చంపేస్తాన‌ని బెదిరించేవాడ‌ని, అందుకోసం ప్ర‌య‌త్నాలూ చేశాడ‌ని, త‌న వేధింపులు భ‌రించ‌లేకే… శ్రావ‌ణి ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని, ఇందుకు సంబంధించిన ఆధారాలు త‌న ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని అంటున్నాడు దేవరాజు. ఇప్పుడు ఈ సాయి ఎవ‌రు? సాయికీ.. శ్రావ‌ణికి ఉన్న సంబంధం ఏమిట‌న్న విష‌యంలో.. పోలీసులు ద‌ర్యాప్తు మొద‌లెట్టారు. సాయి అనే వ్య‌క్తి ఉన్నాడా? లేదంటే.. ఈ కేసు నుంచి త‌ప్పించుకోవ‌డానికి సాయి పేరుని బ‌య‌ట‌కు తెచ్చాడా? అనే కోణంలోనూ విచారిస్తున్నారు. శ్రావ‌ణి కాల్ డేటాని పోలీసులు క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్నారు. కాల్ రికార్డ్స్ ద్వారా ఈ కేసుని ఛేదించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. మొత్తానికి శ్రావ‌ణి ఆత్మ‌హ‌త్య లోనూ కొన్ని వెలుగు చూడ‌ని ర‌హ‌స్యాలు ఉన్నాయేమో అనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close