అనుబంధం (శాటిలైట్‌తో) మూవీ ప్రారంభం

శ్రీ సాయి సినిమాస్‌ బ్యానర్‌పై యం. మహేంద్రవర్మ సమర్పణలో సాయి, నాగుల్‌ మీర నిర్మాతలుగా.. సత్యనారాయణ సజ్జనపు దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ”అనుబంధం”. ‘శాటిలైట్‌తో’ అనేది ఉపశీర్షిక. సారథి, నజీర్‌లు సహనిర్మాతలు. ఈ చిత్రం డిశంబర్‌ 10వ తేదీన ముహుర్తం జరుపుకుంది. ప్రముఖ తత్వవేత్త శ్రీశ్రీ రామశివ చైతన్యంగారు టీమ్‌ని ఆశీర్వదించి చిత్రానికి శ్రీకారం చుట్టారు. దర్శకుడు నగేష్‌ నారదాశి దర్శకనిర్మాతలకు శుభాభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సత్యనారాయణ సజ్జనపు మాట్లాడుతూ..”నేటి యువతరంలోని అనబంధాలను, శాటిలైట్‌తో వాటి సంబంధాలను కొత్తదనంతో చూపించే వైవిధ్యభరిత చిత్రమే ‘అనుబంధం’. నిర్మాతలు సాయి, నాగుల్‌ మీర గార్లు..ఈ స్టోరీ విని ఎంతో ఆసక్తిని కనబర్చారు. వెంటనే ఈ చిత్రం తెరకెక్కిద్దామని ఇలా ముందుకొచ్చారు. నా కథ నమ్మి, ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చిన వారికి ముందుగా ధన్యవాదాలు. అందరినీ అలరించే అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి..” అని అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ..”ముందుగా మా ఈ ‘అనుబంధం’ చిత్రానికి శ్రీకారం చుట్టిన శ్రీశ్రీ రామశివ చైతన్యం గార్కి, మా శ్రేయోభిలాషి, దర్శకుడు నగేష్‌ నారదాశి గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు. సత్యనారాయణ సజ్జనపు చెప్పిన కథ మాకు ఎంతగానో నచ్చింది. అందుకే ఈ సినిమా చేయాలని ముందుకొచ్చాము. ప్రముఖ హీరో నటించే ఈ చిత్రంలో మిగిలిన నటీనటుల ఎంపిక జరుగుతోంది. జనవరి 20 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుంది..” అని అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

ఆస్తుల పంచుడు వివాదం – కాంగ్రెస్‌కు బీజేపీ ప్రచారం !

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ధనవంతుల ఆస్తులను పేదలు పంచుతామని ఎక్కడా చెప్పలేదు. ఎప్పుడో మన్మోహన్ సింగ్ ఏదో చెప్పారని..దాన్ని చిలువలు పలువలు చేసి బీజేపీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ వస్తే మన ఆస్తులన్నింటినీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close