ముద్దు పెట్ట‌డానికి కూడా డ‌బ్బులు తీసుకుందా?

ఏ విష‌యాన్న‌యినా క్యాష్ చేసుకోవ‌డంలో మ‌న హీరోయిన్లు ముందుంటారు. ఓ ప‌క్క హీరోయిన్ గా చేస్తూనే, ఐటెమ్ గీతాలు చేయ‌డానికీ, షాపింగ్ మాల్స్ లో సంద‌డి చేయ‌డానికీ కార‌ణం అదే. ఫేమ్ ఉండ‌గానే… ఇల్లు చ‌క్క‌బెట్టుకోవ‌డం కోస‌మే. సినిమా స్థాయిని బ‌ట్టి… హీరోయిన్లు త‌మ పారితోషికాన్ని మార్చుకుంటుంటారు. కొత్త హీరోలు, డెబ్యూ హీరోల సినిమాల్లో న‌టించ‌డానికి ఓరేటు, స్టార్ హీరోల సినిమాల‌కు ఓ రేటు. ఇదీ.. వాళ్ల ప‌ద్ద‌తి. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కూడా ఇదే ఫాలో అవుతోంది.

ఈ సంక్రాంతికి విడుద‌లైన రౌడీ బోయ్స్ లో త‌నే క‌థానాయిక‌. ఆశిష్ ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. ఆశిష్ కొత్త కాబ‌ట్టి, సినిమాకి కాస్త క్రేజ్ రావాలంటే స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుంద‌ని చిత్ర‌బృందం భావించింది. అందుకే అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ని ఎంచుకుంది. హీరో కొత్త క‌దా.. అందుకే మామూలుగా తీసుకునే పారితోషికం కంటే 50 శాతం ఎక్కువే ఈ సినిమాకి అందుకొంది. దాంతో పాటు… అద‌న‌పు ఛార్జీలు వ‌సూలు చేసింద‌ని టాక్‌. ఈ సినిమాలో లిప్ లాప్ సీన్లు కొన్నున్నాయి. వాటి కోసం.. ఎక్స్‌స్ట్రా ఛార్జ్ తీసుకుంద‌ని స‌మాచారం. క‌థ చెప్పేట‌ప్పుడు త‌న‌కు ముద్దుల గురించి చెప్ప‌లేద‌ని, ఆ త‌ర‌వాత‌.. వాటిని యాడ్ చేయ‌డం వ‌ల్ల‌.. ‘పారితోషికం పెంచితేనే ఆ సీన్లు చేస్తా’ అని ష‌ర‌తు విధించింద‌ని టాక్‌. అనుప‌మ అలా అడిగేస‌రికి.. నిర్మాత దిల్ రాజు కూడా కాద‌న‌లేక‌పోయాడ‌ట‌. అలా.. ఈ సినిమాతో బాగానే గిట్టుబాటు చేసుకుంది అనుపమ‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నాగ‌శౌర్య టైటిల్ ‘రంగ‌బ‌లి’?

ఇటీవ‌లే 'కృష్ణ వ్రింద విహారి'తో ఆక‌ట్టుకొన్నాడు నాగ‌శౌర్య‌. ఇప్పుడు ఓ కొత్త సినిమాని ప‌ట్టాలెక్కించాడు. ప‌వ‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. దీనికి 'రంగ‌బ‌లి' అనే ప‌వర్‌ఫుల్ టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు టాక్‌. 'రంగ' అనే...

రేపట్నుంచే విశాఖ నుంచి జగన్ పాలన చేస్తే ఎవరాపుతారు .. మినిస్టర్ !?

సుప్రీంకోర్టులో అమరావతి పిటిషన్లపై స్టే రాలేదు. సీఆర్డీఏ చట్టంలో పేర్కొన్నట్లుగా ఫలానా తేదీలోపు కట్టివ్వాలన్న అన్న అంశంపైనే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కానీ వైసీపీ నేతలు దాన్ని చిలువలు..పలువుగా చెప్పుకుంటున్నారు. స్టే...

నేనే వాళ్ల‌కు పోటీ: చిరంజీవి

చిరంజీవి సాధించిన అవార్డుల జాబితాలో మ‌రోటి చేరింది. ఇండియ‌న్ ఫిల్మ్ ప‌ర్స‌నాటిలీ ఆఫ్ ది ఇయ‌ర్ 2022 అవార్డుని చిరంజీవికి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. గోవాలో జ‌రుగుతున్న అంత‌ర్జాతీయ చల‌న చిత్రోత్స‌వాల్లో భాగంగా...

కొవ్విరెడ్డి శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ – ఎవరీయన ?

ఢిల్లీలోని తమిళనాడు భవన్‌లో హఠాత్తుగా సీబీఐ అధికారులు రెయిడ్ చేసి... కొవ్విరెడ్డి శ్రీనివాస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే.. ఆయనకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేయాలని.. హైదరాబాద్, విశాఖ సీబీఐ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close