అలిగిన అనుప‌మ‌.. ప్రీ రిలీజ్‌కి డుమ్మా!

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ అలిగింది. ఆ ఎఫెక్ట్ ‘టిల్లు స్వ్కేర్‌’ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ పై ప‌డింది. డీజే టిల్లు ప్రీ రిలీజ్ వేడుక బుధ‌వారం రాత్రి హైద‌రాబాద్ లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి క‌థానాయిక అనుప‌మ రాలేదు. దానికి కార‌ణం అనుప‌మ‌కు కోపం వ‌చ్చింది. టీమ్ మీద కాదు. ఫ్యాన్స్ మీద‌.

విష‌యం ఏమిటంటే.. ‘టిల్లు స్క్వేర్‌’లో అనుప‌మ క‌థానాయిక‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో ఎప్పుడూ లేనంత హాట్ గా క‌నిపిస్తోంది అనుప‌మ‌. లిక్ లాక్కుల‌తో రెచ్చిపోయింది. పోస్ట‌ర్ల కోసం కూడా హాట్ పోజులిచ్చింది. తాజాగా ఓ పోస్ట‌ర్ విడుద‌లైంది. అందులో.. సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ ఒడిలో కూర్చున్న స్టిల్ మ‌రింత హాట్ గా క‌నిపిస్తోంది. ఈ పోస్ట‌ర్ బాగా వైర‌ల్ అయ్యింది. అనుప‌మ ఇలా రెచ్చిపోతోందేంటి? అని చాలామంది ఆశ్చ‌ర్య‌పోతే, ఇంకొంత‌మంది ట్రోల్ చేయ‌డం మొద‌లెట్టారు. కామెంట్లు కూడా శ్రుతిమించాయి. దాంతో..అనుప‌మ అలిగింద‌ని, ఆ కార‌ణంతోనే ప్రీ రిలీజ్ కి డుమ్మా కొట్టింద‌ని తెలుస్తోంది. సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ త‌న‌ స్పీచ్ లోనూ అదే చెప్పాడు. ”ఫీమేల్‌ యాక్టర్స్ గురించి కామెంట్ చేసేట‌ప్పుడు కాస్త హుందాగా వ్యవహరిస్తే మంచిది. ఒక అమ్మాయిని కామెంట్ చేస్తే అది అందంగా, అంద‌రూ ఎంజాయ్ చేసేలా ఉండాలి. ఇబ్బంది పెట్టకూడదు. సెన్సిటివ్ మ్యాటర్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొంత మంది అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇలాంటి మందికాదు” అని సిద్దు హిత‌వు ప‌లికాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

అలాంటి పెళ్లి చేసుకోను: ఫరియా అబ్దుల్లాతో చిట్ చాట్

‘జాతిరత్నాలు’ సినిమాతో మెరిసింది ఫరియా అబ్దుల్లా. ‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. ఫట్టుమని పేలిందా నా గుండె ఖలాసే’ అంటూ యూత్ హృదయాల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు అల్లరి నరేష్ కి జోడిగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close