మహానటి సావిత్రి కథ… వెండి తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవడే సుబ్రమణ్యంతో ఆకట్టుకొన్న నాగ్ అశ్విన్ సావిత్రి కథని స్క్రిప్టు రూపంలో తయారు చేసేశారు. ఈ చిత్రానికి అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరిస్తారు. సావిత్రి పాత్ర కోసం హేమా హేమీల్లాంటి కథానాయికల పేర్లు పరిశీలనకు వచ్చాయి. చివరికి నిత్యమీనన్ దగ్గర ఈ స్క్రిప్టు ఆగింది. నిత్య ఈ కథ విని… ఎగ్జైట్ అయినట్టు, తను ఈ సినిమాలో నటించడానికి సముఖంగా ఉన్నట్టు వార్తలొచ్చాయి. ఇప్పుడు సడన్గా అనుష్క కూడా రేసులోకి వచ్చింది. వైజయంతీ మూవీస్ బ్యానర్లో అనుష్క ఓ సినిమా చేయాలని అనుష్క… స్వీటీతో ఓ సినిమా చేయాలని అశ్వనీదత్ చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. సావిత్రి పాత్రకు అనుష్క కూడా ఓ ఆప్షనే. అయితే… అనుష్క బిజీ షెడ్యూల్స్ వల్ల.. ఆ ఆఫర్ నిత్య వరకూ వచ్చి ఆగింది.
సావిత్రి పాత్రకు నిత్య బెస్ట్ ఆప్షన్. అందులో డౌటు లేదు. కానీ.. అనుష్క అయితే మార్కెట్పరంగానూ, క్రేజ్ పరంగానూ ఈ సినిమా స్థాయి మరోలా ఉంటుంది. పైగా నిత్యతో వేగడం కష్టమని అశ్వనీదత్ భయపడుతున్నాడట. పైగా నిత్య చాలా కండీషన్లు పెడుతోందని సమచారం. అందుకే.. అనుష్కని సంప్రదిచాడు అశ్వనీదత్. అనుష్కేమో… ‘డేట్లు కుదిరితే చెప్తా’ అంటోందట. అనుష్క డేట్లు ఇస్తు.. సావిత్రిగా స్వీటీనే ఫైనల్. లేదంటే నిత్యతో అడ్జస్ట్ అయిపోవాల్సిందే.